Vida VX2: కొత్త గేమ్ స్టార్ట్ చేసిన హీరో - సబ్‌స్క్రిప్షన్ మోడల్‌లో తక్కువ రేటుకే ఎలక్ట్రిక్ స్కూటర్
Vida VX2 Electric Scooter: విడా VX2 ఎలక్ట్రిక్ స్కూటర్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లతో వచ్చే నెలలో లాంచ్ కానుంది. దాని ఫీచర్లు, లాంచ్ వివరాలు, సబ్‌స్క్రిప్షన్ మోడల్ గురించి తెలుసుకోండి.

Vida VX2 Electric Scooter Price, Range And Feature: హీరో మోటోకార్ప్ ఎలక్ట్రిక్ బ్రాండ్ విడా మళ్లీ వార్తల్లో నిలిచింది & దీనికి కొత్త బడ్జెట్ ఎలక్ట్రిక్ స్కూటర్ - విడా VX2. ఈ బండి జులై 1, 2025న లాంచ్ అవుతుంది. ఈ స్కూటర్‌ను ప్రత్యేకంగా కొత్త సబ్‌స్క్రిప్షన్ మోడల్‌తో విడుదల చేస్తున్నారు. అంటే బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) మోడల్‌లో వస్తోంది, ఫలితంగా దీని ధర చాలా తగ్గుతుంది.
BaaS మోడల్ అంటే ఏమిటి?
బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (Battery-as-a-service - BaaS) మోడల్ అనేది కస్టమర్లు స్కూటర్ "బ్యాటరీని కొనడానికి బదులుగా అద్దెకు తీసుకునే వ్యవస్థ". ఇది, మనం మొబైల్ డేటా లేదా OTT రీఛార్జ్ చేసుకున్నట్లే, మీకు అవసరమైన దానికి మాత్రమే చెల్లించొచ్చు. ఈ మోడల్‌లో అతి పెద్ద ప్రయోజనం - Vida VX2 స్కూటర్ ప్రారంభ ధర గణనీయంగా తగ్గుతుంది. కస్టమర్లు తమ అవసరానికి అనుగుణంగా వివిధ బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లను (Battery subscription plans) ఎంచుకోవచ్చు.
ఈ తరహా ప్లాన్స్ ఉండవచ్చు
Vida VX2 కోసం సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లలో.. ప్రతిరోజూ ఆఫీసుకు లేదా పనికి వెళ్లే వారి కోసం “డైలీ కమ్యూటర్ ప్లాన్”, అప్పుడప్పుడు స్కూటర్‌ను ఉపయోగించే కస్టమర్‌ల కోసం “వీకెండ్ ప్లాన్” & ప్రతిరోజూ ఎక్కువ దూరం ప్రయాణించి ఎక్కువ మైలేజ్ అవసరమయ్యే రైడర్‌ల కోసం “అన్‌లిమిటెడ్ ప్లాన్” వంటివి ఉండవచ్చు.
డిజైన్ & ఫీచర్లు
Vida VX2 డిజైన్ & ఫీచర్లను EICMAలో మొదట ప్రవేశపెట్టిన Vida Z కాన్సెప్ట్ ఆధారంగా రూపొందించారు. Vida V2తో పోలిస్తే Vida VX2 చవకైన వెర్షన్, బడ్జెట్-ఫ్రెండ్లీ కస్టమర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. యువత కోసం వివిధ కలర్ ఆప్షన్స్‌లో వస్తోంది. సమర్థవంతమైన బ్యాటరీ ప్యాక్‌తో ఈ EVని లాంచ్ చేయవచ్చు. తేలికైన బాడీ డిజైన్ సింపుల్‌గా, ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో మినీ TFT డిస్‌ప్లే కూడా కనిపిస్తుంది, ఇది స్కూటర్‌కు స్మార్ట్ టచ్ ఇస్తుంది. ఇది లాంచ్ అయితే, ఈ బ్రాండ్‌లో ఇప్పటివరకు వచ్చిన చౌవకైన ఎలక్ట్రిక్ స్కూటర్ అవుతుంది.
బుకింగ్ & డెలివరీ
హీరో మోటోకార్ప్ విడా VX2 బుకింగ్ & డెలివరీ ఈ EV లాంచింగ్ నుంచి ప్రారంభం అవుతాయి. స్కూటర్ లాంచింగ్ ప్రారంభం తర్వాత దేశంలోని ప్రధాన నగరాల్లో అందుబాటులోకి వస్తుంది.
ఏ స్కూటర్లకు పోటీ?
Bajaj Chetak 3001, Ola S1 Air, Ather 450S & TVS iQube (బేస్ వెర్షన్) వంటి ప్రముఖ బడ్జెట్ ఎలక్ట్రిక్ స్కూటర్లతో విడా VX2 నేరుగా పోటీ పడుతుంది.
లాంచింగ్‌కు ముందు, కంపెనీ Vida VX2 కోసం వివిధ సబ్‌స్క్రిప్షన్ రేట్లు & వేరియంట్‌ల గురించి సమాచారాన్ని అందిస్తుందని భావిస్తున్నారు. వ్యక్తిగత వినియోగదారులు, కార్యాలయాలకు వెళ్లేవాళ్లు & లాంగ్ డ్రైవ్ కోరుకునేవాళ్లకు కోసం వేర్వేరు ప్రణాళికలు ఉండవచ్చు, తద్వారా ప్రతి వర్గానికి చెందిన కస్టమర్‌కు ఇది మెరుగైన ఎంపిక ఉంటుంది.





















