Crime News: ఇదిగో 10 వేలు తీసుకుని నీ భార్యను పంపించంటూ భర్తకు 80 ఏళ్ల వృద్ధుడి ఆఫర్.. ఆ తర్వాత..
ఓ 80 ఏళ్ల వృద్ధుడు.. ఓ వ్యక్తి భార్యపై ఆశపడ్డాడు. నేరుగా భర్తకే.. రూ.10 వేలు ఆఫర్ చేశాడు. ఈ క్రమంలోనే ఘోరం జరిగిపోయింది.
శమకాంత్ తుకారామ్ నాయక్ గా అనే 80 ఏళ్ల వృద్ధుడు ఆస్తిపరుడు. మహారాష్ట్రలోని ఉల్వేలో అనేక ఆస్తులు, అవుట్‌లెట్‌లు, ఫ్లాట్‌లు ఉన్నాయి. ఇతడు తరుచూ.. ముంబయిలో ఉన్న ఓ 33 ఏళ్ల వ్యక్తి దుకాణం దగ్గరకు వెళ్లేవాడు. రోజు మాట కలిపి మాట్లాడుతుండేవాడు. ఒకరోజు సమయం చూసి.. దుకాణా దారుడి.. భార్యని పంపించాలని 5000 వేలు ఇచ్చాడు. ఈ క్రమంలోనే వారి మధ్య.. మాట మాట పెరిగింది. మళ్లీ ఆగస్టు 29న రూ.10 వేలు ఇచ్చి.. తన గోడౌన్ కి పంపాలని.. తుకారామ్ నాయక్ ఆఫర్ చేశాడు. దీంతో కోపంతో రగిలిపోయాడు దుకాణాదారుడు.
Also Read: Israel Jail Break: బ్రహ్మానందం ఐడియాతో జైలు నుంచి ఉగ్రవాదులు ఎస్కేప్!
వృద్ధుడి డిమాండ్‌తో ఆగ్రహించి.. నాయక్‌ను కిందకు నెట్టి అతని తలపై కొట్టాడు. వెంటనే తన దుకాణాన్ని మూసేశాడు. నాయక్ గొంతుకోసి.. బాత్ రూమ్ లో మృతదేహాన్ని దాచాడు. ఆగష్టు 31 వరకు మృతదేహాన్ని టాయిలెట్‌లోనే ఉంచాడు. ఉదయం 5 గంటలకు బెడ్‌షీట్‌లో చుట్టి తన బైక్‌పై తీసుకెళ్లి చెరువులో పడేశాడు. నాయక్ బట్టులు, సెల్ ఫోన్ ను చెత్త డబ్బాలో విసిరేశాడు. అయితే ఇవన్నీ సీసీటీవీలో రికార్డయ్యాయి.
Also Read: Skeleton Found In Hospital: 24 ఏళ్లుగా తెరవని లిఫ్ట్.. తెరిచాక చూస్తే అందులో అస్థిపంజరం.. ఇంతకీ ఏం జరిగింది?
ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. బాత్ రూమ్ లోనే మృతదేహాన్ని పెట్టి.. నాయక్ కుమారుడితో కలిసి.. ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు దుకాణాదారుడు. ఆగస్టు 29 మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లిపోయాడని.. ఇంటికి తిరిగి రాలేదని నాయక్ కుటుంబం పోలీసులకు తెలిపింది. అతని మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి ఉందని వెల్లడించింది. అయితే ఆస్తి కోసం నాయక్ హత్యకు గురయ్యాడని పోలీసులు మొదట అనుమానించారు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా.. దుకాణాదారుడు చేసిన పని బయటపడింది. ఈ మేరకు పోలీసులు వివరాలు వెల్లడించారు.
Also Read: మీరు ఇన్ స్టాలో ఉన్నారా? అయితే న్యూడ్ కాల్స్ రావొచ్చు.. తర్వాత పోర్న్ వీడియోల్లో మీ ఫేస్ ఉండొచ్చు