అన్వేషించండి

Car Mileage Tips: కారు మైలేజీని ఎలా పెంచుకోవాలి? ఈ టిప్స్ పాటిస్తే ఫ్యూయల్‌ ఖర్చు తగ్గుతుంది! 

Car Mileage Tips: భారత్‌లో CNG స్టేషన్లలో పొడవైన లైన్లు కనిపిస్తున్నాయి. భవిష్యత్తులో పెట్రోల్,  డీజిల్ కోసం కూడా ఇలాంటి పరిస్థితి ఉంటుందని ఆందోళన మొదలైంది.  

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఇంధన ధరల పెరుగుదల నేపథ్యంలో, మైలేజీని పెంచే డ్రైవింగ్ చిట్కాలు పాటించండి.
  • అకస్మాత్తుగా యాక్సిలరేషన్, బ్రేకింగ్ ఇంధన వినియోగాన్ని పెంచుతాయి.
  • సరైన గేర్, స్థిరమైన వేగం, వాహన నిర్వహణ మైలేజీని మెరుగుపరుస్తాయి.
  • సిగ్నల్స్ వద్ద, ఎక్కువసేపు ఆగేటప్పుడు ఇంజిన్ ఆఫ్ చేయడం ఇంధనాన్ని ఆదా చేస్తుంది.

Car Mileage Tips: ఈ రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు అందరికీ ఆందోళనకరంగా మారాయి. ముఖ్యంగా ఇరాన్, ఇజ్రాయెల్, యునైటెడ్ స్టేట్స్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఇటీవల పెరగడం భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో కనిపించింది. దీంతో భారత్‌లోని CNG స్టేషన్ల వద్ద బార్లు కనిపిస్తున్నాయి. భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్ కోసం పొడవైన క్యూ కష్టాలు వస్తాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కానీ భయపడాల్సిన అవసరం లేదు. మీరు మీ కారును తెలివిగా నడిపి కొన్ని చిట్కాలు పాటిస్తే మాత్రం తక్కువ ఇంధనంతో ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు. పెట్రోల్, డీజిల్‌ను ఆదా చేయవచ్చు. కాబట్టి, తక్కువ ఇంధనంతో మీ కారు నుంచి మెరుగైన మైలేజీని ఎలా పొందాలో చూద్దాం. 

తక్కువ ఆయిల్ ఉపయోగించి మీ కారు నుంచి మంచి మైలేజ్ ఎలా పొందాలి?

1. స్మూత్ డ్రైవింగ్ ప్రాక్టీస్ చేయండి - యాక్సిలరేషన్ లేదా బ్రేకింగ్ అకస్మాత్తుగా ఇంధన వినియోగాన్ని పెంచుతుంది. అందువల్ల, క్రమంగా స్పీడ్ పెంచండి. ట్రాఫిక్‌కు అనుగుణంగా ఒకే వేగాన్ని మెంటెయిన్‌ చేయండి. స్మూత్ డ్రైవింగ్ ఇంధనాన్ని ఆదా చేయడమే కాకుండా ఇంజిన్ లైఫ్‌ను కూడా పెంచుతుంది. 

2. సరైన గేర్- స్పీడ్‌ కంట్రోల్‌- రాంగ్‌ గేర్‌లో డ్రైవింగ్ చేయడం వల్ల ఇంజిన్‌పై ఎక్కువ ఒత్తిడి పడుతుంది. ఉదాహరణకు, తక్కువ వేగంతో టాప్‌ గేర్ లేదా హైస్పీడ్‌తో లో గేర్‌‌ను ఉపయోగించడం. ఇది ఇంధన వినియోగాన్ని పెంచుతుంది. ఇంధన మైలేజీని తగ్గిస్తుంది. మీ వేగానికి అనుగుణంగా ఎల్లప్పుడూ సరైన గేర్‌లో డ్రైవ్ చేయండి. గేర్‌లను క్రమంగా వేగవంతం చేయడం, మార్చడం ఇంధనాన్ని ఆదా చేయడానికి సులభమైన మార్గం. 
 
3. వేగంగా డ్రైవ్ చేయవద్దు - చాలా మంది వేగంగా డ్రైవింగ్ చేయడం వల్ల సమయం ఆదా అవుతుందని అనుకుంటారు, కానీ నిజం ఏమిటంటే అధిక వేగంతో డ్రైవింగ్ చేయడం వల్ల ఇంజిన్ ఒత్తిడి పెరుగుతుంది. ఎక్కువ ఇంధనం ఖర్చవుతుంది. మీరు సాధారణ లేదా బ్యాలెన్స్‌డ్‌గా డ్రైవ్ చేస్తే, ఇంజిన్‌పై ఒత్తిడి పడదు. మీకు మంచి ఇంధన మైలేజ్ లభిస్తుంది. అందువల్ల, ట్రాఫిక్‌ను బట్టి ఎల్లప్పుడూ నెమ్మదిగా, స్థిరమైన వేగంతో డ్రైవ్ చేయండి. 

4. క్లచ్‌ను సగం నొక్కిపట్టి ఉంచే అలవాటును మానుకోండి - కొంతమంది డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, ముఖ్యంగా ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద అనుకోకుండా తమ కాలును క్లచ్‌పై ఉంచుతారు. ఈ అలవాటు క్లచ్ జీవితకాలాన్ని తగ్గిస్తుంది. పెట్రోల్ వినియోగాన్ని పెంచుతుంది. గేర్లు మార్చేటప్పుడు లేదా ఆపేటప్పుడు మాత్రమే క్లచ్‌ను ఎంగేజ్ చేయండి. ట్రాఫిక్‌లో క్లచ్‌ను పదే పదే ఎంగేజ్ చేయకుండా ఉండండి. 

5. మీ వాహనాన్ని సరిగ్గా మెంటెయిన్ చేయండి- బాగా రన్ అయిన ఇంజిన్, డర్టీ ఎయిర్ ఫిల్టర్ లేదా  సర్వీస్ లోపాలు మీ వాహనం ఎక్కువ పెట్రోల్ లేదా డీజిల్‌ను వినియోగించడానికి కారణవుతాయి. రెగ్యులర్ సర్వీస్, సరైన టైర్ ప్రెజర్, మంచి డ్రైవింగ్ అలవాట్లు మీ కారు మైలేజీని మెరుగుపరుస్తాయి. ఇంధనాన్ని ఆదా చేస్తాయి. 

6. సిగ్నల్‌ వద్ద ఇంజిన్‌ను ఆఫ్ చేయండి - మీరు ట్రాఫిక్ సిగ్నల్ వద్ద 30 సెకన్లు లేదా అంతకంటే ఎక్కువసేపు వేచి ఉంటే, ఇంజిన్‌ను ఆఫ్‌ చేయకుండా వదిలేయడం మంచిది కాదు. అలాంటి సమయాల్లో ఇంజిన్‌ను ఆఫ్ చేసి, గ్రీన్ సిగ్నల్ పడే వరకు ఎదురు చూడటం మంచిది. కొత్త కార్లలో స్టార్ట్/స్టాప్ బటన్ ఉంటుంది, అయితే పాత కార్లలో ఇంజిన్‌ను ఆఫ్ చేయడానికి మాన్యువల్ కీని ఉపయోగిస్తారు. 

7. మీ కారు సర్వీస్, టైర్ ప్రెజర్‌ను ట్రాక్ చేయండి - కార్ సర్వీస్‌ను క్రమం తప్పకుండా చేయడం చాలా ముఖ్యం. ఇంజిన్ ఆయిల్, ఎయిర్ ఫిల్టర్, బ్రేక్ ఫ్లూయిడ్‌ను మార్చడం ఇందులో ఉంటుంది. సరైన టైర్ ప్రెజర్‌ను నిర్వహించడం కూడా చాలా ముఖ్యం. తక్కువ గాలితో కూడిన టైర్లు ఇంజిన్‌ను శ్రమపెడతాయి. ఫలితంగా అధిక ఇంధన వినియోగం జరుగుతుంది. మీ టైర్లు, టైర్ ప్రెజర్‌ను క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోండి. 

Frequently Asked Questions

కారు మైలేజీని మెరుగుపరచడానికి కొన్ని మార్గాలు చెప్పండి?

స్మూత్ డ్రైవింగ్, సరైన గేర్ వాడకం, వేగాన్ని నియంత్రించడం, క్లచ్‌ను సరిగ్గా వాడటం, వాహనాన్ని సరిగ్గా మెయింటెయిన్ చేయడం, సిగ్నల్‌ వద్ద ఇంజిన్‌ను ఆఫ్ చేయడం వంటివి మైలేజీని పెంచుతాయి.

తక్కువ ఇంధనంతో ఎక్కువ దూరం ప్రయాణించడానికి డ్రైవింగ్‌లో ఎలాంటి మార్పులు చేసుకోవాలి?

అకస్మాత్తుగా యాక్సిలరేషన్ లేదా బ్రేకింగ్‌కు బదులుగా క్రమంగా వేగాన్ని పెంచండి. ట్రాఫిక్‌కు అనుగుణంగా ఒకే వేగాన్ని మెంటెయిన్ చేయండి. ఇది ఇంధనాన్ని ఆదా చేస్తుంది.

సరైన గేర్‌ను వాడటం మైలేజీపై ఎలా ప్రభావం చూపుతుంది?

తక్కువ వేగంతో టాప్‌ గేర్ లేదా హైస్పీడ్‌తో లో గేర్‌ను ఉపయోగించడం వల్ల ఇంజిన్‌పై ఒత్తిడి పెరిగి, ఇంధన వినియోగం పెరుగుతుంది. వేగానికి అనుగుణంగా సరైన గేర్‌ను వాడటం ముఖ్యం.

వాహన నిర్వహణలో ఏ అంశాలు మైలేజీని మెరుగుపరుస్తాయి?

రెగ్యులర్ సర్వీసింగ్, డర్టీ ఎయిర్ ఫిల్టర్‌ను శుభ్రం చేయడం, సరైన టైర్ ప్రెజర్‌ను నిర్వహించడం మీ కారు మైలేజీని మెరుగుపరుస్తాయి.

టాప్ హెడ్ లైన్స్

ముగ్గురు కుటుంబ సభ్యులు, ఒక పెట్‌కు హ్యాపీగా సరిపోయే బెస్ట్ ఫ్యామిలీ కారు ఏది?
సిటీ ట్రాఫిక్‌కూ, హైవే ట్రిప్‌లకూ బెస్ట్ ఫ్యామిలీ కారు ఇదే.. తక్కువ మెయింటెనెన్స్‌తో ఎక్కువ భద్రత
ప్రపంచవ్యాప్తంగా కేవలం 100 బైక్‌లే.. రాయల్ ఎన్‌ఫీల్డ్ లిమిటెడ్ ఎడిషన్‌కు అతి భారీ డిమాండ్
కేవలం 3 నిమిషాల్లోనే అమ్ముడైన రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 X రఫ్ క్రాఫ్ట్స్ - ఏంటి దీని స్పెషాలిటీ?
రూ.10-15 లక్షల్లో ఐదుగురికి హాయిగా సరిపోయే ఆటోమేటిక్‌ కారు, మంచి మైలేజ్ కూడా.. ఈ కారు బెస్ట్ ఛాయిస్!
వెనుక సీట్‌లో ముగ్గురు కూర్చోగల బెస్ట్ ఆటోమేటిక్ కారు ఏది? మారుతి బ్రెజ్జా లేదా హోండా అమేజ్?
అన్ని కార్లకూ పవర్ పెట్రోల్ అవసరమా? పూర్తి నిజం ఏంటో ఇప్పుడే తెలుసుకోండి!
పవర్ పెట్రోల్ vs నార్మల్ పెట్రోల్ - మీ కారుకు ఏది బెస్ట్? డబ్బు వృథా చేసుకోవద్దు

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Adilabad Airport Credit War: ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
CWG India Medals: కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Secret Soldier : చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Embed widget