కన్యా రాశి వారిపై 2024 లో కేతువు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి.ఉద్యోగులు, వ్యాపారులకు ఆర్థికంగా ఈ ఏడాది మంచి ఫలితాలనే ఇస్తోంది
జనవరి , ఫిబ్రవరి నెలల్లో అనవసరమైన పరుగులు , ఖర్చులు ఉంటాయి. మీరు సంఘర్షణ పని పరిస్థితులను ఎదుర్కొంటూనే ఉంటారు.
మార్చి , ఏప్రిల్లో మొదట్నుంచీ కష్టంగా ఉంటుంది. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. గాయాల పాలయ్యే ప్రమాదం ఉంది జాగ్రత్త.
మే నెలలో చేపట్టిన పనుల్లో ఆంటకాలు తప్పవు. చర్చలకు దూరంగా ఉండాలి. కష్టపడితేనే ఫలితం అందుకుంటారు
గడిచిన నెలల్లో ఆగిపోయిన పనులన్నీ జూన్ లో ఊపందుకుంటాయి. పిల్లలకు సంబంధించి గుడ్ న్యూస్ వింటారు. ప్రభుత్వానికి సంబంధించిన పనుల్లో పురోగతి ఉంటుంది.
జూలైలో వాహనాలతో జాగ్రత్తగా ఉండాలి. మీ బలహీనతలను ఎవ్వరి ముందూ బయటపెట్టొద్దు. మీరు అత్యంత సన్నిహితులు అనుకున్నవారే ద్రోహం చేస్తారు.
ఆగష్టులో బుధుడు తిరోగమనంలో ఉంటాడు. దీనివల్ల మానసిక ఇబ్బందులుంటాయి. నిర్ణయాలు తీసుకోవడంలో సందిగ్ధం నెలకొంటుంది
సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో పురోగతి ఉంటుంది. చెడు విషయాలు మెరుగుపడతాయి. కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. సంపదకు కొన్ని మార్గాలుంటాయి.
నవంబర్, డిసెంబర్ నెలలు కొంత కష్టంగానే ఉంటాయి. మీరు మీ భాగస్వామి ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కొంటారు. Images Credit: Pixabay