Visakhapatnam data centre: విశాఖలో గూగుల్ 10 బిలియన్ డాలర్లతో డాటా సెంటర్ - SIPB సమావేశంలో ఆమోదముద్ర
Google Visakhapatnam: చంద్రబాబు అధ్యక్షతలో 11వ SIPB సమావేశం జరిగింది. రూ. 1.14 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపింది.

Andhra Investments: ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల ప్రోత్సాహకాలకు కొత్త ఊరటను అందించేలా ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు అధ్యక్షతలో సచివాలయంలో నిర్వహించిన 11వ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) సమావేశం లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో ఐటీ, ఇంధనం, టూరిజం, ఏరోస్పేస్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల్లో 30కి పైగా ప్రాజెక్టులకు మొత్తం రూ. 1.14 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. ఈ పెట్టుబడుల ద్వారా 67 వేల మందికి ఉద్యోగాలు వస్తాయి.
దేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (FDI)గా గూగుల్ USD 10 బిలియన్లు (సుమారు రూ. 84 వేల కోట్లు) విశాఖపట్నంలో ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ క్లస్టర్‌కు పెట్టుబడి పెట్టనుంది. అలాగే, రైడెన్ ఇన్ఫోటెక్ రూ. 87,520 కోట్లతో డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. 3 గంటల పాటు సాగిన ఈ సమావేశంలో ప్రాజెక్టుల వారీగా లోతైన చర్చ జరిగింది. ఇప్పటి వరకు SIPBల ద్వారా మొత్తం రూ. 7.07 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించి, 6.20 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం వెల్లడించింది.
మంగళవారం సచివాలయంలో నిర్వహించిన ఈ 11వ SIPB సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు "15 నెలల్లో పెట్టుబడుల ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి" అని పేర్కొన్నారు. సమావేశంలో IT, ITES, ఇంధనం, టూరిజం, ఏరోస్పేస్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల్లో 30కి పైగా ప్రాజెక్టులు ప్రతిపాదించారు. రూ. 84 వేల కోట్ల పెట్టుబడితో గూగుల్ విశాఖపట్నంలో 1 GW సామర్థ్యం కలిగిన డేటా సెంటర్ క్లస్టర్‌ను ఆసియాలోనే అతిపెద్దదిగా ఉండే ఈ ప్రాజెక్ట్‌ను SIPB "ఆంధ్రప్రదేశ్ IT ఎకోసిస్టమ్‌కు గేమ్ చేంజర్"గా గుర్తించింది. విశాఖను "AI వ్యాలీ"గా మార్చడానికి ఈ ప్రాజెక్ట్ సహాయపడుతుందని ముఖ్యమంత్రి చెప్పారు.
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన నేడు జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) 11 వ సమావేశం రూ. 1.14 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. ఐటీ, ఇంధనం, టూరిజం, ఎరోస్పేస్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో 30కి పైగా ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. దేశ… pic.twitter.com/G4sB6ZVH2K
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) October 8, 2025
రైడెన్ ఇన్ఫోటెక్ రూ. 87,520 కోట్లతో డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. దేశంలోనే అతిపెద్ద FDIగా ఈ ప్రాజెక్టును SIPB ఆమోదించింది. ఇంధనం, టూరిజం, ఏరోస్పేస్, ఫుడ్ ప్రాసెసింగ్‌లో మిగిలిన 28 ప్రాజెక్టులు. ఈ పెట్టుబడులు విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, కర్నూలు వంటి ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారు. భారీ ప్రాజెక్టులకు ప్రత్యేక అధికారులను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అధికారులు కంపెనీలు త్వరగా గ్రౌండ్ అయ్యేలా బాధ్యతలు తీసుకుంటారు. సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు ఐటీ మంత్రి నారా లోకేశ్‌కు అతిపెద్ద FDI సాధించినందుకు అభినందనలు తెలిపారు. "గూగుల్, రైడెన్ వంటి గ్లోబల్ జెయింట్‌లు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడి పెట్టడం రాష్ట్రానికి గర్వకారణం" అని చంద్రబాబు అన్నారు.





















