అన్వేషించండి

Upcoming Electric Cars India 2026: టాటా సియెరా నుంచి మహీంద్రా థార్ వరకు రాబోయే టాప్ ఈవీలు ఇవే!   పూర్తి రోడ్ మ్యాప్‌ ఇదే!

Upcoming Electric Cars India 2026: భారత్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాల విప్లవం మొదలుకానుంది. టాటా సియెరా నుంచి మహీంద్రా థార్‌ వరకు రాబోయే టాప్‌ ఈవీల ధరలు, రేంజ్‌, ఫీచర్ల గురించి తెలుసుకుందాం. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • భారత ఆటోమొబైల్‌లో 2026కల్లా పలు శక్తివంతమైన ఈవీలు రానున్నాయి.
  • టాటా సియెరా, అవిన్యా, మహీంద్రా థార్‌ ఈ మార్కెట్‌లోకొస్తున్నాయి.
  • కాంపాక్ట్ ఎస్‌యూవీలతో కియా, హ్యుందాయ్, టయోటా పోటీపడుతున్నాయి.

Upcoming Electric Cars India 2026: భారత్‌ ఆటోమొబైల్‌ రంగాన్ని గమనిస్తే, ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లుతున్న వేగం ఆశ్చర్యపరుస్తోంది. 2026 నాటికి భారత మార్కెట్‌లోకి అత్యంత శక్తివంతమైన, ఆకర్షణీయమైన మోడల్స్ రాబోతున్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల నుంచి లగ్జరీ ప్రియుల వరకు అందరికీ సరిపోయేలా కంపెనీలు తమ వ్యూహాలను సిద్ధం చేశాయి. 

టాటా సియెరా ఈవీ 

భారతీయ కార్ల ప్రేమికులకు సియెరా అంటే ఒక ఎమోషన్. 90వ దశకంలో ఒక వెలుగు వెలిగిన ఈ బ్రాండ్‌ను టాటా మోటార్స్‌ ఎలక్ట్రిక్ రూపంలో మళ్లీ తీసుకొస్తోంది. 

ఇది కేవలం కారు మాత్రమే కాదు. ఒక ఐకానిక్ రెట్రో- మోడర్న్‌ డిజైన్. Acti.ev+ప్లాట్‌ఫామ్‌పై నిర్మితమవుతున్న ఈ కారులో 2WD, AWD ఆప్షన్లు ఉండబోతున్నాయి. దీని లాంచ్ జులై- ఆగస్టు మధ్య ఉండే అవకాశం ఉంది. 20 నుంచి 25 లక్షల ఎక్స్‌షోరూమ్ ధరతో, ఒకారి ఛార్జ్ చేస్తే 450-600 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే సామర్థ్యం దీని సొంతం. వాస్తవ పరిస్థితుల్లో ఇది 400-500 కి.మి. వరకు మైలేజ్‌ ఇవ్వవచ్చు. 

టాటా అవిన్యా

టాటా గ్రూప్‌ నుంచి వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అవిన్యా ఇది కేవలం కారు కాదు. రోడ్లపై నడిచే ఒక అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞాం. విశాలమైన ఇంటీరియర్‌, అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీతో ది ప్రీమియం సెగ్మెంట్‌లో నిలవనుంది. 2026మధ్యలో విడుదలయ్యే అవకాశం ఉన్న కారు ధర 35 నుంచి 45 లక్షల వరకు ఉండవచ్చు. ఇది 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్‌ను ఇస్తుందని తెలుస్తోంది. 

మహీంద్రా థార్‌ ఇ, బీఈ సిరీస్‌

ఆఫ్ రోడింగ్ అంటే ఇష్టపడే వారికి మహీంద్రా ఎలక్ట్రిక్ వెర్షన్‌లో థార్‌ను పరిచయం చేస్తోంది. బోల్డ్ డిజైన్‌, ఆఫ్‌ రోడ్‌ కేపబిలిటీతో వస్తున్న థార్‌ ఇ, సాహసయాత్రలు చేసే వారికి ఒక క్రేజీ ఆప్షన్. 25 లక్ష ప్రారంభ ధరతో, 400-500 కిలోమీటర్ల రేంజ్‌తో ఇది 2026 ఆగస్టు లోపు మార్కెట్‌లోకి రావచ్చు. 

కాంపాక్ట్‌ ఎస్‌యూవీ సెగ్మెంట్‌ వస్తున్న వాహనాలు 

కుటుంబ అవసరాల కోసం వెతుకుతున్న వారికి ఈ సెగ్మెంట్‌ ఎంతో కీలక. ఇందులో మొదటి వరుసో కియా సైరోస్‌, హ్యుందాయ్‌ ఇన్‌స్టర్‌ ఉన్నాయి. 14 నుంచి 22 లక్షల ధరలో 350-450 కిలోమీటర్ల రేంజ్‌తో ఇవి 2026 రెండో లేదా మూడో క్వార్టర్‌లో విడుదల కానున్నాయి. 

టయోటా నుంచి ఆర్బన్ క్రూయిజ్‌ ఈవీ, మారుతి నుంచి ఇ-విటారా కూడా త్వరలోనే మార్కెట్‌లోకి రానున్నాయి. ఈ మోడల్స్ 20-28 లక్షల ధరలో ఉండొచ్చు. వీటి రీసేల్‌ వాల్యూ కూడా ఎక్కువగా ఉంటుందని అంచనా ఉంది. 

2026లో రాబోతున్న ఈ వాహనాలు భారత ఆటోమొబైల్ రంగాన్ని శాసించబోతున్నాయి. మీరు బడ్జెట్‌ ఆప్షన్లు కోసం చూస్తుంటే టాటా పంచ్‌ ఈవీ లేదా సిట్రోయెన్ ఇసీ3 అప్‌డేట్స్ మంచి ఎంపికలు. లగ్జరీ కోరుకుంటే హ్యుందాయ్‌ అయోనిక్‌ లేదా కియా ఈవీ9 వంటి మోడల్స్ సిద్ధంగా ఉన్నాయి.   

Frequently Asked Questions

2026 నాటికి భారత మార్కెట్‌లోకి ఎలాంటి ఎలక్ట్రిక్ వాహనాలు రానున్నాయి?

2026 నాటికి మధ్యతరగతి నుండి లగ్జరీ ప్రియుల వరకు సరిపోయేలా అనేక శక్తివంతమైన, ఆకర్షణీయమైన ఎలక్ట్రిక్ వాహనాల మోడల్స్ భారత మార్కెట్‌లోకి రానున్నాయి. కంపెనీలు తమ వ్యూహాలను సిద్ధం చేశాయి.

టాటా సియెరా ఈవీ ముఖ్య లక్షణాలు ఏమిటి?

టాటా సియెరా ఈవీ Acti.ev+ ప్లాట్‌ఫామ్‌పై నిర్మితమైంది. ఇది 2WD, AWD ఆప్షన్లతో రెట్రో-మోడర్న్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. దీని ధర 20-25 లక్షల మధ్య ఉండగా, రేంజ్ 450-600 కి.మీ.

మహీంద్రా థార్.ఇ ఎప్పుడు విడుదలవుతుంది? దీని రేంజ్ ఎంత?

మహీంద్రా థార్.ఇ 2026 ఆగస్టు లోపు మార్కెట్‌లోకి రావచ్చు. ఇది రూ. 25 లక్షల ప్రారంభ ధరతో 400-500 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది.

కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో ఏ ఎలక్ట్రిక్ వాహనాలు రానున్నాయి?

కియా సైరోస్, హ్యుందాయ్ ఇన్‌స్టర్ వంటి కాంపాక్ట్ ఎస్‌యూవీలు 2026 రెండో లేదా మూడో క్వార్టర్‌లో రానున్నాయి. వీటి ధర 14-22 లక్షల మధ్య, రేంజ్ 350-450 కి.మీ ఉంటుంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

రూ.8.71 లక్షల కియా సోనెట్‌ను రూ.1.30 లక్షల డౌన్‌పేమెంట్‌తో కొనొచ్చు! EMI, ఫైనాన్స్ డీటెయిల్స్ ఇవే!
డ్రీమ్‌ కారు 'కియా సోనెట్‌'ను దక్కించుకోవడం ఇప్పుడు ఇంకా ఈజీ! రూ.1.30 లక్షల డౌన్‌పేమెంట్‌ చాలు!
E85 ఇంధనంతో నడిచే తొలి స్కూటర్ హోండా ADV160.. 27 లీటర్ల స్టోరేజ్‌, రూ.1.70 లక్షల ధర
రూ.5,000 అడ్వాన్స్‌తో కొత్త హోండా ADV160.. E85 వరకు ఏ ఇంధనం పోసినా నడుస్తుంది
రాయల్ ఎన్‌ఫీల్డ్ Goan Classic 350 కంటే తక్కువ ధర!.. మార్కెట్‌లోకి సరికొత్త హోండా 'రెబల్ 300'
రాయల్‌ లుక్‌తో కొత్త హోండా రెబల్ 300 లాంచ్‌.. ఈ క్రూయిజర్ బైక్‌ ధర, ప్రత్యేకతలు ఇవే!
సుజుకి నుంచి వస్తున్న చవకైన ఎలక్ట్రిక్‌ కారు ఇదే కావచ్చు! e Sky ప్రత్యేకతలు ఇవే
చిన్న కారే.. కానీ 310km భారీ రేంజ్! సుజుకి తొలి ఎలక్ట్రిక్ 'కీ కారు' వచ్చేస్తోంది
Advertisement

వీడియోలు

Toxic Movie Telugu Review | యష్ 'టాక్సిక్' హిట్టా? ఫ్లాపా?
IND vs SL 2nd Test Updates | లంక బ్యాటర్లపై సంజయ్ మంజ్రేకర్ సీరియస్
DPL Aryavir Replicates Virender Sehwag | అచ్చం సెహ్వాగ్ లాగే కుమారుడి విధ్వంసం
Vaibhav Suryavanshi Test Entry | వైభవ్ టెస్ట్ ఎంట్రీపై ద్రవిడ్ సంచలన వ్యాఖ్యలు
Gundenininda Gudigantalu Serial August 26 | శివను కాపాడిన బాలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: ఏపీ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు.. జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సంజీవని
ఏపీ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు.. జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సంజీవని
YS Jagan Press Meet Highlights:
"రైతు, బీసీ ఛాంపియన్స్ మేమే" వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు!
Irumudi : టాక్సిక్ కాదు ఇరుముడి వేయండి - థియేటర్ వద్ద ఆడియన్స్ ధర్నా... వీడియో వైరల్
టాక్సిక్ కాదు ఇరుముడి వేయండి - థియేటర్ వద్ద ఆడియన్స్ ధర్నా... వీడియో వైరల్
ఇంద్రకీలాద్రి దుర్గమ్మ పవిత్రోత్సవాలు: ఆగస్టు 27 నుంచి దర్శన వేళల్లో కీలక మార్పులు!
ఇంద్రకీలాద్రి దుర్గమ్మ పవిత్రోత్సవాలు: ఆగస్టు 27 నుంచి దర్శన వేళల్లో కీలక మార్పులు!
Fake Korrameenu Fish Identification: మార్కెట్‌లో కొరమీను పేరిట ప్రాణాంతక థాయ్‌ మాంగూర్ దందా! రెండింటి మధ్య తేడా ఇలా తెలుసుకోండి?
మార్కెట్‌లో కొరమీను పేరిట ప్రాణాంతక థాయ్‌ మాంగూర్ దందా! రెండింటి మధ్య తేడా ఇలా తెలుసుకోండి?
Samantha Ruth Prabhu : ప్రెగ్నెన్సీతోనే సమంత జిమ్ వర్కౌట్స్ - షాకైన నెటిజన్స్... ఫోటోస్ చూశారా?
ప్రెగ్నెన్సీతోనే సమంత జిమ్ వర్కౌట్స్ - షాకైన నెటిజన్స్... ఫోటోస్ చూశారా?
Kriti Sanon GIVA Ad: కృతి సనన్ దుస్తులు వివాదం తర్వాత రక్షాబంధన్ ప్రకటన ఆపేసిన జీవా సంస్థ!
కృతి సనన్ దుస్తులు వివాదం తర్వాత రక్షాబంధన్ ప్రకటన ఆపేసిన జీవా సంస్థ!
Vaibhav Suryavanshi Test Entry | వైభవ్ టెస్ట్ ఎంట్రీపై ద్రవిడ్ సంచలన వ్యాఖ్యలు
Vaibhav Suryavanshi Test Entry | వైభవ్ టెస్ట్ ఎంట్రీపై ద్రవిడ్ సంచలన వ్యాఖ్యలు
Embed widget