అన్వేషించండి

Telugu Nonveg Recipes: రొయ్యల నిల్వ పచ్చడి ఇలా చేసి చూడండి... అదిరిపోతుంది

రొయ్యలు కూర ఎప్పుడంటే అప్పుడు వెంటనే వండుకుని తినడం కష్టమే. అదే ఇలా రొయ్యల నిల్వ పచ్చడి చేసుకుంటే తినాలనిపించినప్పుడల్లా ఓ పట్టు పట్టొచ్చు.

వేడి వేడి అన్నంలో ఆవకాయ వేసుకుని తింటే ఎంత రుచిగా ఉంటుందో అందరికీ తెలుసు. అదే వేడి వేడి అన్నంలో రొయ్యల పచ్చడి వేసుకుని తిని చూడండి... ప్లేటు ఖాళీ చేయడం ఖాయం. తయారుచేయడం కూడా పెద్ద కష్టమేం కాదు. నిజం చెప్పాలంటే రొయ్యల కూర కన్నా రొయ్యల పచ్చడం చేయడమే సులభం. 

కావాల్సిన పదార్థాలు: 

పచ్చి రొయ్యలు - కిలో
అల్లం వెల్లుల్లి పేస్టు - పది టేబుల్ స్పూన్లు (కావాలనుకుంటే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు)
కారం - 200 గ్రాములు
పసుపు - ఒక టేబుల్ స్పూను
గరం మసాలా - ఒక టేబుల్ స్పూను
కరివేపాకు - గుప్పెడు ఆకులు
మెంతులు పొడి - ఒక టేబుల్ స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - పావు లీటరు
వెల్లుల్లి రెబ్బలు - పది (పొట్టు తీసినవి) 
నిమ్మకాయలు - రెండు


తయారీ విధానం 

1. ముందుగా పచ్చి రొయ్యలను బాగా కడిగి, శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. గిన్నెలో నీరు లేకుండా చూసుకోవాలి.  
2. స్టవ్ పై కళాయి పెట్టి  నూనె వేయాలి. నూనె వేడెక్కాక శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యలను వేసి వేయించాలి. రొయ్యలోంచి నీరు ఊరుతుంది. ఆ నీరంతా ఇంకిపోయేదాకా వేయించాలి. ఇప్పుడు పసుపు వేసి కలపాలి. 
3. రొయ్యలు బాగా వేగాక వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి.  కళాయిలో మిగిలిన నూనెలో అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, గరం మసాలా, మెంతి పొడి, ఉప్పు వేసి వేయించాలి. 
4. ఆ మిశ్రమం వేగాక ముందుగా వేయించిపెట్టుకున్న రొయ్యలను కూడా వేసి కలపాలి. 
5. మరొక చిన్న కళాయిలో కాస్త నూనె వేసి అందులో వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేయించి, రొయ్యల మిశ్రమంలో కలపాలి. 
6. చల్లారాక  రెండు నిమ్మకాయల రసాన్ని పిండి బాగా కలపాలి. అంతే టేస్టీ రొయ్యల పచ్చడి సిద్ధమైనట్టే. 

దీన్ని తడిలేని సీసాలో వేసి ఫ్రిజ్ లో పెట్టుకోవాలి. కొన్ని నెలల పాటూ ఇది చెక్కు చెదరకుండా ఉంటుంది. నిమ్మరసం త్వరగా పచ్చడిని పాడవ్వనివ్వదు.  మీకు మరింత స్పైసీగా కావాలనుకుంటే వండేటప్పుడు మరికొంచెం కారం, గరం మసాలా వేసుకోవచ్చు. 

పోషకాలు...
సముద్రఆహార ఉత్పతుల్లో బలవర్ధక మైనవి రొయ్యలే. వీటిలో ఉండే సెలీనియం క్యాన్సర్ నిరోధకతను కలిగి ఉంటుంది. వీటిలో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తనాళాల్లో పేరుకుపోయిన చెడు కొవ్వును తొలగిస్తాయి. గుండెకు మేలు చేస్తాయి. వీటిలో విటమిన్ ఇ ఉంటుంది. ఇది చర్మ సౌందర్యానికి సహకరిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ బి12 జ్ఞాపకశక్తి పెంచుతుంది, మతిమరుపు వ్యాధి దరిచేరకుండా చూస్తుంది. 

Also read:ముఖంపై ముడతలు పోవాలా... పసుపుతో ప్రయత్నించండి
Also read:నిజమేనా.... మిలిటరీ డైట్ తో వారంలో బరువు తగ్గొచ్చా?
Also read:కాఫీ తాగుతున్నారా? అయితే ఈ మూడు తప్పులు చేయకండి

టాప్ హెడ్ లైన్స్

Skin Whitening Cream: రాత్రికి రాత్రే చర్మాన్ని తెల్లబరిచే క్రీములతో ప్రమాదం! ఆందోళన కలిగిస్తున్న పాదరసం, సీసం వాడకం!
రాత్రికి రాత్రే చర్మాన్ని తెల్లబరిచే క్రీములతో ప్రమాదం! ఆందోళన కలిగిస్తున్న పాదరసం, సీసం వాడకం!
Roof Leakage Signs:రూఫ్‌ లీక్ అవ్వడానికి ముందు మీ ఇంట్లో కనిపించే మార్పులు ఇవే! నష్టం జరగక ముందే జాగ్రత్తపడండి!
రూఫ్‌ లీక్ అవ్వడానికి ముందు మీ ఇంట్లో కనిపించే మార్పులు ఇవే! నష్టం జరగక ముందే జాగ్రత్తపడండి!
Healthy Millet Khichdi: మిల్లెట్స్‌తో ఆరోగ్యకరమైన, రుచికరమైన కిచిడీ చేస్తే పిల్లలు లొట్టలేసుకొని తింటారు! 
మిల్లెట్స్‌తో ఆరోగ్యకరమైన, రుచికరమైన కిచిడీ చేస్తే పిల్లలు లొట్టలేసుకొని తింటారు! 
Best Roti For Health: మొక్కజొన్న-జొన్న-మిల్లెట్ లేదా గోధుమ ఏ రోటీ వేగంగా జీర్ణమవుతుంది? ఏది ఎక్కువ శక్తినిస్తుంది?
మొక్కజొన్న-జొన్న-మిల్లెట్ లేదా గోధుమ ఏ రోటీ వేగంగా జీర్ణమవుతుంది? ఏది ఎక్కువ శక్తినిస్తుంది?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mudragada Padmanabham Funeral:ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో వివాదం! కుమార్తె రాకను అడ్డుకున్న కుటుంబం! కిర్లంపూడిలో ఉద్రిక్తత!
ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో వివాదం! కుమార్తె రాకను అడ్డుకున్న కుటుంబం! కిర్లంపూడిలో ఉద్రిక్తత!
HYDRAA Demolitions: హైడ్రా టార్గెట్ చేస్తున్న ప్రాజెక్టులన్నీ కేటీఆర్ సన్నిహితులవేనా ? - తెలంగాణ రాజకీయాల్లో తెర వెనుక ఏం జరుగుతోంది?
హైడ్రా టార్గెట్ చేస్తున్న ప్రాజెక్టులన్నీ కేటీఆర్ సన్నిహితులవేనా ? - తెలంగాణ రాజకీయాల్లో తెర వెనుక ఏం జరుగుతోంది?
Kaleshwaram Project: కాళేశ్వరం నీళ్లు వదలకుంటే హైదరాబాద్‌లో బిందెల యుద్ధమే :ABP Desamతో మాజీ ఇరిగేషన్ ఇంజనీర్ టి. వెంటేశం
కాళేశ్వరం నీళ్లు వదలకుంటే హైదరాబాద్‌లో బిందెల యుద్ధమే :ABP Desamతో మాజీ ఇరిగేషన్ ఇంజనీర్ టి. వెంటేశం
US Iran War: తీవ్ర స్థాయికి అమెరికా, ఇరాన్‌ మధ్య యుద్ధం! 20 యుద్ధనౌకలు, వందలాది ఫైటర్ జెట్‌లతో హోర్ముజ్‌తో రౌండప్‌!
తీవ్ర స్థాయికి అమెరికా, ఇరాన్‌ మధ్య యుద్ధం! 20 యుద్ధనౌకలు, వందలాది ఫైటర్ జెట్‌లతో హోర్ముజ్‌తో రౌండప్‌!
TTD Latest News: తిరుమల ట్రస్టులు, పథకాల దాత‌ల ప్రివిలేజెస్‌లో భారీ మార్పులు! ఒంటిమిట్ట అభివృద్ధికి నిధులు! టీటీడీ కీలక నిర్ణయాలు! 
తిరుమల ట్రస్టులు, పథకాల దాత‌ల ప్రివిలేజెస్‌లో భారీ మార్పులు! ఒంటిమిట్ట అభివృద్ధికి నిధులు! టీటీడీ కీలక నిర్ణయాలు! 
Telangana Latest News: 9,000 రూపాయల ఖరీదు చేసే డ్రోన్ 91 రూపాయలకే! టీబీ రోగుల పాలిట వరంలా సేవలు! 
9,000 రూపాయల ఖరీదు చేసే డ్రోన్ 91 రూపాయలకే! టీబీ రోగుల పాలిట వరంలా సేవలు! 
Visakhapatnam Latest News:వందల సంఖ్యలో జంతువుల సంరక్షణకు ఒకడే పశువైద్యుడా? విశాఖ జూలో ఉద్యోగ ఖాళీలపై అయ్యన్న విస్మయం!
వందల సంఖ్యలో జంతువుల సంరక్షణకు ఒకడే పశువైద్యుడా? విశాఖ జూలో ఉద్యోగ ఖాళీలపై అయ్యన్న విస్మయం!
Maruti S-Presso Price in Hyderabad: హైదరాబాద్‌లో మారుతి ఎస్‌ప్రెస్సో ఆన్‌రోడ్ ధరలు! వేరియంట్స్, మైలేజీ పూర్తి వివరాలు ఇవే!
హైదరాబాద్‌లో మారుతి ఎస్‌ప్రెస్సో ఆన్‌రోడ్ ధరలు! వేరియంట్స్, మైలేజీ పూర్తి వివరాలు ఇవే!
Embed widget