అన్వేషించండి
Telangana Employees Salaries: తెలంగాణ ఉద్యోగుల జీతాలపై కీలక నిర్ణయం.. అర్ధరాత్రి వరకు టైమ్, లేకపోతే జీతాలు బంద్!
TG Employees Salaries: తెలంగాణ ఆర్థికశాఖ నిర్వహణ పోర్టల్ (ఐఎఫ్‌ఎంఐఎస్)కు అర్ధరాత్రిలోగా ఆధార్ లింక్ చేయాలని లేకపోతే జీతాలు నిలిచిపోతాయని ప్రభుత్వ ఉద్యోగులను హెచ్చరించింది.

తెలంగాణ ఉద్యోగుల జీతాలపై కీలక నిర్ణయం.. అర్ధరాత్రి వరకు టైమ్, లేకపోతే జీతాలు బంద్!
Source : ABP Desam
Telangana Employees Salaries: హైదరాబాద్: తెలంగాణలో వేతనాల చెల్లింపుపై ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థికశాఖ పిడుగుపాటు లాంటి వార్త చెప్పింది. ఆర్థికశాఖ నిర్వహణ పోర్టల్ (IFMIS)కు ఆధార్ లింక్ చేయాలని ఉద్యోగులకు స్పష్టం చేసింది. ఇటీవల తెలంగాణ మంత్రివర్గ నిర్ణయానికి అనుగుణంగా ఉద్యోగులు, సిబ్బంది కచ్చితంగా ఈ ప్రక్రియ పూర్తిచేయాలని ఆర్థిక శాఖ తాజాగా ఆదేశించింది. నేటి అర్ధరాత్రి వరకు ఉద్యోగులందరూ ఆధార్ లింక్ చేయాలని, లేనిపక్షంలో వారికి నెల వేతనాలు నిలిచిపోతాయని ఆర్థికశాఖ స్పష్టం చేసింది. ఉద్యోగుల వేతనాల ఖాతాల్లో పారదర్శకత, అవకతవకలు లేకుండా ఉండాలని ఆర్థిక శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇంకా చదవండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
హైదరాబాద్
ఇండియా
ఆంధ్రప్రదేశ్
Advertisement






















