Israel Jail Break: బ్రహ్మానందం ఐడియాతో జైలు నుంచి ఉగ్రవాదులు ఎస్కేప్!
ఓ జైలు నుంచి ఉగ్రవాదులు తప్పించుకున్న తీరు చూసి అధికారులే షాక్ అయ్యారు. సినీ ఫక్కీలో ఆ ఉగ్రవాదులు వేసిన ప్లాన్ బంపర్ హిట్ అయింది. ఈ కథేంటో మీరూ చూసేయండి.
జులాయి.. సినిమాలో బ్రహ్మానందం జైలు నుంచి ఎస్కేప్ అయ్యే సీన్ గుర్తుందా? అదేనండి జైల్లో కుండపై ఉన్న ప్లేటును వంచి గోడపైన పరాపరా గీకి తప్పించుకుందాం అనుకుంటాడు కదా ఆ సీన్. అయితే పోలీసులు అది చూసి "రేయ్.. ఆ గోడని గీకిగీకి కన్నం పెట్టి పారిపోదామనుకున్నావా? రేపు నిన్ను సబ్ జైలుకు మార్చేస్తాం. అక్కడ ప్లేట్లు పెద్దవి.. గోడలు గట్టివి ఉంటాయి. గీక్కో" అంటారు.
ఇంతకీ ఇదంతా ఎందుకు చెబుతున్నాం.. అనుకుంటున్నారా? ఇందుకు ఓ కారణముంది. ఓ జైలులో ఖైదీలు బ్రహ్మానందాన్ని స్ఫూర్తిగా తీసుకొని.. ఏకంగా జైలుకి కన్నం పెట్టి నైస్ గా పరారయ్యారు. షాకయ్యారా? ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది. వాళ్లు జైలుకి కన్నం పెట్టింది ఓ స్పూన్ తో. అసలు ఈ 'స్పూన్ ఎస్కేప్' కథేంటో చూడండి.
Also Read: చీకటి గదిలో 25 ఏళ్లు బందీ.. కూతురికి నరకం చూపిన తల్లి, శరీరం కుళ్లుతున్నా..
ఏం తవ్వావురా..
ఇజ్రాయెల్ లో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉండే ఓ జైలు నుంచి మొత్తం ఆరుగులు పాలస్తీనా ఉగ్రవాదులు తప్పించుకున్నారు. అయితే వాళ్లు తప్పించుకున్న విధానం చూసి అధికారులు షాక్ అయ్యారు. జైలు గదిలో ఉన్న ఓ తుప్పు పట్టిన స్పూన్ తో సింక్ కింద పెద్ద సొరంగమే తవ్వేశారు. ఇలా జైలు బయటికే సొరంగం తవ్వి పారిపోయారు.
Also Read: Coffee lovers: కాఫీ తాగుతున్నారా? అయితే ఈ మూడు తప్పులు చేయకండి
అయితే ఈ సొరంగం తవ్వడానికి చాలా నెలల సమయమే పట్టి ఉంటుందని అధికారులు అనుకుంటున్నారు. అయితే ఇంత జరుగుతున్నా జైలు అధికారులకు తెలియలేదు అంటేనే విడ్డూరంగా ఉంది. జైలు బయట నుంచి ఉగ్రవాదులు పారిపోవడాన్ని అక్కడి రైతులు చూసి అధికారులకు చెప్పడంతో ఈ విషయం బయటకి వచ్చింది.
గాజాలో సంబరాలు..
ప్రస్తుతం ఈ ఆరుగురు ఉగ్రవాదులను పట్టుకోవడానికి పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఇందులో ఒకరు ఓ ఉగ్రవాద సంస్థకు మాజీ అధినేత కూడా. మిగిలిన వారు గాజాకు చెందిన ఇస్లామిక్ జిహాద్ మిలిటెంట్ సంస్థకు చెందినవారు. అయితే వారు తప్పించుకోవడంపై గాజాలో వారి కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేశారు. స్వీట్లు పంచిపెట్టి సంబరాలు చేసుకున్నారు.
Also Read: Telugu Nonveg Recipes: రొయ్యల నిల్వ పచ్చడి ఇలా చేసి చూడండి... అదిరిపోతుంది