అన్వేషించండి

Bullet Bike Price Hiked: బ్యాడ్‌ న్యూస్‌, మీకు ఇష్టమైన బుల్లెట్ బైక్‌ రేటు పెరిగింది - కొత్త ధర ఎంతంటే?

Royal Enfield Bullet 350: రాయల్ ఎన్‌ఫీల్డ్‌ బుల్లెట్ 350 ధర రూ.2,000 పెరిగి రూ.3,000 వరకు పెరిగింది. ఇప్పుడు ఏ వేరియంట్ ధర ఎంత & ఎలాంటి ప్రత్యేక ఫీచర్లు అందుబాటులో ఉన్నాయో తెలుసుకుందాం.

Royal Enfield Bullet 350 New Price: రాయల్ ఎన్‌ఫీల్డ్‌‌ బుల్లెట్ 350 అనేది కేవలం ఒక బైక్ మాత్రమే కాదు, అది ఒక గుర్తింపు. దాదాపు ప్రతి బైక్ ప్రియుడు పిచ్చిగా ఇష్టపడే మోటార్ సైకిల్ ఇది. ఈ బైక్ 349cc J-సిరీస్ ఇంజిన్‌తో రోడ్డును దడదడలాడిస్తుంది. ఈ ఇంజిన్‌ 20.2 hp పవర్‌ను & 27 Nm టార్క్‌ను జనరేట్‌ చేస్తుంది. ఈ ఇంజిన్‌కు యాడ్‌ చేసిన 5-స్పీడ్ గేర్‌బాక్స్ ప్రతి రైడ్‌ను స్మూత్‌గా & స్ట్రాంగ్‌గా మారుస్తుంది. సుదీర్ఘ పర్యటనలోనూ ఈ బండి మిమ్మల్ని అలిసిపోనివ్వదు, పైగా అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. Bullet 350 లో బిగించిన ఇంజినే Classic 350 & Hunter 350లోనూ కనిపిస్తుంది. 

డిజైన్ ఎలా ఉంది?
ఈ బైక్ ఇప్పటికీ రెట్రో లుక్‌తోనే ఉంది. రౌండ్ హెడ్‌లైట్లు, మెటల్ ఫ్యూయల్‌ ట్యాంక్, వైడ్‌ సైడ్ ప్యానెళ్లు & పవర్‌ఫుల్‌ థంప్ సౌండ్‌ ఈ బండి క్లాసిక్‌ టచ్‌ను అలాగే ఉంచాయి.

బుల్లెట్ 350 కొత్త ధరలు
రాయల్ ఎన్‌ఫీల్డ్‌, తన ఐకానిక్ బైక్ బుల్లెట్ 350 ధరలను రూ. 2,000 నుంచి రూ. 3,000 వరకు పెంచింది, వేరియంట్‌ను బట్టి ఈ రేటు మారుతుంది. జూన్ 2025లో అప్‌డేట్‌ చేసిన రేట్‌ లిస్ట్‌ ప్రకారం... 
మిలిటరీ రెడ్ & బ్లాక్ వేరియంట్‌ల ధర గతంలో రూ. 1,73,562 గా ఉంది, ఇది ఇప్పుడు రూ. 1,75,562కి పెరిగింది. 
స్టాండర్డ్ బ్లాక్ & మెరూన్ వేరియంట్‌ల ధర గతంలోని రూ.1,79,000 నుంచి ఇప్పుడు రూ.1,81,000 కి పెరిగింది. 
అత్యంత ఖరీదైన బ్లాక్ గోల్డ్ వేరియంట్ ఇప్పుడు రూ. 2,15,801 కు బదులు రూ. 2,18,801 కు అందుబాటులో ఉంటుంది, అంటే రూ. 3,000 పెరిగింది. ఈ ధరలన్నీ ఎక్స్-షోరూమ్ రేట్లు.

ధరలు ఎందుకు పెంచాల్సి వచ్చిందన్న కారణాన్ని ఈ కంపెనీ ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. అయితే, వాహన పరిశ్రమలో ఇన్‌పుట్ ఖర్చుల్లో (ఉక్కు, శ్రమ, సరఫరా గొలుసు వంటివి) పెరుగుదల, కొత్త రంగులు లేదా గ్రాఫిక్స్ & మార్కెట్ పొజిషనింగ్ దృష్ట్యా ఇటువంటి మార్పులు సాధారణంగా జరుగుతుంటాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్‌, మార్కెట్ ట్రెండ్స్‌కు అనుగుణంగా తన ఉత్పత్తులను నిరంతరం అప్‌డేట్‌ చేస్తోందని కూడా ఇది సూచిస్తుంది.

ఫీచర్లు ఎలా ఉన్నాయి?
బుల్లెట్ 350లో 349cc సింగిల్-సిలిండర్, ఎయిర్-ఆయిల్ కూల్డ్ ఇంజిన్ ఉంది, ఇది 6,100 rpm వద్ద 20.2 పవర్‌ను శక్తిని & 4,000 rpm వద్ద 27 Nm టార్క్‌ను జనరేట్‌ చేస్తుంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ కారణంగా ఎలాంటి రోడ్లపై అయినా స్మూత్‌ రైడింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఉంటుంది. బ్రేకింగ్ సిస్టమ్ విషయానికి వస్తే... బ్రేక్‌ కొట్టిన చోటే బండి ఆగేలా ముందు భాగంలో డిస్క్ బ్రేక్‌లు & వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్‌లు ఉన్నాయి. రైడర్‌ భద్రత కోసం ఈ మోటార్‌ సైకిల్‌కు ABS (Anti-lock Braking System) ఉంది, అత్యవసర పరిస్థితుల్లో ఈ బండి బ్రైకులు బిగుసుకుపోవు. మిలిటరీ వేరియంట్‌లో సింగిల్ ఛానల్ ABS & బ్లాక్ గోల్డ్ వేరియంట్‌లో డ్యూయల్ ఛానల్ ABS అందుబాటులో ఉన్నాయి. మిలిటరీ రెడ్, బ్లాక్, స్టాండర్డ్ మెరూన్ & బ్లాక్ గోల్డ్ కలర్‌ ఆప్షన్స్‌లో ఈ బండిని కొనవచ్చు.

టాప్ హెడ్ లైన్స్

రూ.18 లక్షల నుంచే కొత్త 7 సీటర్‌ EV!.. MG Hector Tomahawk‌పై భారీ అంచనాలు!
కవరింగ్‌ లేకుండానే కనిపించిన MG కొత్త EV.. 530km రేంజ్‌తో వస్తున్న Hector Tomahawk!
పాత Monster కంటే Ducati Monster V2 లో ఏంటి ప్రత్యేకత? ఈ 5 హైలైట్స్‌ తెలుసుకోండి
మీరు యూత్‌ అయితే, Ducati Monster V2 గురించి ఈ 5 విషయాలు మీకు తెలుసా?
టెస్లా మోడల్ Y నిజంగానే 500km రేంజ్‌ ఇస్తుందా? రోడ్డుపైకి వస్తే గానీ అసలు సంగతి తెలీలేదు
టెస్లా మోడల్ Y కెపాసిటీ ఇంతేనా? అసలు రేంజ్ తెలిస్తే షాక్‌ అవుతారు!
కారును మీ ఇష్టం వచ్చినచోట పార్క్‌ చేస్తే ఇన్సూరెన్స్‌ రాదు! ఈ నిబంధనలు తెలుసుకోండి
మీ కారు ఎక్కడంటే అక్కడ పార్క్ చేస్తున్నారా? ఈ తప్పు చేస్తే ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌ కష్టమే!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
Embed widget