New Chetak Electric: ఎలక్ట్రిక్ స్కూటర్లను అప్‌డేట్ చేసిన చేతక్ - కొత్త ఫీచర్లు, టెక్నాలజీలో మార్పులు!
Chetak Electric Urbane: చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొత్త వేరియంట్లు మార్కెట్లో లాంచ్ అయ్యాయి. అవే చేతక్ అర్బన్, చేతక్ ప్రీమియం.
Chetak Electric Scooters: చేతక్ తన ఎలక్ట్రిక్ స్కూటర్‌లో రెండు కొత్త వేరియంట్‌లను దేశీయ మార్కెట్‌లో విడుదల చేసింది. అవి చేతక్ అర్బన్, చేతక్ ప్రీమియం. ఇందులో చేతక్ అర్బన్ రూ. 1.15 లక్షల ఎక్స్ షోరూమ్ ధరతో, చేతక్ ప్రీమియం రూ. 1.35 లక్షల ఎక్స్ షోరూం ధరతో లాంచ్ అయ్యాయి. చేతక్ అర్బన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను థిక్ గ్రే, సైబర్ వైట్, బ్రూక్లిన్ బ్లాక్, ఇండిగో మెటాలిక్ బ్లూ రంగులలో కొనుగోలు చేయవచ్చు. చేతక్ ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ హాజెల్‌నట్, ఇండిగో మెటాలిక్ బ్లూ, బ్రూక్లిన్ బ్లాక్ రంగులలో అందుబాటులోకి వచ్చింది.
చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్లు
కొత్త చేతక్ వేరియంట్ రెండు ప్రత్యేక అప్‌డేట్‌లను పొందింది. మొదటిది టెక్నాలజీ రూపంలో కాగా, రెండవది బ్యాటరీ ప్యాక్ రూపంలో. టెక్నాలజీ గురించి చెప్పాలంటే కొత్త చేతక్ టీబీటీ నేవిగేషన్ సపోర్ట్, మ్యూజిక్ కంట్రోల్, కాల్ మేనేజ్‌మెంట్‌తో పాటు హిల్ హోల్డ్ కంట్రోల్, రివర్స్ మోడ్‌తో కూడిన టీఎఫ్‌టీ డిస్‌ప్లేను కలిగి ఉంది.
ఇతర ముఖ్యమైన ఫీచర్ల గురించి చెప్పాలంటే సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్‌లు, సెల్ఫ్ క్యాన్సిలింగ్ బ్లింకర్లు, లెఫ్ట్ అండ్ రైట్ కంట్రోల్ స్విచ్‌లు, ఎలక్ట్రానిక్ హ్యాండిల్, స్టీరింగ్ లాక్, సీట్ స్విచ్... ఇలా మరెన్నో ఫీచర్లు ఉన్నాయి. మార్కెట్లో దాని ప్రత్యర్థులకు గట్టి పోటీని ఇవ్వడానికి, చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తి మెటల్ బాడీతో వచ్చింది.
ఇందులో తదుపరి పెద్ద అప్‌డేట్ బ్యాటరీ ప్యాక్‌కి సంబంధించింది. ఇప్పుడు కొత్త చేతక్‌లో పాత 2.9 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ స్థానంలో పెద్ద 3.2 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంది. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 127 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. దీని గరిష్ట వేగం గంటకు 73 కిలోమీటర్లుగా ఉంది. భారతీయ మార్కెట్లో చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏథర్ 450, ఓలా ఎస్1 సిరీస్‌కు పోటీగా ఉంది.
మరోవైపు హార్లే డేవిడ్‌సన్ ఎక్స్440 స్ఫూర్తితో తయారు కానున్న బైక్ ద్వారా రాయల్ ఎన్‌ఫీల్డ్‌తో పోటీ పడేందుకు హీరో మోటోకార్ప్ కంపెనీ సిద్ధమవుతోంది. త్వరలో విడుదల కాబోతున్న ఈ హీరో బైక్ అధికారిక పేరు, వివరాలు ఇంకా ప్రకటించలేదు. కంపెనీ ఇప్పటికే 'హరికేన్', 'హరికేన్ 440', 'హీరో నైట్‌స్టర్ 440' పేర్లను కూడా ట్రేడ్‌మార్క్ చేసింది. వీటిలో హార్లే డేవిడ్‌సన్ఎక్స్X440 ఆధారిత మోటార్‌సైకిల్ 2024 జనవరి చివరిలో జరిగే హీరో వరల్డ్ ఈవెంట్‌లో మొట్టమొదటిసారిగా విడుదల కానుంది.
ఈ బైక్ ఇంజిన్ ఇదే ప్లాట్‌ఫారంపై రూపొందిన ఎక్స్440 తరహాలోనే ఉండవచ్చు. ఎక్స్440 లాగా కాకుండా హీరో కొత్త బైక్ మరింత ప్రత్యేక డిజైన్‌తో వస్తుంది. ఇది రెట్రో థీమ్ సర్క్యులర్ హెడ్‌ల్యాంప్‌లు, బార్ ఎండ్ మిర్రర్స్, మస్కులర్ ఫ్యూయల్ ట్యాంక్, వెడల్పాటి హ్యాండిల్‌బార్లు, స్పోర్టీ ఎగ్జాస్ట్ పైపులు, సర్క్యులర్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను పొందవచ్చని భావిస్తున్నారు.
Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!