అన్వేషించండి

Medical Colleges Issue: మెడికల్ కాలేజీలపై జగన్‌కు టీడీపీ 18 ప్రశ్నలు- ఒక్కదానికైనా సమాధానం చెప్పాలని సవాల్

TDP: మెడికల్ కాలేజీల అంశంపై జగన్ కు టీడీపీ పద్దెనిమిది ప్రశ్నలు వేసింది. ఒక్క దానికైనా సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది.

TDP asks 18 questions to Jagan on medical colleges: మెడికల్ కాలేజీల అంశంపై ఏపీ రాజకీయాల్లో వాదోపవాదాలు జరుగుతున్నాయి. జగన్ అనకాపల్లి మెడికల్ కాలేజీని పరిశీలించేందుకు వెళ్తున్న సమయంలో టీడీపీ ఆయనకు పద్దెనిమిది ప్రశ్నలు సంధించింది.  50శాతం మెడికల్‌ సీట్లు ప్రైవేటుకు కేటాయించింది జగన్‌ ప్రభుత్వమేనని కాదని చెప్పాలని సవాల్ చేశారు.  పీపీపీ విధానంలో ప్రభుత్వ కోటాలో 110 సీట్లు అదనంగా పెరుగుతాయనేది వాస్తవమని.. తాము అడిగే ప్రశ్నలకు  జగన్‌ సమాధానం చెప్పాలని ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ డి్మాండ్ చేశారు. 

జగన్ ను టీడీపీ అడిగిన ప్రశ్నలు

1. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో ప్రైవేట్‌ కోటాకు 50శాతం సీట్లు కేటాయిస్తూ జీ.ఓ.నెం: 107, 108,133 లను విడుదల చేసింది జగన్‌ ప్రభుత్వం కాదా?
2. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వ నిధులు రూపాయి కూడా జగన్‌ ప్రభుత్వం ఎందుకు ఖర్చుపెట్టలేదు?
3. ఖర్చుచేసిన రూ.1550కోట్లు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వ నిధులు మాత్రమే కాదా?
4. నాలుగేళ్ల జగన్‌ పాలనలో నిర్మాణాలు పూర్తి అయింది కేవలం 18 శాతం మాత్రమే కాదా? ఈ తీరులో కూటమి ప్రభుత్వం పనిచేస్తే 17 కాలేజీల నిర్మాణాలు పూర్తి కావడానికి 15 ఏళ్లు పడుతుందనేది వాస్తవం కాదా? 
5. మెడికల్‌ కాలేజీల నిర్మాణాలు ఇలా ఏళ్లు గడిస్తే 1750 మెడికల్‌ సీట్లు మురిగిపోయే ప్రమాదం లేదా? అలాగే పీజీ సీట్లు కూడా కోల్పోయే ప్రమాదం ఉన్న విషయం వాస్తవం కాదా? 
6. జగన్‌ ప్రభుత్వ విధానం కన్నా కూటమి ప్రభుత్వ పీపీపీ విధానం వల్ల మన రాష్ట్ర విద్యార్థులకు ప్రభుత్వ కోటాలో 110 సీట్లు అదనంగా వస్తాయనేది నిజం కాదా? అలాగే ప్రైవేట్‌ కోటాలో కూడా మరో 110 సీట్లు పెరిగి మొత్తం 220 సీట్లు మన రాష్ట్ర విద్యార్థులకు అదనంగా వస్తాయనేది వాస్తవం కాదా?
7. పీపీపీ పద్ధతిలో కూడా ఇప్పటిలాగే 50శాతం మెడికల్‌ సీట్లు ప్రభుత్వ కోటాలోనే భర్తీ చేస్తారనేది నిజం కాదా? ప్రభుత్వ ఫీజు మాత్రమే ఉంటుందనేది వాస్తవం కాదా?
8. పీపీపీ విధానంలో అయితే రాబోయే రెండేళ్లలో కాలేజీల నిర్మాణాలు జరిగి అందులో 1750 సీట్లు త్వరగా మన విద్యార్థులు పొందుతారు అనేది నిజం కాదా?
9. కర్నాటకలో 12 మెడికల్‌ కాలేజీలు పీపీపీ విధానంలో నిర్మిస్తున్నది నిజం కాదా? అలాగే అనేక రాష్ట్రాల్లో పీపీపీ విధానం జరుగుతుంది కదా?
10.  గత చంద్రబాబు పాలనలో జేగురుపాడు విద్యుత్‌ ప్లాంట్లు పీపీపీ విధానంలో నిర్మించారు, 33 ఏళ్లు పూర్తి అయినందున అది నేడు ప్రభుత్వ పరమైంది నిజం కాదా?
11. గంగవరం పోర్టును ప్రైవేటుకు అమ్మేసింది జగన్‌ ప్రభుత్వం కాదా? విశాఖ స్టీలు భూముల్ని ప్రైవేటుకు అమ్మేయమని చెప్పింది జగన్‌ కాదా?
12. జగన్‌ విధ్వంస పాలన వల్ల కూటమి ప్రభుత్వం నిధుల కొరత ఎదుర్కొంటుంది వాస్తవం కాదా? ఉన్న కొద్దిపాటి నిధులు మెడికల్‌ కాలేజీలకు ఖర్చు చేస్తే సంక్షేమ పథకాలకు కోతలు పడవా? ఉద్యోగులకు జీతాలు చెల్లించని స్థితి రాదా? రోడ్లు వేయలేని స్థితి రాదా? ఇలా దెబ్బతీయాలనే కదా జగన్‌ కుట్ర?
13. 1995- 2004 మధ్య చంద్రబాబు ప్రభుత్వం జిల్లాకొక మెడికల్‌ కాలేజీ, రెవిన్యూ డివిజన్‌ కొక ఇంజనీరింగ్‌ కాలేజీ పెట్టడం వలనే కదా నేడు రాష్ట్రంలో డాక్టర్ల కొరత లేకుండా ఉంది - అలాగే ప్రతి నలుగురు ఎన్‌.ఆర్‌.ఐలో ఒకరు తెలుగువారు 
ఉన్నారంటే అది ఆనాడు చంద్రబాబు తీసుకున్న మంచి నిర్ణయం కాదా?
14. నేడు ఏపీలో 18 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు, మరో 18 ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలతో సమతూకంగా ఉందంటే అది చంద్రబాబు అనుసరించిన హైబ్రిడ్‌ విధానం కాదా? 
15. చైనా, వియాత్నాం హైబ్రిడ్‌ విధానం అమలు పరచడం వల్ల ఆ దేశాలు ప్రముఖ ఆర్థిక శక్తులుగా నేడు విలసిల్లుతున్నవి- క్యూబా, నార్త్‌ కొరియా దేశాలు పిడివాదం వల్ల, హైబ్రిడ్‌ విధానం అవలంబించక పోవడం వల్ల వెనకబడి పోయింది వాస్తవం కాదా?
16. మెడికల్‌ కాలేజీల పేరుతో జగన్‌ చేస్తున్నది రాజకీయ స్వార్థ ప్రయోజనాలకే గాని రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదనేది వాస్తవం కాదా? 
17. నీతి ఆయోగ్‌ రిపోర్ట్‌ ప్రకారం వైద్య, ఆరోగ్య ప్రమాణాల్లో చంద్రబాబు పాలన 
(2014- 19)లో 4 వస్థానంలో ఉన్న ఏపీని, జగన్‌ పాలన (2019- 24)లో 10వ స్థానానికి దిగజారింది వాస్తవం కాదా? 
18. చంద్రబాబు ఒక్క మెడికల్‌ కాలేజీని స్థాపించలేదని జగన్‌ ముఠా చేసే ప్రచారం పచ్చి అబద్ధం కాదా? చంద్రబాబు, ఎన్టీఆర్‌ పాలనలో ఉమ్మడి, నవ్యాంధ్రలో 28 మెడికల్‌ కాలేజీలు స్థాపించింది నిజం కాదా? చంద్రబాబు సంకల్పం హెల్దీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్‌ నిర్మాణం అనేది బహిరంగ సత్యం కాదా? 

ఈ ప్రశ్నలకు వైసీపీ ఎలా స్పందిస్తుందన్నది వేచి చూడాల్సి ఉంది. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Train Accident: చునార్ రైల్వే స్టేషన్‌లో ఘోర ప్రమాదం, రైలు ఢీకొని పలువురు దుర్మరణం
చునార్ రైల్వే స్టేషన్‌లో ఘోర ప్రమాదం, రైలు ఢీకొని పలువురు దుర్మరణం
IRCTC Tour Package: దుబాయ్, అబుదాబి వెళ్లాలనుకునేవారికి IRCTC టూర్ ప్యాకేజీ.. ఖర్చు, ప్లాన్ వివరాలివే
దుబాయ్, అబుదాబి వెళ్లాలనుకునేవారికి IRCTC టూర్ ప్యాకేజీ.. ఖర్చు, ప్లాన్ వివరాలివే
Hyderabad- Vijayawada National Highway: హైదరాబాద్ - విజయవాడ హైవే 6 లేన్లుగా విస్తరణ, జాతీయ రహదారి 65 విస్తరణకు కేంద్రం నోటిఫికేషన్
హైదరాబాద్ - విజయవాడ హైవే 6 లేన్లుగా విస్తరణ, జాతీయ రహదారి 65 విస్తరణకు కేంద్రం నోటిఫికేషన్
Royal Enfield Bullet Bike: రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 650 వచ్చేస్తోంది.. పవర్‌ఫుల్ ఇంజిన్‌, అద్భుతమైన ఫీచర్లు చూశారా
రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 650 వచ్చేస్తోంది.. పవర్‌ఫుల్ ఇంజిన్‌, అద్భుతమైన ఫీచర్లు చూశారా
Advertisement

వీడియోలు

పాక్ ప్లేయర్ తిక్క కుదిర్చిన ICC.. కానీ మన సూర్యకి అన్యాయం!
రికార్డుల రారాజు కింగ్ కోహ్లీ బర్త్ డే స్పెషల్
ఫెషాలీ, దీప్తి కాదు.. తెలుగమ్మాయి వల్లే గెలిచాం: రవిచంద్రన్ అశ్విన్
అబ్బాయిలకో న్యాయం?  అమ్మాయిలకో న్యాయమా?
3i Atlas interstellar object | 9 ఏళ్లలో 3 సార్లు.. భూమి కోసమా? సూర్యుడి కోసమా? | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Train Accident: చునార్ రైల్వే స్టేషన్‌లో ఘోర ప్రమాదం, రైలు ఢీకొని పలువురు దుర్మరణం
చునార్ రైల్వే స్టేషన్‌లో ఘోర ప్రమాదం, రైలు ఢీకొని పలువురు దుర్మరణం
IRCTC Tour Package: దుబాయ్, అబుదాబి వెళ్లాలనుకునేవారికి IRCTC టూర్ ప్యాకేజీ.. ఖర్చు, ప్లాన్ వివరాలివే
దుబాయ్, అబుదాబి వెళ్లాలనుకునేవారికి IRCTC టూర్ ప్యాకేజీ.. ఖర్చు, ప్లాన్ వివరాలివే
Hyderabad- Vijayawada National Highway: హైదరాబాద్ - విజయవాడ హైవే 6 లేన్లుగా విస్తరణ, జాతీయ రహదారి 65 విస్తరణకు కేంద్రం నోటిఫికేషన్
హైదరాబాద్ - విజయవాడ హైవే 6 లేన్లుగా విస్తరణ, జాతీయ రహదారి 65 విస్తరణకు కేంద్రం నోటిఫికేషన్
Royal Enfield Bullet Bike: రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 650 వచ్చేస్తోంది.. పవర్‌ఫుల్ ఇంజిన్‌, అద్భుతమైన ఫీచర్లు చూశారా
రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 650 వచ్చేస్తోంది.. పవర్‌ఫుల్ ఇంజిన్‌, అద్భుతమైన ఫీచర్లు చూశారా
ISRO Gaganayan Vyomitra: గగనయాన్‌కు తొలిమెట్టు.. మానవరోబో వ్యోమిత్రను అంతరిక్షంలోకి పంపుతున్న ఇస్రో
గగనయాన్‌కు తొలిమెట్టు.. మానవరోబో వ్యోమిత్రను అంతరిక్షంలోకి పంపుతున్న ఇస్రో
Aadi Saikumar: ప్రభాస్ వల్ల 'శంబాల'కు ఫ్యాన్స్ సపోర్ట్... ఫ్లాపులు, సక్సెస్ రేట్‌పై ఆది సాయికుమార్ రియాక్షన్!
ప్రభాస్ వల్ల 'శంబాల'కు ఫ్యాన్స్ సపోర్ట్... ఫ్లాపులు, సక్సెస్ రేట్‌పై ఆది సాయికుమార్ రియాక్షన్!
Hyderabad Crime News: పీఎస్ ఎదుటే నిప్పంటించుకుని డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిన వ్యక్తి ఆత్మహత్య
పీఎస్ ఎదుటే నిప్పంటించుకుని డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిన వ్యక్తి ఆత్మహత్య
Money Earning Tips: ఇలా SIP చేస్తే కోటీశ్వరులు అవుతారు.. రూ.2000తో మొదలుపెట్టి ఇలా ఇన్వెస్ట్ చేయాలి
ఇలా SIP చేస్తే కోటీశ్వరులు అవుతారు.. రూ.2000తో మొదలుపెట్టి ఇలా ఇన్వెస్ట్ చేయాలి
Embed widget