Hero Electric Scooter: ఎలక్ట్రిక్ స్కూటర్ల ఛార్జింగ్ టెన్షన్‌కు హీరో చెక్ - రిమూవబుల్ బ్యాటరీలు కూడా!
Vida V1 Pro: ప్రముఖ ఆటోమొబైల్ బ్రాండ్ హీరో తన ఎలక్ట్రిక్ విడా స్కూటర్ సిరీస్ కోసం ప్రత్యేకంగా ఛార్జింగ్ స్టేషన్లు, రిమూవబుల్ బ్యాటరీలను తీసుకువస్తుంది. దీంతో ఛార్జింగ్ కష్టాలు చాలా వరకు తీరినట్లే.
Vida Electric Scooter: భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు కాలంతో పాటు డిమాండ్ పెరుగుతోంది. అదే సమయంలో ఇటీవల విడుదల చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్లలో కొత్త అప్‌డేట్లు కూడా ప్రజలను పలకరిస్తున్నాయి. అటువంటి అప్‌డేట్ హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ విడాలో కనిపిస్తుంది. భారతీయ మార్కెట్లో విడాకు సంబంధించి రెండు మోడల్స్ ఉన్నాయి. వీటిలో విడా వీ1 ప్రో, విడా వీ1 ప్లస్ ఉన్నాయి.
ఈవీ ఛార్జింగ్ టెన్షన్ ముగిసినట్లేనా?
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలలో అతిపెద్ద టెన్షన్ వాటికి సంబంధించిన ఛార్జింగ్ గురించి. ప్రజలకు వచ్చే ఈ సమస్యను పరిష్కరించడానికి వివిధ ప్రాంతాల్లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను కూడా ప్రారంభిస్తున్నారు. అయితే ఈ స్టేషన్లలో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఛార్జ్ చేయడానికి పొడవైన క్యూలో నిలబడాలి. మరోవైపు విడా తీసుకువచ్చిన రెండు స్కూటర్‌లు రిమూవబుల్ బ్యాటరీని కలిగి ఉంటాయి. తద్వారా ఈ స్కూటర్‌ని ఎప్పుడైనా, ఎక్కడైనా ఛార్జ్ చేయవచ్చు.
Also Read: New Maruti Suzuki Wagon R: మార్కెట్లో కొత్త మారుతి సుజుకి వాగన్ ఆర్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
విడా ఎలక్ట్రిక్ స్కూటర్
విడా వీ1 ప్రో, విడా వీ1 ప్లస్ రెండు బ్యాటరీలను కలిగి ఉన్నాయి. బ్యాటరీని సులువుగా తీసేందుకు వీలుగా కంపెనీ విడాకు ఒకటికి బదులు రెండు బ్యాటరీలను అందించింది. వీటి బ్యాటరీలలో ఒకదాని బరువు 11 కిలోలుగా ఉంది. దీని బ్యాటరీ ప్యాక్ 1.92 కేడబ్ల్యూహెచ్ శక్తిని అందిస్తుంది. రెండు బ్యాటరీ ప్యాక్‌లు కలిసి ఈ ఈవీకి మెరుగైన రేంజ్‌ని అందిస్తాయి.
విడా వీ1 ప్లస్, విడా వీ1 ప్రో రేంజ్ ఎంత ఉంటుంది?
విడా వీ1 ప్లస్ 3.44 కేడబ్ల్యూహెచ్ కెపాసిటీ కలిగిన బ్యాటరీని కలిగి ఉంది. ఈ స్కూటర్ ఒక్కసారి ఛార్జింగ్‌తో 143 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. ఈ స్కూటర్ ఎక్స్ షోరూం ధర రూ.1,02,700గా ఉంది. మరోవైపు విడా వీ1 ప్రో 3.94 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 165 కిలోమీటర్ల రేంజ్ అందించనుంది. ఈ ఈవీ ధర రూ. 1,30,200గా ఉంది.
Also Read: రూ.నాలుగు లక్షల్లో కారు కొనాలనుకుంటున్నారా? - మీకు మంచి ఆప్షన్ ఇదే
Happy #WorldEnvironmentDay!
— Hero Electric (@Hero_Electric) June 5, 2024
Hero Electric is dedicated to a greener future with our eco-friendly electric scooters. Ride with us and reduce your carbon footprint. Together, we can make a difference! #HeroElectric #GoGreen #SustainableLiving #EcoFriendly #CleanEnergy pic.twitter.com/MYYHmv5ZZH
Hero Electric has recently conducted a massive complimentary Service Camp in Ongole, Andhra Pradesh! Whether you need a swift tune-up or a comprehensive inspection, our skilled technicians are available to guarantee your ride operates seamlessly! pic.twitter.com/aQIDCUMsLG
— Hero Electric (@Hero_Electric) April 1, 2024