క్రెడిట్ కార్డ్ రూల్ ఒక్కటే .. నువ్వు వాడుకుంటే డబ్బులు.. .క్రెడిట్ కార్డు మిమ్మల్ని వాడుకునే చాన్స్ ఇస్తే అప్పులు

Published by: Raja Sekhar Allu

క్రెడిట్ కార్డులు 45-50 రోజుల వరకు వడ్డీ లేని క్రెడిట్ వ్యవధిని అందిస్తాయి. అంటే వడ్డీ లేని రుణం ఇచ్చినట్లే.

Published by: Raja Sekhar Allu

డిట్ కార్డులు కొనుగోళ్లపై క్యాష్‌బ్యాక్ లేదా రివార్డ్ పాయింట్లు అందిస్తాయి. అలాగే డిస్కౌంట్లు కూడా.అంటే వడ్డీ లేని లోన్.. వాడుకుంటే అదనంగా ఆదాయం.

Published by: Raja Sekhar Allu

అనుకోని ఖర్చులు వచ్చినప్పుడు క్రెడిట్ కార్డు తక్షణ ఆర్థిక సహాయం అందిస్తుంది. వడ్డీలు కట్టాల్సిన అప్పు చేయాల్సిన అవసరం ఉండదు.

Published by: Raja Sekhar Allu

క్రెడిట్ కార్డును జాగ్రత్తగా ఉపయోగించి, బిల్లులను సమయానికి చెల్లిస్తే క్రెడిట్ స్కోర్ మెరుగుపడుతుంది. దీని వల్ల తక్కువ వడ్డీకే అప్పులు లభిస్తాయి.

Published by: Raja Sekhar Allu

ఖరీదైన కొనుగోళ్లను (ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్) క్రెడిట్ కార్డు ద్వారా ఈఎంఐలలో చెల్లించవచ్చు. కొన్ని కార్డులు తక్కువ లేదా జీరో వడ్డీ ఈఎంఐ ఆఫర్లు అందిస్తాయి

Published by: Raja Sekhar Allu

ఎయిర్‌మైల్స్, ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్, ట్రావెల్ ఇన్సూరెన్స్, హోటల్ బుకింగ్‌లపై డిస్కౌంట్లు ఇస్తాయి. ఎయిర్ పోర్ట్ లాంజ్‌లో తిన్నంత,తాగినంత ఉచితం

Published by: Raja Sekhar Allu

కొన్ని ప్రీమియం క్రెడిట్ కార్డులు ఉచిత ట్రావెల్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, లేదా ఆక్సిడెంట్ ఇన్సూరెన్స్ అందిస్తాయి.

Published by: Raja Sekhar Allu

ఆన్‌లైన్ షాపింగ్ సైట్లు (అమెజాన్, ఫ్లిప్‌కార్ట్), రెస్టారెంట్లు, సినిమా టికెట్లు, ఫ్యూయల్ స్టేషన్లలో క్రెడిట్ కార్డులపై ప్రత్యేక డిస్కౌంట్లు లభిస్తాయి.

Published by: Raja Sekhar Allu

ముందుగా చెప్పుకున్నట్లుగా అవసరానికి మాత్రమే క్రెడిట్ కార్డును వాడితే ... మనం వాడుకున్నట్లు.. లేకపోతే అదే మనల్ని వాడేస్తుంది.

Published by: Raja Sekhar Allu