Military diet: నిజమేనా.... మిలిటరీ డైట్ తో వారంలో బరువు తగ్గొచ్చా?
ప్రపంచం ముందున్న అతి పెద్ద ఆరోగ్య సమస్యల్లో ఊబకాయం కూడా ఒకటి. మిలిటరీ డైట్ తో వారం రోజుల్లో నాలుగున్నర కిలోల బరువు తగ్గొచ్చని అంటున్నారు. అది ఎంతవరకు నిజం?
ఆధునిక జీవన శైలి కారణంగా చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అన్నివయసుల వారు ఊబకాయం బారిన పడుతున్నారు. వారి బరువు తగ్గడానికి మంచి ఆహారపు అలవాట్లతో పాటూ, వ్యాయామాలు అవసరం. అలగే రకరకాల డైట్ ప్లాన్లను కూడా డైటిషియన్లు సూచిస్తున్నారు. అలాగే ఈ మధ్య నెట్టింట్లో బాగా చక్కర్లు కొట్టిన డైట్ ప్లాన్ ‘మిలిటరీ డైట్’. దీంతో మూడు రోజులకే ఫలితం కనిపిస్తుంది, వారంలోనే నాలుగున్నర కిలోల బరువు తగ్గొచ్చని అంటున్నారు. అసలు మిలిటరీ డైట్ అంటే ఏమిటి? దీని సాయంతో ఎలా బరువు తగ్గొచ్చో చూద్దాం.
అమెరికా మిలటరీలో న్యూట్రినిస్టులుగా పనిచేసిన వారు ఈ డైట్ ప్లాన్ ని రూపొందించారు. సైనికులను అతి త్వరగా బరువు తగ్గించి ఫిట్ గా చేయడానికి ఈ డైట్ ప్లాన్ ను తయారుచేశారు. అందుకే దాన్ని మిలటరీ డైట్ అంటారు. ఇందులో బరువు తగ్గాలనుకుంటున్న వ్యక్తి మూడు రోజుల పాటూ ఈ డైట్ లో భాగంగా చెప్పిన ఆహారాన్ని తింటాడు. తరువాత నాలుగురోజులు మాత్రం ఆరోగ్యకరమైన ఆహారాన్ని తక్కువ మోతాదులో తీసుకుంటాడు. ఇలా చేస్తే ఆ వ్యక్తి కచ్చితంగా నాలుగున్న కిలోలు తగ్గే అవకాశం ఉందంటున్నారు మిలటరీ డైట్ ను రూపొందించిన డైటీషియన్లు.
మిలటరీ డైట్ లో మొదటి మూడు రోజులు రోజుకు మూడు పూటలా కలిపి 1100 నుంచి 1400 కెలోరీలనిచ్చే ఆహారాన్ని తినమని రికమెండ్ చేస్తారు. ఎలాంటి స్నాక్స్ తినకూడదు. ఈ డైట్ లో కార్బో హైడ్రేట్లు, ఫైబర్, ప్రోటీన్స్, విటమిన్లు లభించే అన్ని రకాల ఆహార పదార్థాలని తినవచ్చు. కానీ పరిమితంగానే. మొదటి మూడు రోజులు శరీరానికి అందే కెలరీలను తగ్గించడం, అలాగే ఆ తరువాత నాలుగు రోజుల పాటూ ఆహారాన్ని నియంత్రించడం ద్వారా బరువు తగ్గించడమే మిలటరీ డైట్. ఈ డైట్ ఇప్పటికే మంచి ఫలితాలను సాధించినట్టు నిరూపణ అయ్యింది. మిలటరీ డైట్ ను నెల రోజుల పాటూ పాటిస్తే సులువుగానే 14 కిలోల దాకా బరువు తగ్గొచ్చు. అది కూడా ఆరోగ్యకరమైన పద్ధతిలో.
ఈ డైట్ ను డైటీషియన్ల సలహాతో పాటించడం ఉత్తమం.
Also read: కాఫీ తాగుతున్నారా? అయితే ఈ మూడు తప్పులు చేయకండి
Also read : పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచే వెజిటబుల్ పాన్ కేక్
Also read: అంతులేని వ్యథ.. అవని గాథ.. ఆ ప్రమాదం ఆమెను కదలకుండా చేసింది, కానీ..