అన్వేషించండి

Thar Roxx: మహీంద్రా థార్ రాక్స్ MX5 కొంటే పైసా వసూల్‌ అవుతుందా, మనీ వేస్ట్‌ అవుతుందా?

Mahindra Thar Roxx MX5 Variant: మహీంద్రా బ్రాండ్‌లో చాలా SUVలు లాంచ్‌ అయ్యాయి. మరి, థార్ రాక్స్ గొప్పదనం ఏంటి, దీనిలో ఏ వేరియంట్ కొనడం ప్రయోజనకరం?.

Mahindra Thar Roxx MX5 Variant Price, Mileage And Features: SUV సెగ్మెంట్‌ను మహీంద్రా థార్‌ రాక్స్‌ నిజంగానే రాక్‌&షేక్‌ చేస్తోంది, కస్టమర్ల నుంచి మంచి స్పందన పొందుతోంది. ఈ SUV విడుదలైనప్పటి నుంచి దీనికి చాలా డిమాండ్‌ ఉంది. మీరు థార్ రాక్స్ కొనే ప్లాన్‌లో ఉంటే, MX5 వేరియంట్ మీకు బెస్ట్‌ ఉత్తమమైన & డబ్బుకు తగిన విలువ కలిగిన ఎంపిక అవుతుందో, లేదో తెలుసుకోండి.

మహీంద్రా థార్ రాక్స్ MX5 ఫీచర్లు
మహీంద్రా థార్ రాక్స్ MX5 వేరియంట్ ఒక మిడ్-రేంజ్ SUV అయినప్పటికీ, ఫీచర్ల పరంగా (Mahindra Thar Roxx MX5 Features) ప్రీమియం ఆప్షన్‌ అవుతుంది. ఇందులో 26.03 సెం.మీ. భారీ HD టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, 4 స్పీకర్లు & 2 ట్వీటర్లు, వైర్‌లెస్ ఛార్జింగ్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్‌మెంట్, స్లైడింగ్ ఆర్మ్‌రెస్ట్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ & యాక్టివ్ కార్బన్ ఫిల్టర్ వంటి కంఫర్టబుల్‌ ఫీచర్లు ఉన్నాయి. ఇంకా.. రియర్ AC వెంట్, ఆటో హెడ్‌ల్యాంప్, ఫాలో-మీ హెడ్‌ల్యాంప్, ఆటో వైపర్, రియర్ డీఫాగర్ & వాషర్, సింగిల్ పేన్ సన్‌రూఫ్, లెథరెట్ సీటింగ్‌, LED హెడ్‌ల్యాంప్ & ఫాగ్ లైట్లు వంటి ప్రీమియం ఎలిమెంట్స్‌ కూడా ఉన్నాయి.

సేఫ్టీ ఫీచర్లు
భద్రత విషయంలోనూ మహీంద్రా థార్ రాక్స్ MX5 వేరియంట్‌ (Mahindra Thar Roxx MX5 Safety Features) తక్కువ కాదు. ఈ వేరియంట్‌లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), ముందు & వెనుక పార్కింగ్ సెన్సార్లు, ఆటో డిమ్మింగ్ IRVM, ఎత్తును సర్దుబాటు చేయగల సీట్ బెల్టులు, ISOFIX చైల్డ్ యాంకర్ పాయింట్లు, ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్‌లు & వెనుక డిస్క్ బ్రేక్స్‌ ఉన్నాయి. ESC, HHC, HDC, TCS, ROM, బ్రేక్ డిస్క్ వైపింగ్, కార్నర్ బ్రేకింగ్ కంట్రోల్, EBD, ABS, ESS & VDC వంటి అత్యాధునిక భద్రత సాంకేతికతలు కూడా ఈ బండిలో చూడవచ్చు. ఈ రక్షణల ఫలితంగా మహీంద్రా థార్ రాక్స్ MX5 వేరియంట్‌ ఈ సెగ్మెంట్‌లో సురక్షితమైన SUVగా నిలిచింది.

పనితీరు ఎలా ఉంది?
మహీంద్రా థార్ రాక్స్ MX5 రెండు ఇంజిన్ ఆప్షన్స్‌తో లాంచ్‌ అయింది. మొదటి ఆప్షన్ 2.0L mStallion టర్బో పెట్రోల్ ఇంజిన్, ఇది మాన్యువల్ & ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది, పవర్‌ఫుల్‌ పికప్‌తో స్మూత్‌ జర్నీని అందిస్తుంది. రెండో ఆప్షన్‌ 2.2L mHawk డీజిల్ ఇంజిన్, ఇది RWD & 4WD లో ఉంటుంది. లో-ఎండ్‌ టార్క్ & ఇంధన సామర్థ్యం కోసం ఇది మంచిది.

ధర 
మహీంద్ర థార్ రాక్స్ MX5 పెట్రోల్ వేరియంట్ (MT, RWD) ఎక్స్-షోరూమ్ ధర (Mahindra Thar Roxx MX5 ex-showroom price) రూ. 16.70 లక్షలు కాగా, డీజిల్ వేరియంట్ (MT, 4WD) ఎక్స్-షోరూమ్‌ ధర రూ. 19.39 లక్షలు. ఇన్ని ప్రీమియం ఫీచర్లు & పవర్‌ఫుల్‌ పెర్ఫార్మెన్స్‌తో పోలిస్తే ఈ ధర పూర్తిగా సహేతుకమేనని ఆటో ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు. మహీంద్రా థార్ లైనప్‌లో డబ్బుకు తగిన విలువను అందించే వేరియంట్‌గా నిలిచిందని అంటున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Counter to YS Jagan: అధికారంలో ఉన్నప్పుడు ఏం పీకలేకపోయావు? ఇప్పుడేం చేస్తావు? జగన్‌కు పవన్ స్ట్రాంగ్ కౌంటర్
అధికారంలో ఉన్నప్పుడు ఏం పీకలేకపోయావు? ఇప్పుడేం చేస్తావు? జగన్‌కు పవన్ స్ట్రాంగ్ కౌంటర్
MBBS Students Suicide: మెడికోల ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం చర్యలు.. గ్రామీణ విద్యార్థులపై స్పెషల్ ఫోస్
మెడికోల ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం చర్యలు.. గ్రామీణ విద్యార్థులపై స్పెషల్ ఫోస్
T20 World Cup 2026 Team India Squad :టి20 ప్రపంచ కప్ ఇండియా స్క్వాడ్‌ నుంచి శుభ్‌మన్‌ గిల్ అవుట్‌! బీసీసీఐ ప్రకటించిన జాబితా ఇదే!
టి20 ప్రపంచ కప్ ఇండియా స్క్వాడ్‌ నుంచి శుభ్‌మన్‌ గిల్ అవుట్‌! బీసీసీఐ ప్రకటించిన జాబితా ఇదే!
Year Ender 2025: యాక్టింగ్ చింపేశారుగా... ధృవ్ విక్రమ్ to రుక్మిణి, కల్యాణీ - 2025లో సర్‌ప్రైజ్ చేసిన సౌత్ స్టార్లు 
యాక్టింగ్ చింపేశారుగా... ధృవ్ విక్రమ్ to రుక్మిణి, కల్యాణీ - 2025లో సర్‌ప్రైజ్ చేసిన సౌత్ స్టార్లు

వీడియోలు

Sanju Samson For T20 World Cup 2026 | మొత్తానికి చోటు దక్కింది...సంజూ వరల్డ్ కప్పును శాసిస్తాడా | ABP Desam
Ishan Kishan Named T20 World Cup 2026 | రెండేళ్ల తర్వాత టీ20ల్లో ఘనంగా ఇషాన్ కిషన్ పునరాగమనం | ABP Desam
Shubman Gill Left out T20 World Cup 2026 | ఫ్యూచర్ కెప్టెన్ కి వరల్డ్ కప్పులో ఊహించని షాక్ | ABP Desam
T20 World Cup 2026 Team India Squad Announced | ఊహించని ట్విస్టులు షాకులతో టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ | ABP Desam
Tilak Varma Innings Ind vs SA T20 | అహ్మదాబాద్‌లో రెచ్చిపోయిన తిలక్ వర్మ

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Counter to YS Jagan: అధికారంలో ఉన్నప్పుడు ఏం పీకలేకపోయావు? ఇప్పుడేం చేస్తావు? జగన్‌కు పవన్ స్ట్రాంగ్ కౌంటర్
అధికారంలో ఉన్నప్పుడు ఏం పీకలేకపోయావు? ఇప్పుడేం చేస్తావు? జగన్‌కు పవన్ స్ట్రాంగ్ కౌంటర్
MBBS Students Suicide: మెడికోల ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం చర్యలు.. గ్రామీణ విద్యార్థులపై స్పెషల్ ఫోస్
మెడికోల ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం చర్యలు.. గ్రామీణ విద్యార్థులపై స్పెషల్ ఫోస్
T20 World Cup 2026 Team India Squad :టి20 ప్రపంచ కప్ ఇండియా స్క్వాడ్‌ నుంచి శుభ్‌మన్‌ గిల్ అవుట్‌! బీసీసీఐ ప్రకటించిన జాబితా ఇదే!
టి20 ప్రపంచ కప్ ఇండియా స్క్వాడ్‌ నుంచి శుభ్‌మన్‌ గిల్ అవుట్‌! బీసీసీఐ ప్రకటించిన జాబితా ఇదే!
Year Ender 2025: యాక్టింగ్ చింపేశారుగా... ధృవ్ విక్రమ్ to రుక్మిణి, కల్యాణీ - 2025లో సర్‌ప్రైజ్ చేసిన సౌత్ స్టార్లు 
యాక్టింగ్ చింపేశారుగా... ధృవ్ విక్రమ్ to రుక్మిణి, కల్యాణీ - 2025లో సర్‌ప్రైజ్ చేసిన సౌత్ స్టార్లు
IPS PV Sunil Kumar: రఘురామపై ఐపీఎస్ సునీల్ కుమార్ డైరక్ట్ ఎటాక్ - 420 అంటూ విమర్శలు - ఏం జరగబోతోంది?
రఘురామపై ఐపీఎస్ సునీల్ కుమార్ డైరక్ట్ ఎటాక్ - 420 అంటూ విమర్శలు - ఏం జరగబోతోంది?
SSC CGL Tier 2 Exam 2025: ఎస్సెస్సీ సీజీఎల్ టైర్ 2 అభ్యర్థులకు అలర్ట్.. ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చేసింది
SSC CGL Tier 2 అభ్యర్థులకు అలర్ట్.. ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చేసింది
Christmas offers Fraud: క్రిస్మస్ ఆఫర్ల పేరుతో మోసపోవద్దు.. ఈ 3 మార్గాలలో సైబర్ మోసాల నుండి రక్షించుకోండి
క్రిస్మస్ ఆఫర్ల పేరుతో మోసపోవద్దు.. ఈ 3 మార్గాలలో సైబర్ మోసాల నుండి రక్షించుకోండి
Rishabh Pant Ruled out T20 World Cup: గత టీ20 వరల్డ్ కప్ నెగ్గడంలో కీలకం.. రిషబ్ పంత్ సహా చోటు దక్కని 5 మంది స్టార్లు వీరే
గత టీ20 వరల్డ్ కప్ నెగ్గడంలో కీలకం.. పంత్ సహా చోటు దక్కని 5 మంది స్టార్లు వీరే
Embed widget