అన్వేషించండి

Gemini Yearly Horoscope 2024: ఈ రాశివారికి 2024లో అనారోగ్యం, మానసిక ఒత్తిడి తప్పదు - ఆ 3 నెలలు కొంత ఉపశమనం!

Gemini Yearly Horoscope 2024 : 2024 లో మీ రాశిప్రకారం వృత్తి, విద్య, ఆరోగ్యం, ప్రేమ, కుటుంబం, కెరీర్ విషయాల్లో ఎలా ఉంటుందో ఇక్కడ తెలుసుకోండి..

Astrology 2024 New Year Gemini Yearly Horoscope:

మిథునరాశి వారికి 2023 తో పోలిస్తే 2024 బాగానే ఉంటుంది కానీ ..ఏడాది ఆరంభంలో వైవాహిక జీవితంలో రకరకాల ఇబ్బందులు వచ్చినా ఆ తర్వాత నెమ్మదిగా సర్దుకుంటాయి. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. కొన్ని బాధాకరమైన పరిస్థితుసు ఎదుర్కోవాల్సి ఉంటుంద. వివాదాల్లో చిక్కుకుంటారు. ఆ తర్వాత నెమ్మదిగా పరిస్థితులు సర్దుకుంటాయి. 2024 జనవరి నుంచి డిసెంబర్ వరకూ మిథునరాశి వారికి జాతకం..

Also Read: ఈ రాశివారికి 2024లో ఈ 4 నెలలు పరీక్షా కాలమే!

జనవరి నుంచి డిసెంబర్ 2024 మిథునరాశి వారి జాతకం 

జనవరి
ఏడాది ఆరంభంలో అనారోగ్య సమస్యలు వెంటాడతాయి. వ్యక్తిగత జీవితంలో కొన్ని ఇబ్బందులుంటాయి

ఫిబ్రవరి
 మిథునరాశికి అధిపతి అయిన బుధుడు ఫిబ్రవరి నెలలో దహనస్థితిలో ఉంటాడు. దీంతో ఆరోగ్యంలో కొంత సమస్య రావచ్చు. మీరు ఇష్టపడే వ్యక్తుల నుంచి మీరు నిర్లక్ష్యానికి గురవుతారు.మీకు సంబంధం లేని సమస్యలలో మీరు చిక్కుకుంటారు. మీపై కొన్ని ఆరోపణలు వస్తాయి, అవమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ఉండండి...

మార్చి, ఏప్రిల్
మార్చి , ఏప్రిల్‌లలో అధిక ఖర్చులు మరియు ఒత్తిడి పరిస్థితులు ఉన్నాయి. అనారోగ్య సమస్యలు అలానే ఉంటాయి. పని ప్రదేశంలో మరింత వివాదాలు ఉంటాయి. మీకు వ్యతిరేకంగా పనికిరాని కుట్రలు జరగవచ్చు..ఈ సమయంలో బుధుడు బలహీన స్థితిలో ఉంటాడు..పైగా రాహువుతో సంచరిస్తాడు. ఇది మిథున రాశివారికి అస్సలు మంచి సమయం కాదు. అందుకే వీలైనంత వరకూ మనసు చెదిరిపోకుండా ధైర్యంగా ఉండాలి. కాస్త ఓపికగా వ్యవహరించాలి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వీలైనంతవరకూ అప్పులు చేయొద్దు...ఇవ్వొద్దు.

Also Read: 2024లో ఈ రాశులవారు జాగ్రత్త, శనిగ్రహంతో ఇబ్బందులు తప్పవు

మే
మొదటి నాలుగు నెలలు ఎదుర్కొన్న సమస్యల నుంచి మే నెలలో కొంత ఉపశమనం లభిస్తుంది. మే 10 తర్వాత పరిస్థితిలో కొంత మెరుగుదల ఉంటుంది. ఉద్యోగం, వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు ఓ కొలిక్కి వస్తాయి.

జూన్
జూన్ నెలలో పనుల్లో వేగం పెరుగుతుంది. ఆదాయం మెరుగుపడుతుంది. పరిస్థితులు చక్కబడతాయి.

జూలై
మళ్లీ జూలై నెలలో మరికొన్ని గొడవల్లో చిక్కుకుంటారు. కానీ మీ పోరాటం సానుకూల ఫలితాలనిస్తుంది. ఆదాయం పరంగా లాభాలు ఉంటాయి. వ్యాపారులకు శుభసమయం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ పురోగతిలో కొన్ని  పొరపాట్లు కూడా ఉండవచ్చు.

ఆగస్టు
ఆగస్టు నెలలో ప్రారంభ సమయం ఆర్థికంగా బావుంటుంది. కానీ బుధుడు తిరోగమనం కారణంగా, నాడీ వ్యవస్థకు సంబంధించిన కొన్ని సమస్యలు లేదా మానసిక ప్రశాంతత లేదా మరింత సంఘర్షణ ఉంటుంది. కోపం పెరుగుతుంది.

Also Read: కుజ దోషం, కాలసర్ప దోషం ఉన్నవారు డిసెంబరు 18న ఇలా చేయండి!

సెప్టెంబర్, అక్టోబర్
ఈ రెండు నెలల్లో ఆకస్మిక ధనలాభం వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు మీ జీవిత భాగస్వామి నుంచి సానుకూల ఫలితాలను పొందుతారు. మీ ప్రతిష్ఠ పెరుగుతుంది.

నవంబర్, డిసెంబర్
చివరి రెండు నెలలు ఆరోగ్యపరంగా మీకు మంచిదే కానీ కుటుంబంలో కలహాలు ఇబ్బంది పెడతాయి. లావాదేవీలలో జాగ్రత్తగా ఉండండి. లేదంటే డబ్బు వృథా అయ్యే అవకాశం ఉంది. 

మిథున రాశివారి ఆరోగ్యం (Gemini Health Horoscope 2024)
మిథున రాశివారికి ఆరోగ్య పరంగా 2024 సంవత్సరం ప్రత్యేకంగా మంచిది కాదు. అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూనే ఉంటారు. తరచూ ఫార్మసీని సందర్శిస్తూనే ఉంటారు. మానసిక ఒత్తిడి లేదా నాడీ వ్యవస్థ సంబంధిత సమస్యలు ఉండవచ్చు.

మిథున రాశివారి వ్యాపారం (Gemini  Bussines and Money Horoscope 2024)
వ్యాపారం ,  డబ్బు  వ్యాపార పరంగా 2024 సంవత్సరం మిశ్రమంగా ఉంటుంది. సాధారణ హెచ్చు తగ్గులు ఉంటాయి. కొంత పోరాటం ఉంటుంది కానీ పోరాట ఫలితం సానుకూలంగా ఉంటుంది.  ఆర్థిక లాభం కూడా ఆటోమేటిక్‌గా వస్తుంది.

Also Read: ఈ రాశివారికి 2024 లో ఊహించని ధనలాభం

మిథున రాశివారి విద్య (Gemini Education Horoscope 2024)
మిథున రాశివారికి విద్యా పరంగా మిశ్రమంగా ఉంటుంది. కొన్ని సమస్యలు తలెత్తుతాయి, ముఖ్యమైన పరీక్షలకు ఆటంకం ఏర్పడవచ్చు. కాబట్టి పరీక్షలు, చదువుల విషయంలో జోలికి పోకండి.

మిథున రాశివారి వివాహ జీవితం (Gemini Marriage Life Horoscope 2024) 
గడిచిన ఏడాదితో పోలిస్తే మిథున రాశివారి వైవాహిక జీవితం బాగానే ఉంటుంది. ఆరంభంలో కొన్ని ఇబ్బందులున్నప్పటికీ రాను రాను సర్దుకుంటాయి. జీవిత భాగస్వామి ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. ఆదాయం పెరుగుతుంది. చిన్న చిన్న సమస్యలుంటాయి కానీ తీవ్రమైన సమస్యలు రావు. 

పరిహారం: వినాయకుడికి దూర్వారయుగ్మం సమర్పించండి, ప్రతి బుధవారం విష్ణుసహస్రనామం పఠించండి లేదా వినండి.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పండితులు, కొన్ని పుస్తకాల నుంచి సేకరించింది మాత్రమే. దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
BRS News: రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
Embed widget