2024 సింహ రాశివారి ఫలితాలివే!



2024 సింహరాశి వారికి అదృష్టం కలిసొస్తుంది. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. అయితే మానసిక ఒత్తిడి వెంటాడుతుంది.



కొన్ని తప్పులను సరిదిద్దుకోవడానికి జనవరి, ఫిబ్రవరి నెలలు మంచివి. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తిచేస్తారు. ఏ పని చేపట్టినా అనుకూల ఫలితాలు వస్తాయి.



మార్చిలో శని, కుజుడు, గురు, సూర్యుడు కలయిక ప్రభావం ఈ రాశివారిపై ఉంటుంది. అనుకోని సమస్యలొస్తాయి. కానీ కష్టానికి తగిన ఫలితం పొందుతారు.



ఏప్రిల్లో ఈ ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. తండ్రితో లేదా ఇంట్లోని పెద్దలతో వాగ్వాదాలుంటాయి. శత్రువుల వల్ల అనవసర సమస్యలు ఏర్పడతాయి.



మే, జూన్ నెలల్లో సింహరాశివారికి మిశ్రమ ఫలితాలుంటాయి. మే ప్రారంభంలో, ఉద్యోగం , వ్యాపారంలో పురోగతి ఉంటుంది. అదృష్టం కలిసొస్తుంది.



జూలై నెలలో ఉద్యోగంలో ప్రమోషన్, పురోగతికి అవకాశాలు ఉన్నాయి. గౌరవం పొందుతారు. ఉన్నతాధికారుల నుంచి ప్రత్యేక ప్రశంసలు అందుకుంటారు.



ఆగష్టు నెలలో సింహ రాశివారికి మిశ్రమ ఫలితాలున్నాయి. ఆర్థికంగా మెరుగుదల ఉంటుంది. చేపట్టిన పనులన్నీ సక్సెస్ ఫుల్ గా పూర్తవుతాయి.



సెప్టెంబర్,అక్టోబర్ నెలల్లో మిశ్రమ ఫలితాలుంటాయి. వ్యాపారులకు శుభసమయం. కానీ కుటుంబ పరిస్థితి బాగా ఉండదు. అనారోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది.



నవంబరు నెల మీకు అంతగా కలసిరాదు. అనకుున్న పనులు పూర్తికావు. కష్టానికి తగిన ఫలితం పొందలేరు



డిసెంబరు నెలలో ఆర్థిక లాభం ఉంటుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. సంతోషంగా ఉంటారు. Images Credit: Pixabay