(Source: ECI | ABP NEWS)
YS Jagan Tour: నేడు అనకాపల్లి మెడికల్ కాలేజీకి జగన్- టూర్‌పై పోలీసులు ఆంక్షలు- అయినా భారీగా ప్లాన్ చేసిన వైసీపీ
YS Jagan Tour: మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో డెవలప్ చేస్తామన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న జగన్ నేడు అనకాపల్లిలో పర్యటించనున్నారు.

YS Jagan Tour: సుదీర్ఘ విరామం తర్వాత ఉత్తరాంధ్రలో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న పర్యటన వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. జగన్ వస్తున్న సందర్భంగా భారీ జనసమీకరణ చేయాలని వైసీపీ ప్లాన్ చేస్తోంది. కానీ పోలీసులు మాత్రం రూల్స్ అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. వైజాగ్ నుంచి అనకాపల్లి వరకు భారీ రోడ్ షో చేయాలని వైసీపీ నేతలు శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. ఓవైపు పోలీసులు పెట్టిన ఆంక్షలు, మరోవైపు వైసీపీ నేతల భారీ ప్లాన్‌లతో జగన్ ఉత్తరాంధ్ర పర్యటన టెన్షన్‌కు కారణవుతుంది.
స్టీల్ ప్లాంట్ మీదుగా నర్సీపట్నం మెడికల్ కాలేజీకి వెళ్లేందుకు అనుమతి కోరితే ఈ ప్రభుత్వం నిరాకరించింది. మెడికల్ కాలేజీలను చంద్రబాబు ప్రైవేటుకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ, ప్రజాభీష్టానికి అనుగుణంగా ఉద్యమం చేయడం మా బాధ్యత కనుక పోలీసులు చెప్పిన రూట్లో వెళ్లేందుకు నిర్ణయించాం.… pic.twitter.com/cZYIwlrIvN
— YSR Congress Party (@YSRCParty) October 8, 2025
పది గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి జగన్ బయల్దేరనున్నారు. దాదాపు 11 గంటలకు విశాఖ చేరుకుంటారు. అక్కడ 11.30కి రోడ్డు మార్గంలో ర్యాలీగా అనకాపల్లి బయల్దేరనున్నారు. రెండు గంటలకు నర్సీపట్నంలోని మాకవరపాలెం చేరుకుంటారు. అక్కడ ఉన్న ప్రభుత్వం మెడికల్ కాలేజీని పరిశీలిస్తారు. అనంతరం అక్కడ మీడియాతో మాట్లాడనున్నారు. తర్వాత కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న కురుపాం గురుకుల బాలికలను పరామర్శిస్తారు. అక్కడి నుంచి నేరుగా బెంగళూరు వెళ్లిపోతారు.
🚨 #KurupamHealthCrisis
— YSR Congress Party (@YSRCParty) October 8, 2025
ఏడాదిన్నర కాలంగా ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో పారిశుద్ధ్యం సరిగ్గా జరగడం లేదని, రక్షిత మంచినీరు లేవని వైయస్ఆర్ సీపీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంది. కానీ ఆరోగ్యశాఖ మంత్రి మాత్రం అంతా బానే ఉందని అన్నారు. కలుషిత నీటి కారణంగా… pic.twitter.com/zBaYjrJAJ6
ప్రభుత్వం విద్య, వైద్య రంగాలను నిర్వహించకపోతే ప్రైవేటు దోపిడీ ఎక్కువైపోతుంది. ఏ పేదవాడికీ వైద్యం అందని పరిస్థితి వస్తుంది.
— YSR Congress Party (@YSRCParty) October 8, 2025
-వైయస్ జగన్ గారు, వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు pic.twitter.com/eAOgoABc2o
జగన్ పర్యటనకు పోలీసులు ఆంక్షలు పెట్టారు. విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో వెళ్లేటప్పుడు జనసమీకరణ చేయొద్దని, రోడ్డు పక్కన జనాలను గుమిగూడేలా చేయొద్దని సూచించారు. మధ్య మధ్యలో సమావేశాలు, ఆహ్వానాలు పెట్టుకోవద్దని చెప్పారు. విశాఖలో క్రికెట్ మ్యాచ్ ఉన్నందున ఆంక్షలు అమలులో ఉన్నాయని పేర్కొన్నారు.
జగన్ పర్యటనపై మంత్రి సత్యకుమార్ స్పందించారు. నర్సీపట్నం పర్యటనతో జగనకు జ్ఞానోదయం కలగాలని అభిప్రాయపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు నిర్మాణాలు పూర్తి చేయకుండా ఇప్పుడు పర్యటనలతో రాజకీయం చేయడం ఏంటని ప్రశ్నించారు. తాను చూపిన అలక్ష్యానికి చెంపదెబ్బలేసుకొని ప్రజలకు సారీ చెప్పాలని అన్నారు. ఐదు వందల కోట్ల వ్యయంతో నర్సీపట్నం మెడికల్ కాలేజీ నిర్మాణానికి 2021లో అనుమతి ఇచ్చిన జగన్ దాదాపు 11 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారని, 12 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో చేపట్టాల్సిన నిర్మాణాలను కూడా 0.89లక్షల చదరపు అడుగులకే పరిమితం చేశారని ధ్వజమెత్తారు. వచ్చే ఏడాదికి దీన్ని పూర్తి చేసి ప్రవేశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్త నిర్మించి అన్ని మెడికల్ కాలేజీల్లో కూడా ఇదే పరిస్థితి ఉందని విమర్శించారు.





















