అన్వేషించండి

Attack on TDP Office: టీడీపీ ఆఫీసుపై దాడి కేసు సీఐడీకి అప్పగించిన ఏపీ ప్రభుత్వం

Attack on Chandrababu House | వైసీపీ హయాంలో టీడీపీ సెంట్రల్ ఆఫీసు, చంద్రబాబు నివాసంపై జరిగిన దాడుల కేసు దర్యాప్తును సీఐడీకి అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Attack on TDP central office case | అమరావతి: వైసీపీ హయాంలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంతో పాటు అప్పటి ప్రతిపక్షనేత చంద్రబాబు (Chandrababu) నివాసంపై దాడి  కేసులను సీఐడీ (AP CID) దర్యాప్తు చేపట్టనుంది. ఈ మేరకు ఈ కేసుల దర్యాప్తును ఏపీ ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. ఈ కేసుల దర్యాప్తును సీఐడీకి బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకూ మంగళగిరి, తాడేపల్లి పోలీసులు ఈ కేసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటివరకూ కేసుల విచారణకు సంబంధించిన ఫైళ్లను సీఐడీకి మంగళగిరి డీఎస్పీ సోమవారం నాడు అందజేయనున్నారు.

వైసీపీ హయాంలో జరిగిన దాడులు, పలువురి అరెస్ట్

వైఎస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలో 2021 అక్టోబర్‌ 19న కొందరు గుర్తుతెలియని వ్యక్తులు మంగళగిరిలోని టీడీపీ సెంట్రల్ ఆఫీసుపై దాడి చేశారు. వైసీపీ నేతలు దేవినేని అవినాష్‌, ఆళ్ల రామకృష్ణారెడ్డి, లేళ్ల అప్పిరెడ్డిల  అనుచరులు టీడీపీ ఆఫీసుపై దాడి చేశారని ఆరోపణలు వచ్చాయి. దాంతోపాటు అప్పటి ప్రతిపక్షనేత చంద్రబాబు నివాసంపై సైతం దాడి జరిగింది. మాజీ మంత్రి జోగి రమేశ్‌, మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ తదితరులు, వారి అనుచరులతో వెళ్లి చంద్రబాబు ఇంటిపై దాడి చేసినట్లు అభియోగాలు ఉన్నాయి. చంద్రబాబు నివాసంపై దాడి కేసులో మాజీ ఎంసీ నందిగం సురేశ్‌ సహా మరికొందర్ని పోలీసులు అరెస్ట్‌ చేసి విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఈ రెండు కేసులు వేగంగా విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవడానికి దర్యాప్తు సీఐడీకి అప్పటిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దర్యాప్తును సీఐడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటివరకూ జరిగిన విచారణ ఫైళ్లను సోమవారం నాడు సీఐడీకి పోలీసులు అప్పగించనున్నారు.

ఇప్పటికే కూటమిలో చేరిన పలువురు నేతలు

గుంటూరు పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. వైస్సార్సీపీ పార్టీ ఆదేశాలు పాటించామని మాజీ ఎంపీ నందిగామ సురేష్ సహా పలువురు చెప్పినట్లు సమాచారం. ఈ కేసులలో వైసీపీ నేతలు జోగి రమేష్, నందిగాం సురేష్, లేళ్ళ అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, తలసీల రఘురామ్, విజయవాడ, గుంటూరుకు చెందిన వైసీపీ కార్పొరేటర్లు, వైసీపీ కార్యకర్తలు నిందితులుగా ఉన్నాయి. ఇప్పటికే పలువురు వైస్సార్సీపీ నేతలు టీడీపీ, జనసేనలో చేరారు. ఓవరాల్ గా రెండు దాడి కేసుల్లో సుమారుగా వెయ్యి మంది ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. 

Also Read: Pawan Kalyan: ఈ నెల 14 నుంచి పల్లెపండుగ వారోత్సవాలు - డిప్యూటీ సీఎం పవన్ ఎక్కడ పాల్గొంటారంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Attack on TDP Office: టీడీపీ ఆఫీసుపై దాడి కేసు సీఐడీకి అప్పగించిన ఏపీ ప్రభుత్వం
టీడీపీ ఆఫీసుపై దాడి కేసు సీఐడీకి అప్పగించిన ఏపీ ప్రభుత్వం, ఉత్తర్వులు జారీ
Baba Siddique: సల్మాన్ - షారుఖ్ గొడవకు ఫుల్ స్టాప్ పెట్టిన బాబా సిద్ధిఖీ దారుణ హత్య, బాలీవుడ్‌లో కలకలం
సల్మాన్ - షారుఖ్ గొడవకు ఫుల్ స్టాప్ పెట్టిన బాబా సిద్ధిఖీ దారుణ హత్య, బాలీవుడ్‌లో కలకలం
PM Internship Scheme: టాప్‌ కంపెనీల్లోకి యవతకు రెడ్‌ కార్పెట్‌ - పీఎం ఇంటర్న్‌షిప్‌ స్కీమ్‌లో 90 వేలకు పైగా అవకాశాలు
టాప్‌ కంపెనీల్లోకి యవతకు రెడ్‌ కార్పెట్‌ - పీఎం ఇంటర్న్‌షిప్‌ స్కీమ్‌లో 90 వేలకు పైగా అవకాశాలు
Tirumala News: తిరుమలలో బ్రహ్మోత్సవాలు ముగిశాక నిర్వహించే భాగ్ సవారీ ఉత్సవం, ప్రత్యేకతలు ఇవే
తిరుమలలో బ్రహ్మోత్సవాలు ముగిశాక నిర్వహించే భాగ్ సవారీ ఉత్సవం, ప్రత్యేకతలు ఇవే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ind vs Ban 3rd T20 Highlights | రికార్డు స్కోరుతో బంగ్లా పులుల తోక కత్తిరించిన భారత్ | Sanju Samsonవిజువల్ వండర్‌గా విశ్వంభర, టీజర్‌లో ఇవి గమనించారా?Chakrasnanam in Tirumala: తిరుమల శ్రీవారికి చక్రస్నానం, చూసి తరించండిGame Changer Movie: రామ్ చరణ్ కోసం చిరంజీవి త్యాగం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Attack on TDP Office: టీడీపీ ఆఫీసుపై దాడి కేసు సీఐడీకి అప్పగించిన ఏపీ ప్రభుత్వం
టీడీపీ ఆఫీసుపై దాడి కేసు సీఐడీకి అప్పగించిన ఏపీ ప్రభుత్వం, ఉత్తర్వులు జారీ
Baba Siddique: సల్మాన్ - షారుఖ్ గొడవకు ఫుల్ స్టాప్ పెట్టిన బాబా సిద్ధిఖీ దారుణ హత్య, బాలీవుడ్‌లో కలకలం
సల్మాన్ - షారుఖ్ గొడవకు ఫుల్ స్టాప్ పెట్టిన బాబా సిద్ధిఖీ దారుణ హత్య, బాలీవుడ్‌లో కలకలం
PM Internship Scheme: టాప్‌ కంపెనీల్లోకి యవతకు రెడ్‌ కార్పెట్‌ - పీఎం ఇంటర్న్‌షిప్‌ స్కీమ్‌లో 90 వేలకు పైగా అవకాశాలు
టాప్‌ కంపెనీల్లోకి యవతకు రెడ్‌ కార్పెట్‌ - పీఎం ఇంటర్న్‌షిప్‌ స్కీమ్‌లో 90 వేలకు పైగా అవకాశాలు
Tirumala News: తిరుమలలో బ్రహ్మోత్సవాలు ముగిశాక నిర్వహించే భాగ్ సవారీ ఉత్సవం, ప్రత్యేకతలు ఇవే
తిరుమలలో బ్రహ్మోత్సవాలు ముగిశాక నిర్వహించే భాగ్ సవారీ ఉత్సవం, ప్రత్యేకతలు ఇవే
Telangana Caste Census: తెలంగాణలో రెండోసారి సమగ్ర కుటుంబ సర్వే, రేవంత్ రెడ్డి మార్క్ నిర్ణయాలు ఉంటాయా?
తెలంగాణలో రెండోసారి సమగ్ర కుటుంబ సర్వే, రేవంత్ రెడ్డి మార్క్ నిర్ణయాలు ఉంటాయా?
Chiranjeevi: చిరంజీవి షూస్ చూడటానికి సింపులే... కానీ, కొనాలంటే ఎంత రేటో తెలుసా?
చిరంజీవి షూస్ చూడటానికి సింపులే... కానీ, కొనాలంటే ఎంత రేటో తెలుసా?
Hyderabad Crime News: బర్త్ డే పార్టీలో గొడవ- ఇంటికి వెళ్లి మరీ దాడిచేసి స్నేహితుడి దారుణహత్య
బర్త్ డే పార్టీలో గొడవ- ఇంటికి వెళ్లి మరీ దాడిచేసి స్నేహితుడి దారుణహత్య
Baba Siddique Shot Dead: మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిక్‌ దారుణహత్య- ఇద్దరు నిందితుల అరెస్ట్, పిస్టల్ స్వాధీనం
మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిక్‌ దారుణహత్య- ఇద్దరు నిందితుల అరెస్ట్, పిస్టల్ స్వాధీనం
Embed widget