అన్వేషించండి

Horoscope Today Dec 24th, 2023: ఈ రాశివారి ప్రవర్తన ప్రియమైనవారిని అవమానించేలా ఉండకూడదు, డిసెంబరు 24 రాశిఫలాలు

 Daily Horoscope Today : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా ఓ రాశివారి ఫలితాలని అంచనా వేస్తారు జ్యోతిష్యులు. ఈ రోజు రాశిఫలాలు ఇక్కడ తెలుసుకోండి....

 Daily Horoscope Today December 24th, 2023 ( డిసెంబరు 24 రాశిఫలాలు)

మేష రాశి (Aries Horoscope Today) 

ఈ రోజు మీరు మీ పని శైలిని మెరుగుపరచుకోవాల్సి ఉంటుంది.మీ  లక్ష్యాలపై దృష్టి సారించాలి. మీ పనికి ప్రాధాన్యత ఇవ్వాలి. మీ కృషి మీకు విజయాన్ని తెస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది.    2024 మేషరాశి ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

వృషభ రాశి (Taurus  Horoscope Today)

ఈ రోజు మీరు మీ బంధాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీరు మీ భాగస్వామితో కమ్యూనికేట్ చేయాలి. కొన్ని సమస్యల పరిష్కారానికి ఇదే మంచి సమయం. వ్యాపారంలో అభివృద్ధి చెందుతారు. నూతన పెట్టుబడులు కలిసొస్తాయి. సమయానికి డబ్బు చేతికందుతుంది. 2024 వృషభ రాశి ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

మిథున రాశి (Gemini Horoscope Today) 

ఈ రోజు మీరు మీ ఆరోగ్యం పట్ల అజాగ్రత్తగా ఉండకూడదు. పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం రావచ్చు. మీరు ఆహారం,  వ్యాయామంపై శ్రద్ధ వహించాలి. అలాగే మీరు మీ మనశ్శాంతి కోసం సమయాన్ని వెచ్చించాలి. పుణ్యకార్యాలపై ఆసక్తిని కనబరచాలి. 2024 మిథున రాశిఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి 

కర్కాటక రాశి (Cancer Horoscope Today)  

ఈ రోజు మీరు మీ కుటుంబానికి సమయం కేటాయిస్తారు. బాధ్యతల నుంచి కూడా తప్పించుకోవాలి అనుకోరు. రోజంతా సంతోషంగా ఉంటారు. మీ నిర్ణయాలు మీరు తీసుకోవడం మంచిది. ఇతరుల సలహాలు స్వీకరించాలి కానీ నిర్ణయం మాత్రం మీ ఆలోచనలకు అనుగుణంగానే తీసుకోవాలి.   2024 కర్కాటక రాశి ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

సింహ రాశి (Leo Horoscope Today)

ఈ రోజు మీరు మీ వ్యాపారంలో చాలా కష్టపడవలసి ఉంటుంది. మీరు మీ లక్ష్యాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. కొత్త ఆలోచనలను స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. ఉద్యోగులకు సంస్థతో బంధం బలపడుతుంది. ఒంటరిగా ఉండొద్దు..అందరితో కలిసేందుకు ప్రయత్నించండి. 2024 సింహ రాశి ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

కన్యా రాశి  (Virgo Horoscope Today) 

ఈ రోజు మీరు మీ ఆర్థిక విషయాలపై ఒక కన్నేసి ఉంచాలి. వ్యాపార భాగస్వాములతో కొన్ని సమస్యలు ఉండవచ్చు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులును నియంత్రించాలి. మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి  తగిన నిర్ణయాలు తీసుకోవాలి. 2024 కన్యా రాశి ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

తులా రాశి (Libra Horoscope Today) 

కొన్ని రోజులుగా వెంటాడుతున్న సమస్యలకు ఈ రోజు పరిష్కారం దొరుకుతుంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. స్నేహితులు, కుటుంబ సభ్యులకు సమయం కేటాయించాలి. ఈ రోజు మీకు ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. 

Also Read: డిసెంబర్ 25 నుంచి ఈ 5 రాశుల వారికి మంచిరోజులొస్తున్నాయ్!

వృశ్చిక రాశి (Scorpio Horoscope Today) 

ఈ రోజు మీరు మీ వ్యక్తిగత అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. మీ మాటతీరు మీ ప్రియమైనవారిని అనుమానించేలా ఉండకూడదు. కొత్త ప్రణాళికలు అమలు చేస్తారు. మీ శక్తి సామర్థ్యాలమేరకు పనిచేయండి. లక్ష్యాలను చేరుకునేందుకు సరైన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఇది. ఆరోగ్యంపై కూడా శ్రద్ధ అవసరం.

ధనుస్సు రాశి  (Sagittarius Horoscope Today) 

ఈ రోజు మీరు మీ వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి. మీ చుట్టూ ప్రతికూలతను తొలగించడానికి ప్రయత్నించాలి. ఫ్యూచర్ కోసం సరికొత్త ఆలోచనలు చేయాల్సి ఉంటుంది. వ్యాపారంలో నూతన ప్రణాళికలు అమలు చేయండి. నిరుద్యోగులు ఉద్యోగంలో స్థిరపడతారు. 

Also Read: డిసెంబర్ 25 నుంచి ఈ 5 రాశుల వారికి మంచిరోజులొస్తున్నాయ్!

మకర రాశి (Capricorn Horoscope Today) 

ఈ రోజు మీరు మీ బాధ్యతల పట్ల అజాగ్రత్తగా ఉండకూడదు. చేయాల్సిన పనులకు ప్రాధాన్యత నివ్వాలి. మీరు ఏం సాధించాలి అనుకుంటున్నారో ఆ విషయంలో అంకితభావంతో ఉండాలి. కుటుంబానికి సమయం కేటాయించాలి. కోపం తగ్గించుకోవాలి. ఆరోగ్యం ,ఆదాయం బాగానే ఉంటుంది. 

కుంభ రాశి  (Aquarius Horoscope Today) 

ఈ రోజు మీ కుటుంబ పరిస్థితి బాగుంటుంది. పిల్లల విషయంలో కొనసాగుతున్న ఆందోళనలు దూరమవుతాయి. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. ఎవరితోనైనా సైద్ధాంతిక విభేదాలు పరిష్కారం అవుతాయి. ప్రజా జీవితంలో చురుకుగా ఉండగలరు. రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు.

Also Read: ఈ రాశులవారికి 2024 లో వివాహయోగం, ప్రేమికులకు గుడ్ టైమ్!

మీన రాశి (Pisces Horoscope Today) 

ఈ రోజు మీరు మనశ్శాంతి కోసం సమయాన్ని వెచ్చించాలి. మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా, సంతోషంగా ఉంచుకునే ప్రయత్నం మీరే చేయాలి. మీ మానసిక స్థితిని స్థిరంగా ఉంచుకోవడంపై శ్రద్ధ వహించాలి. మీకు ఆసక్తి ఉండే పనులను మాత్రమే చేయడం ద్వారా మీరు కొంత ప్రశాంతత పొందుతారు. సమయానికి డబ్బు చేతికందుతుంది. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలున్నాయి.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పండితులు, కొన్ని పుస్తకాల నుంచి సేకరించింది మాత్రమే. దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం

టాప్ హెడ్ లైన్స్

16-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు!
16-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు!
మీన రాశి ఆగస్టు 16-22 వారఫలం
మీన రాశి ఆగస్టు 16-22 వారఫలం
కుంభ రాశి ఆగస్టు 16-22 వారఫలం
కుంభ రాశి ఆగస్టు 16-22 వారఫలం
మకర రాశి ఆగస్టు 16-22 వారఫలం
మకర రాశి ఆగస్టు 16-22 వారఫలం

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
Sambarala Yetigattu Release Date : సంక్రాంతి బరిలో సంబరాల ఏటిగట్టు - సుప్రీమ్ హీరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ డేట్ ఫిక్స్
సంక్రాంతి బరిలో సంబరాల ఏటిగట్టు - సుప్రీమ్ హీరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ డేట్ ఫిక్స్
Embed widget