TVS iQube EV vs Bajaj Chetak EV: టీవీఎస్ ఐక్యూబ్, బజాజ్ చేతక్ ఈవీలలో ఏది బెస్ట్, ధర చూసి డిసైడ్ కావొద్దు
Bajaj Chetak vs TVS iQube EV | పెట్రోల్, ఎలక్రిక్ స్కూటీలలో బజాజ్, చేతక్ సంస్థలు దూసుకెళ్తున్నాయి. అయితే వారి అవసరాలు, కావాల్సిన ఫీచర్లకు అనుగుణంగా ఈవీలు కొనుగోలు చేస్తున్నారు.

భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. పెట్రోల్ ఖర్చులు తగ్గించుకునేందుకు ఈవీల వైపు చూస్తున్నారు. మరోవైపు వీటి వాడకం ద్వారా పొల్యూషన్ కూడా చాలా వరకు తగ్గుతుంది. ముఖ్యంగా రోజువారీ ఆఫీసుకు వెళ్లే వారి కోసం TVS iQube ఈవీ, Bajaj Chetak లాంటి స్కూటీలు బెస్ట్ ఛాయిస్‌గా ఉన్నాయి. ఈ రెండు స్కూటర్లు బడ్జెట్ ధరలకు అందుబాటులో ఉండటం, మంచి బ్రాండ్లు కావడంతో అధికంగా విక్రయాలు జరుగుతున్నాయి.
TVS iQube, Bajaj Chetak ధరలలో వ్యత్యాసం ఎంత
Bajaj Chetak ఎక్స్-షోరూమ్ ధర రూ. 99,990 నుంచి ప్రారంభం అవుతుంది. టాప్ మోడల్ కోసం రూ. 1.46 లక్షల ధరకు విక్రయాలు జరుగుతున్నాయి. ఢిల్లీలో దీని ఆన్-రోడ్ ధర సుమారు రూ. 1.06 లక్షల నుంచి 1.40 లక్షల వరకు ఉంది. అదే సమయంలో TVS iQube స్కూటీ ధర రూ. 94,434తో ప్రారంభం అవుతుంది. ఇది టాప్ ST వేరియంట్ ధర రూ. 1.59 లక్షలు ఉంది. ఈ ధరలు ఢిల్లీలో ఉండగా, ఆయా నగరాల్లో ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. ఆయా రాష్ట్రాల్లోని నగరాలు, వేరియంట్, సబ్సిడీల ఆధారంగా మారతాయి.
టీవీఎస్ ఐక్యూబ్, బజాబ్ చెతక్ పరిధి
Bajaj Chetak స్కూటీలుు, TVS iQube స్కూటీలను రోజువారీ సిటీ రైడ్‌ల కోసం కంపెనీలు తయారుచేశాయి. అయితే, కిలోమీటర్ల రేంజ్ పరంగా చూస్తే TVS iQube కొంచెం ముందుంది. ఇది ఎక్కువ బ్యాటరీ పవర్ తో వస్తుంది.
బ్యాటరీ, ఛార్జింగ్ మధ్య వ్యత్యాసం
Bajaj Chetak 3 kWh నుంచి 3.5 kWh లిథియం- అయాన్ బ్యాటరీ కలిగి ఉంది. ఇది 0 నుంచి 80 శాతం వరకు ఛార్జింగ్ చేయడానికి సుమారు 3 గంటల 25 నిమిషాలు టైం తీసుకుంటుంది. బజాజ్ చెతక్ బ్యాటరీ IP67 రేటింగ్‌తో వస్తుంది. ఇది వాటర్, డస్ట్ నుంచి వాహనాన్ని కాపాడుతుంది. అదే సమయంలో TVS iQube 2.2 kWh నుంచి 5.3 kWh వరకు బ్యాటరీలను కలిగి ఉంది. ఇది 0 నుండి 80 శాతం వరకు ఛార్జింగ్ చేయడానికి 4 నుండి 4.5 గంటలు పడుతుంది.
ఫీచర్లలో ఎవరు ముందు..
Bajaj Chetak రెట్రో-మోడ్రన్ డిజైన్, మెటల్ బాడీతో మార్కెట్లోకి రాగా, ఇందులో 35 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్, టచ్-ఎనేబుల్డ్ TFT డిస్‌ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీ, ఎకో అండ్ స్పోర్ట్స్ మోడ్‌లు, రిమోట్ స్టార్ట్, LED లైటింగ్, సీక్వెన్షియల్ బ్లింకర్స్ వంటి ఫీచర్లున్నాయి. TVS iQube మోడ్రన్ డిజైన్‌తో 7 అంగుళాల TFT టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే, నావిగేషన్, జియోఫెన్సింగ్, బ్లూటూత్, Q పార్క్ అసిస్ట్, క్రాష్ అలర్ట్, 30-32 లీటర్ల స్టోరేజ్, రివర్స్ మోడ్ లాంటి ఫీచర్లను అందిస్తుంది.
ఏది కొంటే ఎక్కువ ప్రయోజనం
ఒకవేళ మీరు ప్రీమియం లుక్, మెటల్ బాడీతో పాటు ఎక్కువ స్టోరేజ్ కలిగిన స్కూటీ కావాలనుకుంటే Bajaj Chetak మీకు సరైన ఎంపిక. ఇది రోజువారీ సిటీ రైడ్‌లకు మంచి ఛాయిస్ గా భావిస్తారు. మీరు ఆధునిక డిజైన్, మెడ్రన్ టెక్నాలజీపై ఫోకస్ చేసేవారైతే మీకు TVS iQube బెస్ట్ చాయిస్ కానుంది. రెండు స్కూటర్ల ధర, ఫీచర్లను బట్టి వాహనాలు కొనుగోలు చేయాలి.






















