డిసెంబరు 25 నుంచి ఈ రాశివారికి ఆదాయం, ఆనందం పెరుగుతుంది నవంబరు 30న తులారాశిలో ప్రవేశించిన శుక్రుడు డిసెంబరు 25న రాశి మారబోతున్నాడు. జనవరి 19 వరకూ వృశ్చిక రాశిలో సంచరిస్తాడు. వృశ్చిక రాశిలో శుక్రుడి సంచారం సింహ రాశివారికి శుభఫలితాలనిస్తోంది శుక్రుడి సంచారం కారణంగా జనవరి 19 వరకూ సింహ రాశి ఉద్యోగులు, వ్యాపారులకు అన్నీ అనుకూల పరిస్థితులే ఉంటాయి. చేపట్టిన పనిలో విజయం సాధిస్తారు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సమయం స్పెండ్ చేస్తారు. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారు గుడ్ న్యూస్ వింటారు కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అనుకున్నవారికి ఇదే మంచి సమయం. విద్యారంగంతో అనుబంధం ఉన్న వారు మంచి ఫలితాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. Images Credit: Pixabay