అన్వేషించండి

Electric Scooters Sales May 2026: గత నెలలో టీవీఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ల దూకుడు.. బజాజ్, ఏథర్‌ కంటే ముందు - హీరోకు సూపర్ బూస్ట్

Electric Scooters Sales May 2026:మే 2026లో ఎలక్ట్రిక్ టూ వీలర్ అమ్మకాలు 1.7 లక్షల యూనిట్లను దాటాయి. టీవీఎస్ అగ్రస్థానంలో నిలవగా, హీరో మోటోకార్ప్ 158 శాతం వృద్ధితో అందరి దృష్టిని ఆకర్షించింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు మేలో 62.8% వృద్ధి నమోదు చేశాయి.
  • టీవీఎస్ అగ్రస్థానం, బజాజ్, ఏథర్‌లు తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
  • హీరో మోటోకార్ప్ అమ్మకాలు పెరిగాయి, ఓలా మాత్రం తగ్గింది.

Electric Scooters Sales May 2026: ఇప్పుడు ఎలక్ట్రిక్‌ స్కూటర్ల ట్రెండ్‌ నడుస్తోంది. 'ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్' (FADA) విడుదల చేసిన రిటైల్ డేటా ప్రకారం, మే నెలలో మొత్తం ఎలక్ట్రిక్ స్కూటర్లు, మోటార్‌సైకిళ్ల రిజిస్ట్రేషన్లు 1,70,733 యూనిట్లకు చేరాయి. గత ఏడాది ఇదే నెలలో నమోదైన 1,04,896 యూనిట్లతో పోలిస్తే ఇది 62.8 శాతం భారీ వృద్ధి. అంతేకాదు, ఏప్రిల్ 2026తో పోలిస్తే కూడా అమ్మకాలు 8.5 శాతం పెరగడం మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలపై పెరుగుతున్న ఆసక్తికి నిదర్శనం. 

కంపెనీ పేరు 2026

మే 2026

ఏప్రిల్‌ 2026

వార్షిక వృద్ధి

టీవీఎస్ మోటార్ కంపెనీ

42,459

40,020

64.54%

బజాజ్ ఆటో

39,202

34,552

73.14%

ఏథర్‌ ఎనర్జీ

28,240

28,479

100.27%

హీరో మోటోకార్ప్

19,067

15,905

158.19%

ఓలా ఎలక్ట్రిక్

15,141

12,331

-20.17%

గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ

7,695

7,009

77.92%

రివర్ మొబిలిటీ

3,720

3,681

245.08%

బిగాస్ ఆటో

3,297

3,229

204.71%

ఇతరులు

11,912

12,108

25.23%

మొత్తం

1,70,733

1,57,314

62.76%

టీవీఎస్ దూకుడు

గత నెలలో దేశంలో అత్యధిక ఎలక్ట్రిక్ టూ వీలర్లను విక్రయించిన సంస్థగా టీవీఎస్ మోటార్ కంపెనీ నిలిచింది. హోసూర్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న టీవీఎస్, మే 2026లో మొత్తం 42,459 యూనిట్ల రిటైల్ అమ్మకాలు నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 64.5 శాతం వృద్ధిని సాధించింది. కంపెనీకి చెందిన ఐక్యూబ్, ఆర్బిటర్ శ్రేణి వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ ఈ విజయానికి ప్రధాన కారణంగా నిలిచింది.

రెండో స్థానంలో బజాజ్ ఆటో నిలిచింది. కంపెనీ మొత్తం 39,202 యూనిట్ల అమ్మకాలు నమోదు చేసి 73.1 శాతం వార్షిక వృద్ధిని సాధించింది. టీవీఎస్, బజాజ్ మధ్య అమ్మకాల తేడా చాలా తక్కువగా ఉండటంతో రానున్న నెలల్లో ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్‌లో అగ్రస్థానం కోసం పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మూడో స్థానాన్ని ఏథర్ ఎనర్జీ నిలబెట్టుకుంది. బెంగళూరుకు చెందిన ఈ సంస్థ మే నెలలో 28,240 రిటైల్ రిజిస్ట్రేషన్లు నమోదు చేసింది. ఏప్రిల్‌తో పోలిస్తే అమ్మకాలు స్వల్పంగా తగ్గినప్పటికీ, గత ఏడాది మేతో పోలిస్తే కంపెనీ విక్రయాలు రెట్టింపు అయ్యాయి. ఏకంగా 100.3 శాతం వృద్ధిని నమోదు చేసింది. ముఖ్యంగా రిజ్టా ఫ్యామిలీ స్కూటర్ శ్రేణి, ఇప్పటికే మార్కెట్లో మంచి గుర్తింపు పొందిన 450 సిరీస్ మోడళ్లు అమ్మకాలకు బలంగా తోడ్పడ్డాయి.

హీరో సంచలనం

మే నెలలో అందరినీ ఆశ్చర్యపరిచిన కంపెనీ హీరో మోటోకార్ప్. దేశంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ అయిన హీరో, మొత్తం 19,067 ఎలక్ట్రిక్ టూ వీలర్లను విక్రయించింది. గత ఏడాది మేతో పోలిస్తే 158.2 శాతం భారీ వృద్ధిని నమోదు చేసింది. విడా ఎలక్ట్రిక్ స్కూటర్ శ్రేణి విస్తరణతో పాటు డీలర్ నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేయడం కంపెనీకి కలిసివచ్చింది.

దిగజారుతున్న ఓలా

ఒకప్పుడు మార్కెట్‌ను శాసించిన ఓలా ఎలక్ట్రిక్ మాత్రం ఇంకా ఒత్తిడిని ఎదుర్కొంటోంది. మే నెలలో 15,141 యూనిట్ల అమ్మకాలు నమోదు చేసినప్పటికీ, గత ఏడాది మేతో పోలిస్తే 20.2 శాతం తగ్గుదల కనిపించింది. అయితే ఏప్రిల్ 2026తో పోలిస్తే అమ్మకాలు కొంత మెరుగయ్యాయి.

సత్తా చూపుతున్న కొత్త బ్రాండ్లు

వర్ధమాన బ్రాండ్లలో గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ 7,695 యూనిట్ల అమ్మకాలతో 77.9 శాతం వృద్ధిని నమోదు చేసింది. రివర్ మొబిలిటీ 3,720 యూనిట్ల విక్రయాలతో 245.1 శాతం అద్భుత వృద్ధిని సాధించింది. మరోవైపు బిగాస్ (BGauss) కూడా 3,297 యూనిట్ల రిజిస్ట్రేషన్లతో గత ఏడాదితో పోలిస్తే మూడు రెట్లకు పైగా వృద్ధిని నమోదు చేసింది.

మొత్తంగా చూస్తే, భారత ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్ వేగంగా విస్తరిస్తూ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. టీవీఎస్, బజాజ్, ఏథర్, హీరో వంటి సంస్థల మధ్య పోటీ మరింత తీవ్రమవుతుండగా, వినియోగదారులకు మరిన్ని ఎంపికలు, మెరుగైన సాంకేతికత అందుబాటులోకి వస్తున్నాయి. ఇదే ఊపు కొనసాగితే 2026 సంవత్సరం ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగానికి అత్యంత కీలకమైన సంవత్సరంగా నిలిచే అవకాశాలు ఉన్నాయి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Frequently Asked Questions

మే 2026లో ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు ఎలా ఉన్నాయి?

మే 2026లో మొత్తం 1,70,733 ఎలక్ట్రిక్ స్కూటర్లు, మోటార్‌సైకిళ్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది మేతో పోలిస్తే ఇది 62.8 శాతం వృద్ధిని సూచిస్తుంది. ఏప్రిల్ 2026తో పోలిస్తే అమ్మకాలు 8.5 శాతం పెరిగాయి.

మే 2026లో అత్యధిక ఎలక్ట్రిక్ టూ వీలర్లను విక్రయించిన కంపెనీ ఏది?

టీవీఎస్ మోటార్ కంపెనీ మే 2026లో అత్యధికంగా 42,459 యూనిట్ల అమ్మకాలు నమోదు చేసి మొదటి స్థానంలో నిలిచింది. ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 64.5 శాతం వృద్ధిని సాధించింది.

మే 2026లో అత్యధిక వార్షిక వృద్ధిని సాధించిన ఎలక్ట్రిక్ టూ వీలర్ బ్రాండ్ ఏది?

రివర్ మొబిలిటీ 245.1 శాతం అద్భుత వృద్ధిని సాధించింది. హీరో మోటోకార్ప్ కూడా 158.2 శాతం భారీ వృద్ధిని నమోదు చేసింది, ఇది దేశంలో అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ.

మే 2026లో ఓలా ఎలక్ట్రిక్ పనితీరు ఎలా ఉంది?

ఓలా ఎలక్ట్రిక్ మే నెలలో 15,141 యూనిట్ల అమ్మకాలు నమోదు చేసింది. గత ఏడాది మేతో పోలిస్తే అమ్మకాలు 20.2 శాతం తగ్గాయి, కంపెనీ ఇంకా ఒత్తిడిని ఎదుర్కొంటోంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Renault Kiger, Triber, Kwidపై అద్భుతమైన ఆఫర్లు - వేల రూపాయలు ఆదా, ఇది పరిమిత కాల ఆఫర్‌
కొత్త కారు కొనేవాళ్లకు గుడ్‌న్యూస్‌ - రూ.68,000 వరకు డిస్కౌంట్లు ప్రకటించిన రెనాల్ట్‌
Maruti Suzuki Celerio EMI Calculator: 50వేల రూపాయల డౌన్‌పేమెంట్‌తో మారుతి సెలెరియో సొంతం చేసుకునే EMI ప్లాన్ ఇదే! 
50వేల రూపాయల డౌన్‌పేమెంట్‌తో మారుతి సెలెరియో సొంతం చేసుకునే EMI ప్లాన్ ఇదే! 
రేస్‌ బైక్‌ తరహాలో Yamaha R15 V4, MT-15 MotoGP ఎడిషన్లు లాంచ్‌ - FZ-S సిరీస్‌కు కొత్త రంగులు
యమహా R15 V4, MT-15 మోటోజీపీ ఎడిషన్లు లాంచ్‌.. అచ్చం 'రేస్‌ బైక్‌'ను చూసినట్లే ఉంది
TVS స్కూటర్ల ధరలు పెంపు.. పాపులర్‌ మోడళ్ల రేట్లు ఏకంగా రూ.11,000 వరకు హైక్‌, ఇదిగో లిస్ట్‌
TVS స్కూటర్‌ కొనేవాళ్లకు షాక్‌! iQube నుంచి Jupiter వరకు వేలల్లో పెరిగిన ధరలు - కొత్త రేట్లు ఇవే
Advertisement

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
Amritsar Police:జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
కలుషిత E20 ఇంధనంతో జాగ్రత్త! వెహికల్‌ ఓనర్లకు SIAM హెచ్చరిక - కేంద్రం కీలక ఆదేశాలు
E20 పెట్రోల్‌పై కొత్త ఆందోళన.. దెబ్బతింటున్న ఇంజిన్ పార్ట్స్, పెరుగుతున్న రిపేర్లు!
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Telangana Cabinet Expansion 2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
Embed widget