IND in IRE, 2 T20Is, 2022 | 2nd T20I | Malahide Cricket Club Ground, Dublin - 28 Jun, 09:00 pm IST
(Match Yet To Begin)
IRE
IRE
VS
IND
IND

Visakhapatnam Land Scam: ఎమ్మెల్యే కుమారుడినే బురిడీ కొట్టించేందుకు యత్నం... కోట్ల విలువైన భూమి అమ్మేందుకు కుట్ర... పత్రికా ప్రకటన బట్టబయలు

రూ.కోట్లు విలువ చేసే భూమిని నకిలీ డాక్యుమెంట్లతో ఎమ్మెల్యే కుమారుడికి అమ్మేందుకు ప్రయత్నించారు కేటుగాళ్లు. చివరికి పత్రికా ప్రకటనతో గుట్టురట్టైంది.

FOLLOW US: 

కోట్లు విలువ చేసే భూమిని అడ్డదారిలో కొట్టేద్దామనుకున్న కేటుగాళ్ల వ్యూహాన్ని పత్రికా ప్రకటన బట్టబయలు చేసింది. విశాఖ నగరంలో కోట్లు విలువ చేసే భూమిని అడ్డదారిలో అమ్మడానికి కుట్రపన్నారు. రిజిస్ట్రేషన్‌ వరకూ వెళ్లిన వ్యవహారం పత్రికా ప్రకటనతో నిలిచిపోయింది. ఈ ఘటనపై ప్రభుత్వ అధికారులను విచారణకు ఆదేశించింది. ఈ కేసు దర్యాప్తు విషయాలను సోమవారం విశాఖ సీపీ కార్యాలయంలో సీపీ మనీష్‌కుమార్‌ సిన్హా వెల్లడించారు.

తప్పుడు పత్రాలతో 

అమెరికాలో ఉంటున్న తుమ్మల కృష్ణచౌదరికి విశాఖ కొమ్మాదిలో 12.26 ఎకరాల భూమి ఉంది. ఈ భూమికి సంబంధించి తప్పుడు పత్రాలు సృష్టించి అమ్మేందుకు విశాఖకు చెందిన జరజాపు శ్రీనివాసరావు, తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు చెందిన వి.జయసూర్యలను ప్రయత్నించారు. వీరద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. కృష్ణచౌదరి భార్య లక్ష్మీసూర్య ప్రసన్న ఇచ్చిన ఫిర్యాదుతో ఈ నెల ఒకటో తేదీన కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో వ్యక్తి ఆనందరాజ్‌ అమెరికాలోని న్యూయార్క్‌లో ఉంటున్నారు. ఇంటర్‌పోల్‌ సాయంతో అతన్ని అరెస్టు చేస్తామని సీపీ మనీష్ కుమార్ సిన్హా తెలిపారు. కృష్ణచౌదరిలా కొనుగోలుదారులతో మాట్లాడి మోసం చేసేందుకు ప్రయత్నించినందుకు అతనిపై వారెంట్‌ జారీ చేశామన్నారు. 

ఎమ్మెల్యే కుమారుడికి అమ్మేందుకు

శ్రీనివాసరావుకు తుమ్మల కృష్ణచౌదరితో పదేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. కొమ్మాదిలో ఉన్న 12.26 ఎకరాల భూమి అత్యంత విలువైనది కావడంతో ఎలాగైనా విక్రయించి డబ్బు సంపాదించాలనుకున్నాడు శ్రీనివాసరావు. ఈ విషయాన్ని జయసూర్యకు చెప్పి విశాఖ జిల్లా ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబురాజు కుమారుడు, కశ్యప్‌ డెవలపర్స్‌కు చెందిన సుకుమార్‌వర్మకు ఈ భూమిని అమ్మేందుకు ప్లాన్ చేశాడు. న్యూయార్క్‌లో ఉన్న ఆనందరాజ్‌తో కృష్ణచౌదరిలా మాట్లాడించారు. అనంతరం అడ్వాన్స్‌గా రూ. కోటి తీసుకున్నారు. రిజిస్ట్రేషన్‌కు మాత్రం జాప్యం చేశారు. రిజిస్ట్రేషన్‌ చేయాలని సుకుమార్‌వర్మ డిమాండ్‌ చేయగా సంతకాలు, ఇతర పత్రాలు ఫోర్జరీ చేసి తమ పేరున తప్పుడు జీపీఏ సృష్టించారు. రిజిస్ట్రేషన్‌ చేయించే ముందు పత్రికా ప్రకటన ఇస్తే మంచిదని భావించిన ఎమ్మెల్యే కుటుంబం పత్రికలో ప్రకటన ఇచ్చారు. 

Also Read: Public Servent Cases : రాజకీయ నేతల అవినీతికి రక్షణ ? "పబ్లిక్ సర్వెంట్‌" కేసులపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు అందుకేనా..?

నకిలీ జీపీఏతో

ఈ ప్రకటన కృష్ణచౌదరి భార్య లక్ష్మీ సూర్యప్రసన్న దృష్టికి వచ్చింది. దీనిపై వెంటనే స్పందించిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. నకిలీ జీపీఏ ద్వారా డాక్యుమెంటు సృష్టించి రిజిస్ట్రేషన్‌ను చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. ఆ భూమిని రూ.18.75 కోట్లకు ఎమ్మెల్యే కుటుంబీకులకు అమ్మేందుకు ఒప్పందం కుదిరిందని పోలీసులు తెలిపారు. అడ్వాన్స్ గా రూ.5 కోట్లు వరకు ఇచ్చారు. ఫోర్జరీ పత్రాలతో ప్రజల ఆస్తులను రిజిస్ట్రేషన్‌ చేసుకుంటున్న ఘటనలు తెలిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సీపీ కోరారు. ఏ కొంచెం అనుమానం వచ్చినా వెంటనే పోలీసులను సంప్రదించాలన్నారు. 

Also Read: Viral Video: ఇసుక అక్రమ రవాణా వ్యవహారం... మంత్రి ఫోన్ సంభాషణ వైరల్!

Published at : 07 Sep 2021 12:34 PM (IST) Tags: visakhaptanam news visakha land scam mla son ycp mla yalamanchili ap news.

సంబంధిత కథనాలు

Nizamabad Road Accident : నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, లారీని ఢీకొట్టిన కారు, ఇద్దరు సజీవదహనం

Nizamabad Road Accident : నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, లారీని ఢీకొట్టిన కారు, ఇద్దరు సజీవదహనం

Witchcraft Woman Death: సొంత సోదరిని బలిచ్చిన యువతి! నాలుక కోసి, పేగులు గర్భాశయం బయటికి తీసి ఘోరం!

Witchcraft Woman Death: సొంత సోదరిని బలిచ్చిన యువతి! నాలుక కోసి, పేగులు గర్భాశయం బయటికి తీసి ఘోరం!

Vikarabad Family Missing: వికారాబాద్ జిల్లాలో ఫ్యామిలీ మిస్సింగ్ కలకలం - భార్య ఆచూకీ దొరకడం లేదని భర్త, కుమార్తెలు అజ్ఞాతంలోకి

Vikarabad Family Missing: వికారాబాద్ జిల్లాలో ఫ్యామిలీ మిస్సింగ్ కలకలం - భార్య ఆచూకీ దొరకడం లేదని భర్త,  కుమార్తెలు అజ్ఞాతంలోకి

Hyderabad Crime : ప్రేమ పేరుతో ట్రాన్స్ జెండర్ ను మోసం చేసిన యువకుడు, రెండేళ్లు సహజీవనం చేసి పరార్!

Hyderabad Crime :  ప్రేమ పేరుతో ట్రాన్స్ జెండర్ ను మోసం చేసిన యువకుడు, రెండేళ్లు సహజీవనం చేసి పరార్!

Visakha Cyber Crime : పెళ్లి చేసుకుంటాడని నమ్మి ఆ ఫొటోలు పంపిన యువతి, చివరకు?

Visakha Cyber Crime : పెళ్లి చేసుకుంటాడని నమ్మి ఆ ఫొటోలు పంపిన యువతి, చివరకు?

టాప్ స్టోరీస్

CM Jagan: సెప్టెంబరులోపు పిల్లలకి ఫ్రీగా ట్యాబ్‌లు, అమ్మఒడి అందుకే కొందరికి రాలేదు: సీఎం జగన్

CM Jagan: సెప్టెంబరులోపు పిల్లలకి ఫ్రీగా ట్యాబ్‌లు, అమ్మఒడి అందుకే కొందరికి రాలేదు: సీఎం జగన్

ED summons Sanjay Raut: రాజకీయ సమస్యల్లో ఉన్న శివ్‌సేనకు మరో ఝలక్‌- విచారణకు రావాలంటూ ఎంపీ సంజయ్‌రౌత్‌కు ఈడీ నోటీసులు

ED summons Sanjay Raut:  రాజకీయ సమస్యల్లో ఉన్న శివ్‌సేనకు మరో ఝలక్‌- విచారణకు రావాలంటూ ఎంపీ సంజయ్‌రౌత్‌కు ఈడీ నోటీసులు

Killi Kruparani: కిల్లి కృపారాణికి ఘోర పరాభవం! కాసేపట్లో సీఎం జగన్ పర్యటన, ఇంతలో అలిగి వెళ్లిపోయిన నేత

Killi Kruparani: కిల్లి కృపారాణికి ఘోర పరాభవం! కాసేపట్లో సీఎం జగన్ పర్యటన, ఇంతలో అలిగి వెళ్లిపోయిన నేత

Ranga Ranga Vaibhavanga Teaser: చిరంజీవి, పవన్ కళ్యాణ్... ఇద్దర్నీ ఒక్క టీజ‌ర్‌లో చూపించిన వైష్ణవ్ తేజ్ 

Ranga Ranga Vaibhavanga Teaser: చిరంజీవి, పవన్ కళ్యాణ్... ఇద్దర్నీ ఒక్క టీజ‌ర్‌లో చూపించిన వైష్ణవ్ తేజ్