అన్వేషించండి

Horoscope 2024: ఈ రాశివారికి 2024 మొత్తం పోరాటాలే కానీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది!

Cancer Yearly Horoscope 2024:

Astrology 2024 New Year Cancer Yearly Horoscope 2024:  2024 సంవత్సరం కర్కాటక రాశివారికి మిశ్రమ ఫలితాలున్నాయి. ఆర్థిక పరంగా ఈ సంవత్సరం బాగానే ఉంటుంది. శని ప్రభావంతో ఈ ఏడాది ఆరంభంలో ఏవో చింతలు, అనవసరమైన ఖర్చులు , వివాదాలు  ఇబ్బంది పెడతాయి.  శుభ కార్యాలలో ఆటంకాలు ఎదురవుతాయి, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది . వృత్తి జీవితంలో వృద్ధి ఉంటుంది. నూతన పెట్టుబడులు పెడతారు. జనవరి నుంచి డిసెంబరు వరకూ సంవత్సర ఫలితాలు ఇలా ఉన్నాయి

2024 జనవరి నుంచి డిసెంబర్ వరకూ కర్కాటక రాశి ఫలితాలు

జనవరి, ఫిబ్రవరి
కర్కాకట రాశివారికి ఈ ఏడాది ప్రారంభం నుంచి మార్చి మధ్య వరకు కుజుడు కర్కాటక రాశిలో సంచరిస్తాడు..దీనివల్ల అధిక కోపం, భూవివాదాలు, ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అత్యంత సన్నిహితులను నమ్మకం కూడా సరికాదు. తలనొప్పి లేదా కంటి నొప్పుల సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. 

మార్చి, ఏప్రిల్
మార్చి, ఏప్రిల్‌లో సమీప బంధువులతో వాగ్వాదాలు, శత్రువులతో మనస్పర్థలు ఏర్పడే అవకాశం ఉంటుంది.కారణం లేకుండా అనవసర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది

మే
మే నెల కర్కాటక రాశివారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది కానీ. ఆరోగ్యం, వ్యాపారం పరంగా అంత మంచిది కాదు. ఈ సమయంలో రాహువు, కుజుడు కలయిక మీ రాశిపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. ఈ సమయంలో పదునైన పనిముట్ల కారణంగా గాయపడే ప్రమాదం ఉంది  లేదంటే కాలిన గాయాలయ్యే అవకాశం ఉంది జాగ్రత్త. 

జూన్ 
జూన్ నెల ఆదాయ మార్గాలకు అనుకూలం. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. స్నేహితులు, కుటుంబంతో మంచి సమయం స్పెండ్ చేస్తారు. ఈ నెలలో మీరు గుడ్ న్యూస్ వినే అవకాశం ఉంది.

జూలై, ఆగష్టు
జూలై, ఆగష్టు నెలల్లో ఆరోగ్య పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఖర్చులు పెరుగుతాయి. ఆగష్టు ప్రారంభంలో కుటుంబ సభ్యుల నుంచి సహకారం ఉంటుంది. మళ్లీ ఆగష్టు చివర్లో కొన్ని సమస్యలు తప్పవు. 

సెప్టెంబరు
సెప్టెంబరు నెల ఆరంభం అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ...సెప్టెంబరు 20 నుంచి పరిస్థితి మళ్లీ ట్రాక్ లోకి వస్తుంది. ఆర్థిక లాభం పొందుతారు. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. సహోద్యోగులతో స్నేహం పెరుగుతుంది...పై అధికారులతో సమన్వయం మెరుగుపడుతుంది. 

నవంబరు, డిసెంబరు
2024 చివరి రెండు నెలల్లో మిశ్రమ ఫలితాలుంటాయి. చిన్న చిన్న సమస్యలు మినహా ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. వ్యాపారంలో వృద్ధి సాధ్యమవుతుంది. గృహంలో సమస్యలు తగ్గుతాయి. 

కర్కాటక రాశి ఉద్యోగులు
2024 లో కర్కాటక రాశి ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలుంటాయి. శని 8 వ స్థానంలో ఉండడంతో చేపట్టే ప్రతి పనిలోనూ సవాళ్లు, సమస్యలు తప్పవు. ఆకస్మిక బదిలీలు ఉండే అవకాశం ఉంది. అయినప్పటికీ మీకున్న ఆత్మవిశ్వాసంతో అవన్నీ ఎదుర్కొంటారు. 

కర్కాటక రాశివారి ఆరోగ్యం (Cancer Health Horoscope 2024) 

ఈ ఏడాది మీ ఆరోగ్యం పట్ల మరింత అవగాహన అవసరం. మానసిక సమస్యలు, ఏదో ఒక రకమైన శరీర నొప్పి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. తల్లి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి.

కర్కాటక రాశి వారి వ్యాపారం (Cancer Bussines and Money Horoscope 2024) 

వ్యాపారులకు  2024 సంవత్సరం సాధారణంగా ఉంటుంది. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. కొత్త పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. 

కర్కాటక రాశి వారి  విద్య  (Cancer Education Horoscope 2024) 

విద్యార్థులు స్నేహితులతో వివాదాలకు దూరంగా ఉండాలి. చదువు పరంగా చిన్న చిన్న సమస్యలున్నప్పటికీ కాలక్రమేణా అవి మెరుగుపడతాయి. 

కర్కాటక రాశి వారి  వివాహ జీవితం (Cancer Marriage Life Horoscope 2024) 

2024 సంవత్సరం కర్కాటక రాశివారి వైవాహిక జీవితం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. వివాహేతర సంబంధాల వైపు మొగ్గు చూపించవద్దు. ఇతర ఆకర్షణకు దూరంగా ఉండడం మంచిది. 

పరిహారం: ప్రతిరోజూ శని స్తోత్రం పారాయణం చేయండి.  రుద్రాభిషేకం చేయిస్తే మంచిది. 

2024 మేషరాశి ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

2024 వృషభ రాశి ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

2024 మిథున రాశిఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
Embed widget