2024 వృషభ రాశి వార్షిక ఫలితాలు వృషభ రాశి వారికి 2024 మంచి ఫలితాలే ఉన్నాయి. శుక్రుడు సప్తమంలో ఉండడం వల్ల అదృష్టం కలిసొస్తుంది. 2024 లో మొదటి రెండు నెలలు వృషభ రాశివారికి అనారోగ్య సమస్యలున్నాయి. ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉంటుంది. మార్చి మరియు ఏప్రిల్ 2024లో వృషభ రాశివారు ఊహించని ధనాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. మీరు ప్రయాణాలలో ప్రయోజనం పొందుతారు మే నెలలో బృహస్పతి వృషభరాశిపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. పురోగతికి మార్గాలు ఏర్పడతాయి. జూన్ నెలలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి . మీరు కష్టపడి పనిచేస్తే విజయం సాధిస్తారు. జూలై, ఆగష్టులో కుటుంబంలో గొడవలు జరిగే అవకాశం ఉంది. ఏదో విషయంలో మనసు కలత చెందుతుంది. కొన్ని ఆందోళనలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. అక్టోబరు నెలలో వృషభ రాశివారు ఊహించని ధనాన్ని పొందే అవకాశం ఉంది. ఈ నెలంతా బిజీగా ఉంటారు. 2024 లో చివరి రెండు నెలల్లో కుటుంబ కలహాలు పెరిగుతాయి. ఎత్తైన ప్రదేశాలకు వెళ్లకపోవడమే మంచిది. Images Credit: Pixabay