Best Car Under Rs 4 Lakh: రూ.నాలుగు లక్షల్లో కారు కొనాలనుకుంటున్నారా? - మీకు మంచి ఆప్షన్ ఇదే!
Maruti Alto K10: మీరు తక్కువ ధరలో మంచి కారు కొనాలనుకుంటున్నారా? అయితే మీకు మంచి ఆప్షన్ అందుబాటులో ఉంది. అదే మారుతి ఆల్టో కే10. ఇది ఒక నాలుగు సీటర్ల కారు.
Best Affordable Car: ప్రస్తుతం ఉన్న కాలంలో అందరూ తమ సొంత కారును కలిగి ఉండాలని కోరుకుంటారు. తద్వారా వారు తమ ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. కానీ బడ్జెట్ లేకపోవడంతో చాలా మంది దాన్ని నెరవేర్చుకోలేకపోతున్నారు.
మీ బడ్జెట్ రూ. నాలుగు లక్షలే అయినా మీరు కారు కొనాలనే కలను నెరవేర్చుకోవచ్చు. ఈ బడ్జెట్‌లో మీరు అనేక మంచి ఆప్షన్లను పొందవచ్చు. ఇది మీ ప్రయాణాన్ని సౌకర్యవంతంగా చేయడమే కాకుండా మీ బడ్జెట్‌లో కూడా సరిపోతుంది.
మనదేశంలో చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ కార్లు ఉన్నాయి. కానీ వాటిలో రూ. నాలుగు లక్షల బడ్జెట్‌కు సరిపోయేది మారుతి ఆల్టో కే10. ఇది సరసమైన ధరలో మంచి మైలేజ్, ఫీచర్లను అందించే ప్రముఖ హ్యాచ్‌బ్యాక్ కారు. ఇది నాలుగు సీట్ల కారు. దీని ధర రూ. 3.99 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. అదే సమయంలో దాని టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 5.96 లక్షల వరకు ఉంది.
Also Read: హైబ్రిడ్ వెర్షన్‌లో రానున్న ఫేమస్ కారు- ఫేస్‌లిఫ్ట్ డిజైన్, మరెన్నో స్మార్ట్ ఫీచర్లు
ఈ కారు ఇంజిన్ ఎలా ఉంది?
ఈ మారుతీ కారులో 998 సీసీ ఇంజన్ అందించారు. ఇందులోని ఇంజన్ 67 బీహెచ్‌పీ పవర్, 90 ఎన్ఎమ్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ కారు రెండు ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లతో ఎనిమిది వేరియంట్‌ల్లో లభిస్తుంది. ఆల్టో కే10 మ్యాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ రెండింటిలోనూ అందుబాటులో ఉంది.
మారుతి ఆల్టో కే10 ఫీచర్లు
ఈ కారు ఎన్‌సీఏపీ రేటింగ్ 2గా ఉంది. ఇందులో రెండు ఎయిర్‌బ్యాగ్‌లు అందించారు. మారుతి ఆల్టో కే10 ఏడు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. మారుతి ఆల్టో కారులో ఈ మోడల్ లీటరుకు 24.39 కిలోమీటర్ల నుంచి 33.85 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. రూ. నాలుగు లక్షల ధరలో కార్లను కొనుగోలు చేసేవారికి ఈ కారు మంచి ఆప్షన్. ఇది మాత్రమే కాకుండా టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పవర్ విండోస్, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు వంటి ఫీచర్లు కూడా మారుతి కే10లో అందుబాటులో ఉన్నాయి.
Also Read: మహీంద్రా ఎక్స్‌యూవీ700పై భారీ తగ్గింపు - ఎంత తగ్గించారంటే?