ఉద్యోగం మారినప్పుడల్లా కొత్త PF ఖాతా ఓపెన్ అవుతుంటుంది.

అయితే ప్రతిసారీ కొత్త ఖాతాను పాతదానితో కలపటం అవసరం మాత్రమె కాదు ఉపయోగం కూడా.

ఇప్పుడు పీఎఫ్ ఖాతాలను విలీనం చేయడం మరింత సులభం.

ఇందుకోసం ముందుగా, ఈపీఎఫ్ఓ అఫీషియల్ వెబ్‌సైట్ https://unifiedportal mem.epfindia.gov.inలోకి వెళ్లాలి.

‘ఆన్‌లైన్ సర్వీసుల’ ట్యాబ్‌లో ‘వన్ మెంబర్.. వన్ ఈపీఎఫ్ అకౌంట్’ను ఎంచుకోండి.

వ్యక్తిగత వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. అలాగే ఇది మీ న్యూ EPF ఖాతా వివరాలను కూడా చూపిస్తుంది.

మునుపటి PF ఖాతా నెంబర్ లేదా మునుపటి UAN నెంబర్‌ను నమోదు చేయండి.

‘గెట్ OTP’పై క్లిక్ చేయండి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వన్ టైమ్ పాస్‌వర్డ్ వస్తుంది.

ఆ OTPని నమోదు చేసి, సబ్మిట్ నొక్కండి. అప్పుడే మీ EPF ఖాతా విలీనం కోసం చేసిన అభ్యర్థన సక్సెస్‌ఫుల్ అవుతుంది.

మీ ఎంప్లాయిర్ దానిని ఆమోదించిన తర్వాత, EPFO అధికారులు మీ మునుపటి EPF ఖాతాను ప్రాసెస్ చేసి విలీనం చేస్తారు.