Ind vs Aus 3rd odi Highlights: మెరిసిన రోకో.. రోహిత్ 50వ సెంచరీ, కోహ్లీ అర్ధ శతకం.. 9 వికెట్లతో గ్రాండ్ విక్టరీ
India vs Australia 3rd odi Highlights: మూడో వన్డేలో ఆస్ట్రేలియాని భారత్ 9 వికెట్ల తేడాతో ఓడించింది. రోహిత్ శర్మ 121 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించగా, విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేశాడు.

Ind vs Aus 3rd odi Highlights: సిడ్నీలో జరిగిన మూడో వన్డేలో ఆస్ట్రేలియాను 9 వికెట్ల తేడాతో భారత్ ఓడించింది. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అజేయ శతకం (121 పరుగులు) చేసి ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. మరోవైపు ఛేజింగ్ మాస్టర్ విరాట్ కోహ్లీ కూడా 70 పరుగులు చేసి అర్ధ సెంచరీ సాధించి నాటౌట్ గా నిలిచాడు. సిడ్నీలో జరిగిన మూడో వన్డే మ్యాచ్ గెలిచినా, సిరీస్‌ను 2-1 తేడాతో ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. ఇది వన్డే కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌కు తొలి వన్డే విజయం కావడంతో అతడికి ప్రత్యేకం. మరోవైపు రిటైర్మెంగ్ గండం నుంచి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గటెక్కినట్లే అని చెప్పవచ్చు.
మొదట భారత బౌలర్లు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ను 50 ఓవర్లు ఆడనివ్వలేదు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కంగారూ జట్టు కేవలం 236 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. భారత్ తరపున హర్షిత్ రాణా అత్యధికంగా 4 వికెట్లు తీశాడు. వన్డేలలో హర్షిత్ రాణాకు ఇది అత్యుత్తమ ప్రదర్శన కూడా. ఛేజింగ్ లో భారత్ 38.3 ఓవర్లలో వికెట్ నష్టపోయి 237 పరుగులు చేసింది.
📸📸
— BCCI (@BCCI) October 25, 2025
A Ro𝙝𝙞𝙩 Sharma special in Sydney ⭐️
Updates ▶ https://t.co/omEdJjQOBf#TeamIndia | #3rdODI | #AUSvIND | @ImRo45 pic.twitter.com/EA9cGdui7G
మూడో వన్డేలో మెరిసిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ
237 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇండియా 69 పరుగుల వద్ద కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ వికెట్ కోల్పోయింది. గిల్ 24 పరుగులకే ఔటయ్యాడు. ఈ సిరీస్‌లో గిల్ బ్యాటింగ్ లో పూర్తిగా విఫలమయ్యాడు. 3 ఇన్నింగ్స్‌లలో కేవలం 43 పరుగులు మాత్రమే చేశాడు. అయితే తొలి వన్డేలో విఫలమైన రోహిత్ రెండో, మూడో వన్డేలో కీలక ఇన్నింగ్స్ లు ఆడాడు. తొలి రెండు వన్డేల్లో డకౌట్ అయిన విరాట్ కోహ్లీ మూడో వన్డేలో రోహిత్ శర్మతో కలిసి భారత్‌కు విజయాన్ని అందించాడు.
రోహిత్ శర్మ సెంచరీతో (121 పరుగులు) అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. అతని 33వ వన్డే సెంచరీ కాగా, ఓవరాల్ 50వ అంతర్జాతీయ సెంచరీ. రెండవ వికెట్‌కు కోహ్లీ, రోహిత్ 168 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వన్డేల్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ 100 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని 19వ సారి నెలకొల్పారు. సచిన్ టెండూల్కర్-సౌరవ్ గంగూలీ, కుమార్ సంగక్కర- తిలకరత్నే దిల్షాన్ మాత్రమే ఇప్పుడు అత్యధిక సెంచరీ భాగస్వామ్యాల రికార్డును కలిగి ఉన్నారు.
𝙑𝙞𝙣𝙩𝙖𝙜𝙚 𝙍𝙤𝙝𝙞𝙩 🔥
— BCCI (@BCCI) October 25, 2025
1⃣2⃣1⃣* runs
1⃣2⃣5⃣ balls
1⃣3⃣ fours
3⃣ sixes
For his masterclass knock, Rohit Sharma wins the Player of the match award 🥇
Scorecard ▶ https://t.co/omEdJjQOBf#TeamIndia | #3rdODI | #AUSvIND | @ImRo45 pic.twitter.com/OQMTCGzOMD
శుభ్‌మాన్ గిల్ తొలి విజయం
ఆస్ట్రేలియా పర్యటనకు ముందు గిల్ కొత్త వన్డే కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు. అతని కెప్టెన్సీలో ఇండియా మొదటి మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. అడిలైడ్‌లో జరిగిన రెండో వన్డేలోనూ ఓడింది. భారత్ 2 వికెట్ల తేడాతో రెండో వన్డేలో ఓడిపోయింది. కెప్టెన్‌గా తన మొదటి రెండు మ్యాచ్‌ల్లో రెండు ఓడిపోయిన గిల్ సిడ్నీలో జరిగిన మూడో వన్డేలో గెలుపు ఖాతా తెరిచాడు.
ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ (50 బంతుల్లో 41), మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ (29) తొలి వికెట్ కు 61 పరుగులు చేశారు. సిరాజ్ బౌలింగ్ లో హెడ్ ఔటయ్యాడు. మాథ్యూ షార్ట్ (30), మ్యాట్ రెన్షా (56) హాఫ్ సెంచరీలతో రాణించారు. 183 పరుగులకు 4వ వికెట్ కోల్పోయిన ఆసీస్ భారీగా స్కోరు చేస్తుందనిపించింది. కానీ కీలక సమయంలో పేసర్ హర్షిత్ రాణా వికెట్ల వేట మొదలుపెట్టడంతో ఆసీస్ 236 పరుగులకే ఆలౌట్ అయింది. 38 పరుగుల తేడాలో ఆసీస్ చివరి 5 వికెట్లను కోల్పోయింది.





















