X

Welfare Scam : నమ్మకాన్ని అమ్మేశారా..? వేల్ఫేర్ మరో అగ్రిగోల్డ్ తరహా మోసమా..?

వేల్ఫేర్ గ్రూప్ ఐదు రాష్ట్రాలలో మరుమూల ప్రాంతాల్లో నిరుపేదను టార్గెట్ చేసి రూ. 1200 కోట్లు డిపాజిట్లు సేకరించి బోర్డు తిప్పేసినట్లుగా భావిస్తున్నారు.

FOLLOW US: 

" నమ్మకానికి అమ్మ వంటిది " అనే ట్యాగ్ లైన్ పెట్టి చిట్‌ఫండ్స్ వ్యాపారం చేసిన వేల్ఫేర్ గ్రూప్ వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా, చత్తీస్‌ఘడ్‌, జార్ఖండ్‌లలో దుమారం రేపుతోంది. ఆ సంస్థ ప్రజలను రూ. 1200కోట్ల మేర మోసగించిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఈ నాలుగు రాష్ట్రాల్లోనే అగ్రిగోల్డ్ సంస్థ చేసిన మోసం వల్ల లక్షలాది మంది మోసపోయారు. వారిని ఆదుకోవడానికి ప్రభత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇలాంటి సమయంలో వేల్ఫేర్ గ్రూప్ యజమాని అయిన మళ్ల విజయ్ ప్రసాద్‌ను ఒరిస్సా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లడం చర్చనీయాంశమయింది. ఆయన ఏపీ అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కావడం ఈ వ్యవహారం హాట్ టాపిక్ అవడానికి కారణం.
Welfare Scam :  నమ్మకాన్ని అమ్మేశారా..? వేల్ఫేర్ మరో అగ్రిగోల్డ్ తరహా మోసమా..?

నమ్మకాన్ని అమ్మవంటిదని ప్రచారం చేసి డిపాజిట్లు..!

వేల్ఫేర్ గ్రూప్ అంటే నమ్మకానికి అమ్మవంటిది అనే ప్రచారాన్ని పదేళ్ల కిందట ఉద్ధృతంగా చేశారు. ప్రధానంగా చిట్ ఫండ్ వ్యాపారం అని ప్రచారం చేశారు కానీ అచ్చంగా అగ్రిగోల్డ్ తరహాలోనే డిపాజిట్లు సేకరించారు. 1999లో వెల్ఫేర్‌ గ్రూపును మళ్ల విజయ్ ప్రసాద్ విశాఖ కేంద్రంగా ప్రారంభించారు. డిపాజిట్‌ చేసిన వారికి తక్కువ కాలంలోనే భారీ మొత్తం ఇస్తామని, సులభ వాయిదాల్లో డబ్బు చెల్లించి తమ సంస్థ అభివృద్ధి చేసే లేఅవుట్లలో ప్లాట్లను దక్కించుకోవచ్చని ప్రచారం చేశారు. ఐదు రాష్ట్రాల్లో 82 బ్రాంచ్‌లను వేగంగా ఏర్పాటు చేశారు. ఏజెంట్ల వ్యవస్థను నియమించుకుని దిగువ మధ్యతరగతి వద్ద చిట్స్ కట్టించుకోవడం.. డిపాజిట్లు తీసుకున్నారు. సేకరించిన మొత్తాన్ని ఇతర వ్యాపారాల్లో పెట్టుబడిగా పెట్టారు. కొన్ని సినిమాలు కూడా నిర్మించారు.
Welfare Scam :  నమ్మకాన్ని అమ్మేశారా..? వేల్ఫేర్ మరో అగ్రిగోల్డ్ తరహా మోసమా..?

Also Read : వైసీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్కాలపరిమితి తీరిన తర్వాత చెల్లించలేక చేతులెత్తేసిన వేల్ఫేర్ గ్రూప్.. !

చిట్స్ పాడుకున్న వారికి, డిపాజిట్లు చేసినవారికి చెల్లింపులు చేయడంలో వేల్ఫేర్ గ్రూప్ విఫలమయింది.  ఛత్తీస్ గఢ్‌, జార్ఖండ్‌ డిపాజిట్ చేసిన వారు ఫిర్యాదు చేయడంతో 2016లోనే సీబీఐ కేసు నమోదు చేశారు. మళ్ల విజయ్ ప్రసాద్ ఇళ్లలో సోదాలు చేశారు. డిపాజిట్లను వ్యక్తిగత ఖాతాలకు మళ్లించినట్లుగా గుర్తించారు.  ఆ తర్వాత కూడా వ్యాపారం కొనసాగించారు. 2018లో నెల్లూరులో ఖాతాదారులు ఆ సంస్థ కార్యాలయంపై దాడి చేయడం సంచలనం సృష్టించింది.  డిపాజిట్లు తిరిగి చెల్లించకపోవడంతో  నెల్లూరులోని కార్యాలయాన్ని మూసేసుకుని వెల్ఫేర్ గ్రూప్ ఉద్యోగులు పరారయ్యారు.  ఆ తరవాత ఐదు రాష్ట్రాల్లోనూ కార్యాలయాలను మూసి వేశారు. ఈ కారణంగా ఆయా రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. ఒరిస్సాలో బాధితులు ఎక్కువగా ఉండటంతో అనేక కేసులు నమోదయ్యాయి. ఇటీవల అక్కడి ప్రభుత్వం ఆర్థిక నేరాలపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో  అరెస్టులు ప్రారంభించారు.
Welfare Scam :  నమ్మకాన్ని అమ్మేశారా..? వేల్ఫేర్ మరో అగ్రిగోల్డ్ తరహా మోసమా..?

Also Read : ఆశపడిన వైసీపీ ఎమ్మెల్యేకు టోకరావేల్ఫేర్ గ్రూప్ ఆస్తులన్నీ ఎక్కడ ఉన్నాయి..?

అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మి డిపాజిటర్లకు చెల్లిస్తున్నారు. అయితే వేల్ఫేర్ గ్రూప్ ఆస్తులు ఎక్కడ ఉన్నాయో.. ఎవరికీ తెలియని పరిస్థితి ఉంది. అనేక చోట్ల వేల్ఫేర్ గ్రూప్‌ రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసింది. నోట్ల రద్దు తర్వాత కూడా ఆ కంపెనీలోకి పెద్ద ఎత్తున డిపాజిట్లు వచ్చినట్లుగా సీబీఐ అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. కడప జిల్లా పులివెందులలోనూ వేల్ఫేర్ గ్రూప్ భారీ రియల్ ఎస్టేట్ వెంచర్ వేసింది. అయితే ఆస్తులన్నీ ఎక్కడికి వెళ్లాయో స్పష్టత లేదు.
Welfare Scam :  నమ్మకాన్ని అమ్మేశారా..? వేల్ఫేర్ మరో అగ్రిగోల్డ్ తరహా మోసమా..?

భార్యను పంపించంటూ భర్తకు 80 ఏళ్ల వృద్ధుడి ఆఫర్.. ఆ తర్వాత..వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కావడంతో రాజకీయ దుమారం..!

మళ్ల విజయ్ ప్రసాద్ మొదట్లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన వైఎస్ కుటుంబానికి ఆప్తుడు. ఆతర్వాత ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం ఆయనకు రాష్ట్ర విద్య, మౌలిక వసతుల కల్పన అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి ఉంది. విశాఖ రాజకీయాల్లో చురుగ్గా ఉంటారు. దీంతో సహజంగానే ఈ అంశంపై రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు ప్రారంభమయ్యాయి. అగ్రిగోల్డ్ తరహాలోనే ప్రజల్ని మోసం చేసినందున ఆస్తులు అమ్మి అందరికీ చెల్లించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఆ సంస్థ బాధితులు ఎక్కువగానే ఉన్నారు. అయితే ఆయన అధికార పార్టీ నేత కావడంతో బయటకు వచ్చేందుకు భయపడుతున్నారన్న అభిప్రాయం ఉంది. 

Also Read : లోదుస్తులు మాత్రమే దొంగిలించే గజదొంగ

Tags: YSRCP Agri Gold MALLA VIJAY PRASAD VIZAG YSRCP VIJAY PRASAD WELFARE GROUP

సంబంధిత కథనాలు

Weather Updates: రెయిన్ అలర్ట్.. ఏపీలో మరో నాలుగు రోజులు ఓ మోస్తరు వర్షాలు.. తెలంగాణలో చిరు జల్లులకు ఛాన్స్

Weather Updates: రెయిన్ అలర్ట్.. ఏపీలో మరో నాలుగు రోజులు ఓ మోస్తరు వర్షాలు.. తెలంగాణలో చిరు జల్లులకు ఛాన్స్

Weather Updates: అల్పపీడనంగా మారిన వాయుగుండం.. ఏపీలో మరో రెండు రోజులు ఓ మోస్తరు వర్షాలు

Weather Updates: అల్పపీడనంగా మారిన వాయుగుండం.. ఏపీలో మరో రెండు రోజులు ఓ మోస్తరు వర్షాలు

Botsa Satyanarayana: ఓటీఎస్ బలవంతంగా రుద్దే కార్యక్రమం కాదు... మైక్ కనిపిస్తే చాలు చంద్రబాబు రెచ్చిపోతారు.... మంత్రి బొత్స ఫైర్

Botsa Satyanarayana: ఓటీఎస్ బలవంతంగా రుద్దే కార్యక్రమం కాదు... మైక్ కనిపిస్తే చాలు చంద్రబాబు రెచ్చిపోతారు.... మంత్రి బొత్స ఫైర్

Visakhapatnam: చిన్నారావును చితక్కొట్టారు... బాలికలతో అసభ్యప్రవర్తన రౌడీషీటర్ కు మహిళలు బడితపూజ

Visakhapatnam: చిన్నారావును చితక్కొట్టారు... బాలికలతో అసభ్యప్రవర్తన రౌడీషీటర్ కు మహిళలు బడితపూజ

CROP LOSS: వర్షాలు మిగిల్చిన కష్టం.. ఏపీకి 3వేల కోట్ల రూపాయలకు పైగా పంట నష్టం.. 

CROP LOSS: వర్షాలు మిగిల్చిన కష్టం.. ఏపీకి 3వేల కోట్ల రూపాయలకు పైగా పంట నష్టం.. 
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Gold-Silver Price: రూ.190 పెరిగిన బంగారం ధర.. రూ.600 ఎగబాకిన వెండి.. మీ ప్రాంతంలో ఇవాల్టి ధరలు ఇవీ..

Gold-Silver Price: రూ.190 పెరిగిన బంగారం ధర.. రూ.600 ఎగబాకిన వెండి.. మీ ప్రాంతంలో ఇవాల్టి ధరలు ఇవీ..

RRR Movie Length: ఆర్ఆర్ఆర్.. అంతసేపా.. ఇద్దరు హీరోలంటే ఆ మాత్రం ఉంటది!

RRR Movie Length: ఆర్ఆర్ఆర్.. అంతసేపా.. ఇద్దరు హీరోలంటే ఆ మాత్రం ఉంటది!

CDS Bipin Rawat Chopper Crash: బిపిన్ రావత్.. ఆర్మీ లెజెండ్.. వెన్నుచూపని యోధుడు!

CDS Bipin Rawat Chopper Crash: బిపిన్ రావత్.. ఆర్మీ లెజెండ్.. వెన్నుచూపని యోధుడు!

Multibagger stock: కనక వర్షం ! ఏడాదిలో లక్షను కోటి చేసిన మల్టీబ్యాగర్‌ స్టాక్‌ ఇది.!

Multibagger stock: కనక వర్షం ! ఏడాదిలో లక్షను కోటి చేసిన మల్టీబ్యాగర్‌ స్టాక్‌ ఇది.!