Top Head lines: ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు - తెలంగాణ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
Top News: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ ఉన్న టాప్ హెడ్ లైన్స్ చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
Today Top Headlines In AP And Telangana:
1. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
వైసీపీ హయాంలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంతో పాటు అప్పటి ప్రతిపక్షనేత చంద్రబాబు (Chandrababu) నివాసంపై దాడి కేసులను సీఐడీ (AP CID) దర్యాప్తు చేపట్టనుంది. ఈ మేరకు ఈ కేసుల దర్యాప్తును ఏపీ ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. ఈ కేసుల దర్యాప్తును సీఐడీకి బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకూ మంగళగిరి, తాడేపల్లి పోలీసులు ఈ కేసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటివరకూ కేసుల విచారణకు సంబంధించిన ఫైళ్లను సీఐడీకి మంగళగిరి డీఎస్పీ సోమవారం నాడు అందజేయనున్నారు. ఇంకా చదవండి.
2. కోనసీమ జిల్లాలో విషాదం
ఉత్సవాలకు వినియోగిస్తున్న డీజేలు ప్రాణాలు తీస్తున్నాయి.. గతంలో డీజే సౌండ్ బాక్సుల ముందు డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి మృతిచెందిన సంఘటనలు చాలానే జరిగాయి. డీజే సౌండ్ బాక్సుల నుంచి వచ్చే పరిమితికి మించి గుండెలదిరేలా వచ్చే సౌండ్‌తో చిట్టి గుండెలు అకస్మాత్తుగా ఆగిపోతున్నాయి.. దసరా ఉత్సవంలో ఇదే తరహా సంఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కోనసీమ కేంద్రమైన అమలాపురంలో దసరా ఉత్సవం అనగానే వెంటనే గుర్తొచ్చేది చెడీతాలింఖానా. ఈ ప్రదర్శనలతో పాటు ఊరేగింపు కార్యక్రమాన్ని ఉత్సవంగా నిర్వహిస్తారు. ఇంకా చదవండి.
3. తెలంగాణ రైతులకు మంత్రి తుమ్మల గుడ్ న్యూస్
అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు రూ. 2 లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. తెలంగాణలలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన 10 నెలలు పూర్తయినా పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగలేదు. తొలుత పూర్తిగా రుణమాఫీ జరిగిందని తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సహా పలువురు మంత్రులు చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి సైతం అదే తీరుగా మాట్లాడారు. కానీ విపక్షాలు లెక్కలు బయటపెట్టడం, మరోవైపు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ చెప్పిన లెక్కలు, బడ్జెట్ సమయంలో వెల్లడించిన రుణమాఫీ వివరాలు, జులై, ఆగస్టులో జరిగిన రుణమాఫీ లెక్కలు సరిపోలడం లేదు. ఇంకా చదవండి.
4. తెలంగాణలో రెండోసారి సమగ్ర కుటుంబ సర్వే
తెలంగాణలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. తాజాగా సమగ్ర కుటుంబ సర్వే చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర శాసనసభలో సమగ్ర సర్వేపై తీర్మానం చేశారని తెలిసిందే. దాంతో ప్రజల ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్య, ఉద్యోగ, ఉపాధి, కుల సర్వే నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరపనున్న ఈ ఇంటింటి సర్వేను 60 రోజుల్లో పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి (Shanti Kumari) జీవో 18 జారీ చేశారు. ఇంకా చదవండి.
5. టాప్ కంపెనీల్లో యువతకు రెడ్ కార్పెట్
యువతలో నైపుణ్యాభివృద్ధి కోసం, ఉపాధి అవకాశాలు కల్పించడానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman) బడ్జెట్ 2024లో (Union Budget 2024) ప్రవేశపెట్టిన రూ.800 కోట్ల పీఎం ఇంటర్న్‌షిప్ పథకానికి (Prime Ministers Internship Scheme) దేశంలోని అగ్రస్థాయి సంస్థల నుంచి మంచి స్పందన లభించింది. ఇంటర్న్‌షిప్ పథకం కింద ఇప్పటివరకు 90,849 మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు. దేశంలోని టాప్-500 కంపెనీల్లో ఏడాదికి కనీసం 1.25 లక్షల మంది యువతకు ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పించడం ఈ పథకం లక్ష్యం. ఇంకా చదవండి.