అన్వేషించండి

Beauty tips: ముఖంపై ముడతలు పోవాలా... పసుపుతో ప్రయత్నించండి

కాస్మోటిక్స్ ఉత్పత్తుల కోసం వందలు, వేల రూపాయలు ఖర్చు పెట్టే కన్నా చిటికెడు పసుపుతో చక్కటి అందాన్ని, మెరుపును సొంతం చేసుకోవచ్చు.

మారుతున్న వాతావరణం, ఆధునిక జీవన శైలి ముప్పై ఏళ్లు దాటకముందే చర్మాన్నిమసకబారేలా చేస్తుంది. ముడతలు, మచ్చలు, కళ్ల కింద డార్క్ సర్కిల్స్ ఇలా ఎన్నో సమస్యలు యువతపై దాడి చేస్తున్నాయి. వీటి కోసం ఎన్నో ఉత్పత్తులు మార్కెట్లో దొరుకుతున్నాయి. వాటి ధరలు సామాన్యులకు అందనంత ఎత్తుగా ఉన్నాయి. వాటి కోసం వందలు, వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. వంటింట్లో మనకు దొరికే పసుపుతోనే చాలా చర్మ సమస్యలకు దూరంగా ఉండొచ్చు. 

పసుపులో యాంటీఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టిరియల్ గుణాలు ఎక్కువ. దీన్ని తేనె, గంధం పొడి, పెరుగు వంటి వాటితో కలిపి చర్మంపై మరింత సమర్థవంతంగా పనిచేసేలా చేయచ్చు. పెద్దగా ఖర్చు లేకుండా ఇంట్లోనే ప్యాక్ లు తయారుచేసుకుని ముఖానికి వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. 

1. చెంచాడు పసుపు, రెండు చెంచాల గంధం పొడి, కొన్ని పాలు కలిపి మిశ్రమంలా చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పూసుకుంటే అరగంట పాటూ వదిలేయాలి. తరువాత గోరు వెచ్చటివ నీళ్లతో కడిగితే మంచి ఫలితం ఉంటుంది. ఇలా తరచూ చేయడం వల్ల ముఖంపై ఉన్న నల్లమచ్చలు పోతాయి. 

2. ఆరుబయట తిరగడం వల్ల ముఖానికి ట్యాన్ పట్టడం సర్వసాధారణం. దీని కోసం రసాయనాలు కలిగిన ట్యాన్ రిమూవర్ ను వాడాల్సిన అవసరం లేదు. పసుపు సహజసిద్ధంగా ట్యాన్ రిమూవర్ లా పనిచేస్తుంది. పసుపు, గులాబీ పొడి, పెసర పిండి, రోజ్ వాటర్ కలిపి ముఖానికి బాగా మర్ధనా చేయాలి. రోజూ రాత్రిళ్లు ఇలా చేసుకుని, కడిగేసుకుని నిద్రపోవాలి. 

3. పసుపు, బొప్పాయి గుజ్జు కలిపి పేస్టులా చేసుకుని ముఖానికి, మెడకు మాస్క్ లా వేసుకోవాలి. అరగంట తరువాత కడిగేసుకుంటే చర్మం మృదువుగా మారుతుంది. తరచూ ఇలా చేస్తుంటే ముడతలు కనుమరుగవుతాయి. అంతేకాదు చర్మం కొత్త మెరుపును సంతరించుకుంటుంది. అందం ఇనుమడిస్తుంది.

4. చాలా మందికి మోచేతులు దగ్గర చర్మం డార్క్ గా మారిపోతుంది.  ఈ డార్క్ ప్యాచెస్ ను పసుపుతో పొగొట్టుకోవచ్చు. పసుపు, శెనగపిండి, నిమ్మరసం కలిపి ఆ ప్రదేశంలో మర్ధనా చేయాలి. ఇలా తరచూ చేస్తుంటే నలుపుదనం క్రమంగా తగ్గుతుంది. 

గమనిక : ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలకు వైద్యులను సంప్రదించడం ఉత్తమం. 

Also read: పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచే వెజిటబుల్ పాన్ కేక్

Also read: కాఫీ తాగుతున్నారా? అయితే ఈ మూడు తప్పులు చేయకండి

Also read: నిజమేనా.... మిలిటరీ డైట్ తో వారంలో బరువు తగ్గొచ్చా?

టాప్ హెడ్ లైన్స్

Miss World 2027 : మిస్ వరల్డ్ 2027లో పోటీ చేయాలనుకుంటున్నారా? అర్హత, ఎంపిక ప్రక్రియ, ప్రిపరేషన్ వివరాలు ఇవే
మిస్ వరల్డ్ 2027లో పోటీ చేయాలనుకుంటున్నారా? అర్హత, ఎంపిక ప్రక్రియ, ప్రిపరేషన్ వివరాలు ఇవే
High BP : అధిక రక్తపోటు ఉన్నవారు ఈ డ్రింక్స్‌ తాగితే BP కంట్రోల్‌కు హెల్ప్ అవుతుందట.. అవేంటంటే?
అధిక రక్తపోటు ఉన్నవారు ఈ డ్రింక్స్‌ తాగితే BP కంట్రోల్‌కు హెల్ప్ అవుతుందట.. అవేంటంటే?
Hibiscus Plant Care : మందార పూలు పూయడం లేదా? మొక్కను పెంచేటప్పుడు ఈ 5 తప్పులు చేయకండి
మందార పూలు పూయడం లేదా? మొక్కను పెంచేటప్పుడు ఈ 5 తప్పులు చేయకండి
Spicy Chicken Roast : సండే స్పెషల్ స్పైసీ, టేస్టీ చికెన్ రోస్ట్.. ఒక్కసారి ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది, బ్యాచిలర్స్ కూడా ఈజాగా ట్రై చేసుకోవచ్చు
సండే స్పెషల్ స్పైసీ, టేస్టీ చికెన్ రోస్ట్.. ఒక్కసారి ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది, బ్యాచిలర్స్ కూడా ఈజాగా ట్రై చేసుకోవచ్చు

వీడియోలు

Ishan Kishan Century Duleep Trophy Final | సెలెక్టర్లకు గట్టి కౌంటర్ ఇచ్చిన ఇషాన్ కిషన్
Vaibhav Suryavanshi Duleep Trophy Final Knock | దులీప్ ట్రోఫీ ఫైనల్లో వైభవ్ విధ్వంసం
PCB Takes Custody Of Team Phones | పాకిస్తాన్ ప్లేయర్స్ ఫోన్లు సీజ్
Gundenininda Gudigantalu Serial September 7 | వరలక్ష్మీ వ్రతంలో రోహిణికి ట్విస్ట్
Cybercab Autonomous Robotaxi USA Public Rides | అమెరికాలో సైబర్ క్యాబ్ రైడ్స్ హల్‌చల్.. డ్రైవర్ కాదు స్టీరింగే లేని టెస్లా కార్ల విప్లవం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana High Court: తెలంగాణ అసెంబ్లీకి వెళ్లే ఎమ్మెల్యేలను పోలీసులు ఎలా అడ్డుకుంటారు: హోంశాఖకు హైకోర్టు నోటీసులు
తెలంగాణ అసెంబ్లీకి వెళ్లే ఎమ్మెల్యేలను పోలీసులు ఎలా అడ్డుకుంటారు: హోంశాఖకు హైకోర్టు నోటీసులు
Vijayasai Reddy Political Party: కమ్మ, రెడ్లే CM అవ్వాలా? మార్పు రావాలి.. విజయదశమి తరువాత పార్టీ ప్రకటన: విజయసాయిరెడ్డి
కమ్మ, రెడ్లే CM అవ్వాలా? మార్పు రావాలి.. విజయదశమి తరువాత పార్టీ ప్రకటన: విజయసాయిరెడ్డి
Man Burnt Alive In Car: దుండిగల్‌లోని బౌరంపేటలో కారులో మంటలు.. వ్యక్తి సజీవ దహనం- కేసు నమోదు
దుండిగల్‌లోని బౌరంపేటలో కారులో మంటలు.. వ్యక్తి సజీవ దహనం- కేసు నమోదు
Miss World 2027 : మిస్ వరల్డ్ 2027లో పోటీ చేయాలనుకుంటున్నారా? అర్హత, ఎంపిక ప్రక్రియ, ప్రిపరేషన్ వివరాలు ఇవే
మిస్ వరల్డ్ 2027లో పోటీ చేయాలనుకుంటున్నారా? అర్హత, ఎంపిక ప్రక్రియ, ప్రిపరేషన్ వివరాలు ఇవే
MLA Sunitha Laxma Reddy: పోలీసులు చీర పట్టి లాగారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కంటతడి
పోలీసులు చీర పట్టి లాగారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కంటతడి
Crime Thriller OTT : కేస్ ఫైల్ ఓపెన్ చేస్తే రక్తం కళ్ల చూడాల్సిందే - ఓటీటీ ట్రెండింగ్‌లో సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
కేస్ ఫైల్ ఓపెన్ చేస్తే రక్తం కళ్ల చూడాల్సిందే - ఓటీటీ ట్రెండింగ్‌లో సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
BRS MLC Tatha Madhu Disqualification: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు సభ్యత్వాన్ని రద్దు చేయాలి: మంత్రి సీతక్క డిమాండ్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు సభ్యత్వాన్ని రద్దు చేయాలి: మంత్రి సీతక్క డిమాండ్
Ranabaali Teaser Date : విజయ్ దేవరకొండ రష్మిక మూవీ నుంచి సర్‌ప్రైజ్ - రణబాలి టీజర్ అప్డేట్ వచ్చేసింది
విజయ్ దేవరకొండ రష్మిక మూవీ నుంచి సర్‌ప్రైజ్ - రణబాలి టీజర్ అప్డేట్ వచ్చేసింది
Embed widget