ఇండియాలో ఫస్ట్ బెంజ్ కొన్నదెవరో తెలుసా? లగ్జరీ ఫీచర్ల కారణంగా మెర్సిడెస్ బెంజ్‌ను ప్రపంచవ్యాప్తంగా అందరూ ఇష్టపడతారు. మనదేశంలో ఫస్ట్ బెంజ్ కారు ఓనర్ ఎవరో మీకు తెలుసా? మెర్సిడెస్ కార్లను మొదటి సారి 1994లో టాటా కంపెనీ ద్వారా భారత్‌కు దిగుమతి చేశారు. ఈ కార్లను టాటా మోటార్స్ తమ ఎగ్జిక్యూటివ్స్ కోసం తీసుకువచ్చింది. దీంతో ఇవి భారత్‌కు వచ్చిన మొదటి బెంజ్ కార్లుగా నిలిచాయి. అది మెర్సిడెస్ బెంజ్ డబ్ల్యూ124 మోడల్. ఇవి అప్పట్లో చాలా పాపులర్ కూడా. దీన్ని టాటా మోటార్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ అయిన పీడీ సింగ్ కొనుగోలు చేశాడు. ఇలా చూస్తే ఇండియాలో బెంజ్ సొంతం చేసుకున్న మొదటి వ్యక్తి పీడీ సింగ్. ప్రస్తుతం మనదేశంలో మెర్సిడెస్ కార్ల ధరలు రూ.46 లక్షల నుంచి రూ.3.35 కోట్ల వరకు ఉన్నాయి.