అన్వేషించండి
Vehicle breaks down: హైవేపై అకస్మాత్తుగా కారు ఆగిపోతే, ఈ నంబర్‌కు కాల్ చేసి వెంటనే సహాయం పొందండి
Highway helpline numbers | హైవేపై ఒక వాహనం మొరాయిస్తే కనుక ఈ నంబర్‌కు కాల్ చేసి సహాయం పొందవచ్చు. కనీసం గ్యారేజీకి అయినా తీసుకెళ్తారు.
హైవేపై అకస్మాత్తుగా కారు ఆగిపోతే, ఈ నంబర్‌కు కాల్ చేయండి
1/6

కొంచెం సౌకర్యవంతంగా ప్రయాణిచండానికి చాలా మంది వ్యక్తిగతంగా వాహనాలు కొనుగోలు చేస్తారు. అయితే తమ వాహనాలలో హైవే మీద వెళ్తుంటే అకస్మాత్తుగా ఏదో లోపం ఏర్పడి ఆగిపోతే వారు ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
2/6

మీ వాహనం చాలా సార్లు ఎక్కడైతే చెడిపోయిందో అక్కడ వర్క్‌షాప్ కానీ, తెలిసిన వ్యక్తి కానీ ఎవరూ ఉండరు. ఇలాంటి పరిస్థితిలో ఇబ్బంది కలుగుతుంది. కొన్ని సందర్భాలలో భయం వేస్తుంది. ఇకపై ఇలా వాహనాలు హైవేపై ఆగిపోతే ఏ టెన్షన్ అవసరం లేదు.
3/6

మీకు ప్రభుత్వం ఒక సౌకర్యాన్ని ప్రారంభించింది. దీనివల్ల హైవేలపై ప్రయాణించే వారు అకస్మాత్తుగా మొరాయించి తమ వాహనం ఆగిపోతే ఇబ్బంది పడకుండా ఉంటారు. ప్రజల కోసం ఈ సౌకర్యం 24 గంటలూ అందుబాటులో ఉంటుంది. మీకు కావాల్సిన సహాయం అందుకుంటారు.
4/6

ఈ సదుపాయాన్ని వినియోగించుకోవడానికి మీరు ఏమీ చేయనవసరం లేదు. మీరు కేవలం 1033 నంబర్‌కు కాల్ చేసి విషయం చెబితే సరిపోతుంది. ఆ తర్వాత కొంత సమయానికే నే మీకు సహాయం అందుతుంది.
5/6

1033 ఇది జాతీయ రహదారి హెల్ప్ లైన్ నంబర్. ఇది దేశవ్యాప్తంగా సేవలు అందిస్తుంది. కాల్ చేసిన వెంటనే సహాయం వెంటనే మీకు సహాయం లభిస్తుంది. మీరు ఎక్కడ ఉన్నా సహాయం కోసం వచ్చే టీం మీ వాహనాన్ని రిపేర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది.
6/6

సమీపంలోని సర్వీస్ సెంటర్ లేదా సురక్షిత స్థలానికి మీరు వెళ్లడానికి కూడా ఏర్పాట్లు చేస్తారు. హైవేపై మీ కారు అకస్మాత్తుగా చెడిపోతే, ఆందోళన చెందకుండా సహాయం కోసం 1033 జాతీయ హెల్ప్ లైన్ నెంబర్‌కు ఫోన్ చేయండి.
Published at : 10 Aug 2025 09:23 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
సినిమా
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















