2024 మిథున రాశి ఫలితాలు - కొత్త ఏడాదిలో అయినా కష్టాలు తీరుతాయా!
మిథునరాశి వారికి 2023 తో పోలిస్తే 2024 బాగానే ఉంటుంది
ఏడాది ఆరంభంలో వైవాహిక జీవితంలో రకరకాల ఇబ్బందులు వచ్చినా ఆ తర్వాత నెమ్మదిగా సర్దుకుంటాయి.
మిథునరాశికి అధిపతి అయిన బుధుడు ఫిబ్రవరి నెలలో దహనస్థితిలో ఉంటాడు. దీంతో ఆరోగ్యంలో కొంత సమస్య రావచ్చు. మీరు ఇష్టపడే వ్యక్తుల నుంచి మీరు నిర్లక్ష్యానికి గురవుతారు. అవమానాలు
మార్చి , ఏప్రిల్‌లలో అధిక ఖర్చులు మరియు ఒత్తిడి పరిస్థితులు ఉన్నాయి. అనారోగ్య సమస్యలు అలానే ఉంటాయి. పని ప్రదేశంలో మరింత వివాదాలు ఉంటాయి.
మొదటి నాలుగు నెలలు ఎదుర్కొన్న సమస్యల నుంచి మే నెలలో కొంత ఉపశమనం లభిస్తుంది. మే 10 తర్వాత పరిస్థితిలో కొంత మెరుగుదల ఉంటుంది
జూన్ నెలలో పనుల్లో వేగం పెరుగుతుంది. ఆదాయం మెరుగుపడుతుంది. పరిస్థితులు చక్కబడతాయి
జూలై నెలలో మరికొన్ని గొడవల్లో చిక్కుకుంటారు. కానీ మీ పోరాటం సానుకూల ఫలితాలనిస్తుంది. ఆదాయం పరంగా లాభాలు ఉంటాయి.
ఆగస్టు నెలలో ప్రారంభ సమయం ఆర్థికంగా బావుంటుంది కానీ బుధుడు తిరోగమనం కారణంగా, నాడీ వ్యవస్థకు సంబంధించిన కొన్ని సమస్యలు ఉంటాయి.
సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఆకస్మిక ధనలాభం వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు మీ జీవిత భాగస్వామి నుంచి సానుకూల ఫలితాలను పొందుతారు.
చివరి రెండు నెలలు ఆరోగ్యపరంగా మీకు మంచిదే కానీ కుటుంబంలో కలహాలు ఇబ్బంది పెడతాయి.Images Credit: Pixabay