Viral News: అల వైకుంఠపురం సినిమా కథ నిజంగానే జరిగింది- డ్రైవర్‌గా పెరిగిన ఆ వ్యక్తికి చివరికి కోట్లు వచ్చాయి !
Ala Vaikunthapuram Story: అతను ఓ ధనవంతుల కుటుంబంలో పుట్టాడు. కానీ ఆస్పత్రిలో పేద ఇంట్లో పుట్టినట్లుగా మార్చారు. 60 ఏళ్లకు నిజం తెలిసింది.

Movie Like Story:అనగనగా ఓ పేదింటి కుర్రాడు. తాను ఖచ్చితంగా ధనవంతుడ్నని అనుకుంటూ ఉంటాడు. చివరికి తాను నిజంగానే ధనవంతుల ఇంట పుట్టానని..కానీ ఆస్పత్రిలో మార్చారని తెలుసుకుంటాడు. ఇది అల వైకుంఠపురం అనే సినిమాకథ అచ్చంగా ఇలాగే ఓ వ్యక్తికి జరిగింది. కానీ మన దేశంలో కాదు..జపాన్‌లో.
జీవితాంతం కష్టాలు అనుభవించిన 60 ఏళ్ల ట్రక్ డ్రైవర్, తన పుట్టినప్పటి రహస్యాన్నితెలుసుకున్న తర్వాత ఆశ్చర్యపోయాడు. బేబీ స్విచ్ కారణంగా, అతను పేద కుటుంబంలో పెరిగాడు. ట్రక్ డ్రైవర్ గా బతుకుతున్న అరవై ఏళ్ల వ్యక్తి తమ కుటుంబ చరిత్రలో కొన్ని విభేదాలు గమనించడంతో అతను తన మూలాల గురించి స్వయంగా పరిశోధన చేసుకున్నాడు పాత డాక్యుమెంట్లు, కుటుంబ రికార్డులు ,DNA పరీక్షల సహాయంతో అతను తన పుట్టినప్పటి రహస్యాన్ని కనుగొన్నాడు. ఆ తర్వాత తన హక్కుల కోసం చట్టపరమైన పోరాటానికి దిగాడు.
టోక్యోలోని సుమిడా వార్డ్‌లోని శాన్-ఇకుకై ఆసుపత్రిలో మార్చి 1953లో జన్మించిన ఆ వ్యక్తిని పొరపాటున 13 నిమిషాల తర్వాత జన్మించిన మరొక బిడ్డతో మార్చుకున్నారు. 100 చదరపు అడుగుల చిన్న అపార్ట్‌మెంట్‌లో ఒంటరి తల్లి అతన్ని పెంచింది, అతని తల్లిదండ్రులతో అతనికి చాలా తక్కువ పోలికలు ఉన్నాయని కుటుంబం మరియు పొరుగువారు తరచుగా గుర్తుచేసేవారు. తనను తాను పోషించుకోవడానికి పార్ట్‌టైమ్ పని చేయవలసి వచ్చింది, అతను పాఠశాలకు వెళ్లడానికి చాలా కష్టపడి చివరికి లారీ డ్రైవర్ అయ్యాడు.అలాగే అతని బదులు వేరే వ్యక్తిని పెంచుకున్న వారు 2009లో DNA పరీక్షలో పెద్ద కొడుకు కుటుంబానికి జీవశాస్త్రపరంగా సంబంధం లేదని నిర్ధారించారు. ఈ విషయం బయటపడిన తర్వాత, ఆసుపత్రి రికార్డుల దర్యాప్తులో లారీ డ్రైవర్ పుట్టినప్పుడు వేరే చోటికి మారిన బిడ్డగా గుర్తించారు.
రహస్యం తెలిసిన వెంటనే, ట్రక్ డ్రైవర్ తన హక్కులు, వారసత్వం కోరుతూ కోర్టులో కేసు వేశాడు. ధనవంతుల కుటుంబం తమ బిడ్డ మారిపోయిందని గుర్తించలేదు. తాము తమ బిడ్డే అనుకుని వేరే వారి బిడ్డను పెంచుకున్నామని అనుకోలేదు. కానీ ట్రక్ డ్రైవర్ ఆధారాలు సేకరించి కోర్టులో వాదించారు. బేబీ స్విచ్‌ను నిరూపించడం సవాల్ అయినా.. ఆ అరవై ఏళ్ల వ్యక్తి నిరూపించాడు. కోర్టు, ఈ అన్యాయాన్ని అంగీకరించి, ధనవంత కుటుంబాన్ని వారసత్వం అంగీకరించాలని ఆదేశించింది.
In 2013, a Japanese man sued the hospital he was born in after discovering he was accidentally switched at birth in 1953. Born to wealthy parents but switched at birth, he lived in poverty for decades.H He was later awarded about $371,000 in damages. pic.twitter.com/R17I7z8VCB
— non aesthetic things (@PicturesFoIder) July 17, 2025
వాదనల తర్వాత కోర్టు తీర్పు ట్రక్ డ్రైవర్‌కు అనుకూలంగా వచ్చింది. అతనికి 2.8 కోట్ల రూపాయలు ఇవ్వాలని ఇవ్వాలని ఇ్ఆదేశించింది. ఈ మొత్తం, అతని జీవితంలో ఎదురైన మానసిక, ఆర్థిక మరియు సామాజిక కష్టాలకు పరిహారంగా ఇవ్వబడింది. ఇది అతనికి ఆర్థిక భద్రతను అందించడమే కాకుండా, తన గుర్తింపును తిరిగి పొందినట్లు అయింది.





















