Rohit Sharma Record Century: మూడో వన్డేలో రోహిత్ శర్మ సెంచరీ.. కోహ్లీ రికార్డు బద్ధలు, ప్రపంచంలో నెంబర్ 1 బ్యాటర్
India vs Australia 3rd Odi highlights: ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో Team India ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీ సాధించాడు. ఇది అంతర్జాతీయ క్రికెట్లో 50వ శతకం.

Rohit Sharma ODI Century: టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ మూడో వన్డేలో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో 237 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీ చేశాడు. రోహిత్ శర్మ(100 పరుగులు నౌటౌట్, 105 బంతుల్లో 11x4 2x6)తో తనదైన ఇన్నింగ్స్ లో చెలరేగాడు. రెండో వన్డేలో కీలక ఇన్నింగ్స్ ఆడినా జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. కానీ మూడో వన్డేలో ఆసీస్ బౌలర్లకు ఆ చాన్స్ ఇవ్వలేదు. మొదట్నుంచీ ఆచితూచి ఆడుతూ, చెత్త బంతులను బౌండరీలకు తరలించాడు.
సిరీస్‌లో తొలి సెంచరీ.. వన్డేల్లో 33వ శతకం..
ఆసీస్ స్పిన్నర్ ఆడం జంపా వేసిన ఇన్నింగ్స్ 33వ ఓవర్ చివరి బంతికి సింగిల్ చేసి రోహిత్ శర్మ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సిరీస్ లో తొలి సెంచరీ కాగా, వన్డే కెరీర్ లో హిట్ మ్యాన్ కిది 33వ శతకం. సెంచరీ చేసిన రోహిత్ ను మాజీ కెప్టెన్, సహచరుడు విరాట్ కోహ్లీ అభినందించాడు. సెంచరీ చేసే క్రమంలో రెండో వికెట్ కు కోహ్లీతో కలిసి 19వ సారి వన్డేల్లో శతక భాగస్వాయ్యం నెలకొల్పాడు రోహిత్.
ప్రపంచంలో ఒకే ఒక్క బ్యాటర్ రోహిత్ శర్మ
టెస్టుల్లో 12, టీ20 ఇంటర్నేషనల్‌లో 5 సెంచరీలు చేసిన రోహిత్ వన్డేల్లో 33 శతకాలు బాదేశాడు. దాంతో అంతర్జాతీయ క్రికెట్‌లో రోహిత్ శర్మ 50 సెంచరీలు పూర్తి చేసుకుని అరుదైన ఆటగాళ్ల జాబితాలో చేరాడు. అంతర్జాతీయ క్రికెట్ వన్డే, టీ20, టెస్టుల్లో ప్రతి ఫార్మాట్‌లలో 5 లేదా అంతకంటే ఎక్కువ సెంచరీలు సాధించిన ప్రపంచంలోనే ఏకైక బ్యాట్స్‌మెన్ రోహిత్ అని తెలిసిందే.
2️⃣0️⃣2️⃣ runs 👏
— BCCI (@BCCI) October 25, 2025
2️⃣1️⃣ fours 👌
5️⃣ sixes 👍
A splendid century 💯
For his superb batting, Rohit Sharma is adjudged the Player of the Series! 🔝
Scorecard ▶ https://t.co/omEdJjRmqN#TeamIndia | #3rdODI | #AUSvIND | @ImRo45 pic.twitter.com/Bq2hS8IHLS
ఆస్ట్రేలియాలో అత్యధిక వన్డే సెంచరీలు
రోహిత్ శర్మకు ఆస్ట్రేలియాలో వన్డేలో ఇది ఆరో సెంచరీ. దీంతో పాటు హిట్‌మ్యాన్ ఇప్పుడు ఆస్ట్రేలియాలో అత్యధిక వన్డే సెంచరీలు సాధించిన పర్యాటక జట్టు బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. రోహిత్ 33వ ఇన్నింగ్స్‌లో ఇది ఆరో సెంచరీ. ఇంతకుముందు ఈ రికార్డు భారత దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లీ పేరిట ఉంది. విరాట్ ఆస్ట్రేలియాలో 32 వన్డే ఇన్నింగ్స్‌లలో 5 సెంచరీలు చేశాడు. శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర కూడా ఆస్ట్రేలియాలో 5 సెంచరీలు సాధించాడు. తాజా సెంచరీతో ఈ జాబితాలో రోహిత్ నెంబర్ వన్ అయ్యాడు.
కోహ్లీ హాఫ్ సెంచరీ
తొలి రెండు వన్డేలో విఫలమైన విరాట్ కోహ్లీ సిడ్నీలో జరిగిన మూడో వన్డేలో రాణించాడు. హాఫ్ సెంచరీతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సిరీస్ ఓటమి పాలైనా ముగింపు మాత్రం ఘనంగా ఉంది. చాలా రోజుల వరువాత మ్యాచ్ లాడుతున్న కోహ్లీ, రోహిత్ లు టచ్ లోకి వచ్చారు. వారి బ్యాటింగ్, ఫామ్, ప్రదర్శన, వయసుపై వస్తున్న ఆరోపణలకు చెక్ పెట్టారు.
రోహిత్ శర్మ మ్యాచ్ విన్నింగ్ సెంచరీ సాధించాడు. ఈ సమయంలో హిట్‌మ్యాన్ బ్యాట్ నుండి 11 ఫోర్లు, 2 సిక్సర్లు వచ్చాయి. వన్డే క్రికెట్‌లో రోహిత్ శర్మకు ఇది 33వ సెంచరీ. అలాగే ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌లో రోహిత్ పేరు మీద 50 సెంచరీలు నమోదయ్యాయి.





















