2024 కర్కాటక రాశివారి ఫలితాలివే!



2024 సంవత్సరం కర్కాటక రాశివారికి మిశ్రమ ఫలితాలున్నాయి



కర్కాకట రాశివారికి ఈ ఏడాది ప్రారంభం నుంచి మార్చి వరకు కుజుడు కర్కాటక రాశిలో సంచరిస్తాడు..దీనివల్ల అధిక కోపం, భూవివాదాలు, ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది.



మార్చి, ఏప్రిల్‌లో సమీప బంధువులతో వాగ్వాదాలు, శత్రువులతో మనస్పర్థలు ఏర్పడే అవకాశం ఉంటుంది.కారణం లేకుండా అనవసర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది



మే నెల కర్కాటక రాశివారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది కానీ. ఆరోగ్యం, వ్యాపారం పరంగా అంత మంచిది కాదు.



జూన్ నెల ఆదాయ మార్గాలకు అనుకూలం. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. స్నేహితులు, కుటుంబంతో మంచి సమయం స్పెండ్ చేస్తారు.



జూలై, ఆగష్టు నెలల్లో ఆరోగ్య పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఖర్చులు పెరుగుతాయి. ఆగష్టు ప్రారంభంలో కుటుంబ సభ్యుల నుంచి సహకారం ఉంటుంది.



సెప్టెంబరు నెల ఆరంభం అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ...సెప్టెంబరు 20 నుంచి పరిస్థితి మళ్లీ ట్రాక్ లోకి వస్తుంది. ఆర్థిక లాభం పొందుతారు.



2024 చివరి రెండు నెలల్లో మిశ్రమ ఫలితాలుంటాయి. చిన్న చిన్న సమస్యలు మినహా ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది.



Images Credit: Pixabay