అన్వేషించండి

Flying Bike: గాలిలో ఎగిరే బైక్‌ వచ్చిందోచ్‌ - ట్రాఫిక్‌ జామ్‌ల చింతే లేదు, తుర్రున ఎగిరిపోవచ్చు

Flying Bike Skyrider X6: చైనా కంపెనీ కుయిక్‌వీల్, స్కైరైడర్ X6 అనే ఎగిరే బైక్‌ను లాంచ్‌ చేసింది. దాని ధర, పరిధి, టాప్ స్పీడ్ గురించి వివరంగా తెలుసుకుందాం.

Flying Bike Skyrider X6 Price, Range And Features: ప్రపంచవ్యాప్తంగా, ఎగిరే కార్ల గురించి చాలాకాలంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పుడు, చైనా టెక్ కంపెనీ Kuickwheel మొదటిసారిగా ఎగిరే బైక్ Skyrider X6 ను ప్రవేశపెట్టింది. ఈ బైక్ నేలపై నడుస్తుంది, గాలిలోనూ ఎగురుతుంది.

Skyrider X6 అనేది మూడు చక్రాల బండి. నేలపై ఇది గంటకు 70 కి.మీ. గరిష్ట వేగంతో దూసుకెళ్లగలదు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 200 కి.మీ. ‍‌(Skyrider X6 Range) వరకు ప్రయాణించగలదు. పరిమాణంలో చిన్నగా ఉండడం వల్ల పట్టణ ట్రాఫిక్‌లోనూ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

స్కైరైడర్ X6 ప్రత్యేకత ఏమిటి?
స్కైరైడర్ X6 లో అతి పెద్ద ఫీచర్‌ దాని డ్యూయల్ మోడ్ (గ్రౌండ్‌ మోడ్‌ & ఫ్లయింగ్‌ మోడ్‌) కాన్ఫిగరేషన్. ఈ ఫీచర్‌ కారణంగా ఈ బైక్ అవసరమైతే గాలిలో కూడా ఎగురుతుంది. స్కైరైడర్ X6 ధర (Flying Bike Skyrider X6 Price) 4,98,800 యువాన్లు. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ. 59.87 లక్షలు. దీని ప్రి-బుకింగ్ చైనాలో ఇప్పటికే ప్రారంభమైంది.

ఫ్లయింగ్ మోడ్ వివరాలు 
ఫ్లయింగ్ మోడ్‌లో (Skyrider X6 Flying Mode), స్కైరైడర్ X6 లో 6 ఆక్సిస్‌ & 6 రోటర్‌ కలిగి ఉంటుంది. గంటకు 72 కి.మీ. వేగంతో గరిష్టంగా 20 నిమిషాల పాటు గాలిలో ఎగరగలదు. ఈ బండిని ఫ్లయింగ్ మోడ్‌లో గాలిలోకి టేకాఫ్‌ చేయడానికి జాయ్‌స్టిక్ ఆధారిత ఆపరేషన్ సిస్టమ్‌ ఉంది, కాబట్టి దీనిని ఆపరేట్ చేయడం చాలా సులభం.

గ్రౌండ్ పెర్ఫార్మెన్స్
స్కైరైడర్ X6 ను చాలా స్ట్రాంగ్‌గా నిర్మించారు. ఈ బండి నిర్మాణంలో కార్బన్ ఫైబర్ కాంపోజిట్ & ఏవియేషన్ గ్రేడ్ అల్యూమినియం ఉపయోగించారు. కాబట్టి ఇది తేలికగా & బలంగా ఉంటుంది. ఎలక్ట్రానిక్‌ వెహికల్‌ (EV) కాబట్టి ఇంధనం ఖర్చులు ఆదా అవుతాయి, తక్కువ వ్యయంతో ప్రయాణం చేయవచ్చు.

సేఫ్టీ ఫీచర్లు
ఒకవేళ గాలిలో ఏదైనా అనుకోని పరిస్థితి ఎదురైతే ప్రయాణీకుడి ప్రాణ రక్షణ కోసం ఇందులో బాలిస్టిక్ పారాచూట్‌ వంటి సేఫ్టీ ఫీచర్‌ అందించారు. ఆటో టేకాఫ్, ల్యాండింగ్, రూట్ ప్లానింగ్ & క్రూయిజింగ్ వంటి ఆటోమేటెడ్ సిస్టమ్స్‌ కూడా ఉన్నాయి.

స్కైరైడర్ X6 ప్రత్యేకంగా స్వల్ప దూర ప్రయాణం & అత్యవసర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రూపొందించారు. వైద్యపరమైన అత్యవసర పరిస్థితులు, ట్రాఫిక్ జామ్‌ లేదా మారుమూల ప్రాంతాలకు త్వరగా చేరుకోవాల్సిన అవసరం వంటివాటిని దృష్టిలో పెట్టుకుని డిజైన్‌ చేశారు. 

హైదరాబాద్‌ వంటి నగరాల్లో ఆఫీస్‌కు వెళ్లాలంటే ఇంటి నుంచి గంటన్నర ముందు బయలుదేరాల్సిన పరిస్థితి ఉంది. మహా నగరాల్లో కనీసం రెండు గంటల ముందు స్టార్ట్‌ కావాలి. ఆఫీస్‌ నుంచి ఇంటికి చేరడానికి కూడా దాదాపు ఇదే సమయం పడుతుంది. వర్షాకాలం కష్టాలు నరకాన్ని తలపిస్తాయి. కాబట్టి, భారతదేశానికి కూడా స్కైరైడర్ X6 లాంటి వాహనం అవసరం. వైద్య అత్యవసర పరిస్థితులు, ప్రకృతి విపత్తుల సమయంలో కొండ ప్రాంతాలు, మారుమూల పల్లెలకు చేరడానికి ఇవి చాలా ఉపయోగపడతాయి. ట్రాఫిక్ నుంచి ఉపశమనం & ప్రత్యామ్నాయ రవాణా పరిష్కారంగా స్కైరైడర్ X6 వంటి ఎగిరే వాహనాల అవసరం ఉంది.

టాప్ హెడ్ లైన్స్

Maruti Dzireకు ప్రత్యామ్నాయంగా Honda Amaze కొనబోతున్నారా? ముందు ఈ నిజాలు కచ్చితంగా తెలుసుకోండి
కొత్త Honda Amaze కొనేవాళ్లకు అలెర్ట్‌! ఈ సెడాన్‌లో మీకు తెలియాల్సిన 3 ప్లస్‌లు, 3 మైనస్‌లు!
Ethanol: పెట్రోల్ తర్వాత డీజిల్‌పైనా ప్రయోగం.. ఇథనాల్‌పై కేంద్రం ఎందుకు వెనక్కి తగ్గింది?
డీజిల్‌లో ఇథనాల్ కలపడం కుదరదు.. అసలు కారణం ఇదే!
బాబర్ బైక్ సెగ్మెంట్‌లో కొత్త పోరు.. గోవాన్ క్లాసిక్ 350తో హోండా రెబెల్ 300 పోటీ!
హోండా రెబెల్ 300 vs రాయల్ ఎన్‌ఫీల్డ్‌ గోవాన్ క్లాసిక్ 350 - ఏది స్పెషల్‌ బైక్‌?
ఎలక్ట్రిక్‌ బైక్‌ లేదా స్కూటర్‌ కొనేవాళ్లకు పెద్ద శుభవార్త.. రాయితీ గడువు పొడిగించిన కేంద్రం
ఎలక్ట్రిక్ బైక్ లేదా స్కూటర్ కొనేవాళ్ల కోసం బిగ్‌ న్యూస్‌.. సబ్సిడీపై కేంద్రం కీలక నిర్ణయం

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Love Entertainer OTT : మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
Telangana News: 10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
Miss Apoorva: 'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
Breaking News: గురువారం కర్నూలు పర్యటనకు వైఎస్ జగన్ ! విరూపాక్షికి పరామర్శ!
గురువారం కర్నూలు పర్యటనకు వైఎస్ జగన్ ! విరూపాక్షికి పరామర్శ!
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
Embed widget