భగవద్గీతను సాక్షాత్తుగా (లైవ్) విన్నవారెవరు!



భగవద్గీత చదివిన వారికి ఎంతవరకూ అర్థమైంది, చదవని వారు తెలుసుకోవాల్సిన విషయాల గురించి కొన్ని ప్రశ్నలు - సమాధానాలు



భగవద్గీతలో ఎన్ని అధ్యాయాలున్నాయి?
పద్దెనిమిది (18)



భగవద్గీతకు ప్రథమ ప్రచారకుడెవరు?
సంజయుడు.



సేనానాయకుల్లో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పాడు?
కుమారస్వామి.



మహాభారత సంగ్రామ ప్రారంభంలో అర్జునుడు ఊదిన శంఖం పేరేంటి?
దేవదత్తం



భగవద్గీతలో వ్యాసుడు ఎన్ని ఛందస్సులు రాశారు?
ఐదు. (అనుష్టుప్, ఇంద్రవజ్ర, ఉపేంద్రవజ్ర, ఉపజాతి, విపరీతపూర్వ)



భగవద్గీతను సాక్షాత్తుగా (లైవ్) వినినవారెవరు?
నలుగురు ( అర్జునుడు, వ్యాసుడు, సంజయుడు, హనుమంతుడు)



భగవద్గీతలో శ్రీకృష్ణునికి వాడిన ఏవైనా మూడు పేర్లు?
అచ్యుత, అనంత, జనార్ధన



భగవద్గీతలో అర్జునునికి వాడిన ఏవైనా మూడు పేర్లు?
ధనుంజయ, పార్ధ, కిరీటి



Image Credit: Pinterest