అన్వేషించండి

RRR Vs YSRCP : హిందువుల పండుగలకే కరోనా వస్తుందా ? ఏపీ ప్రభుత్వానికి రఘురామ ప్రశ్న..!

వినాయక మండపాలను ఏర్పాటు చేయవద్దని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. బార్లు, మద్యం దుకాణాలు, జయంతులు, వర్థంతులకు రాని కరోనా హిందూ పండుగలకే వస్తుందా అని ఎంపీ రఘురామ ప్రశ్నించారు.


ఆంధ్రప్రదేశ్‌లో వినాయకచవితి పండుగను బహిరంగంగా నిర్వహించుకోవడానికి ప్రభుత్వం ఆంక్షలు విధించడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మండిపడ్డారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. క్రిస్టియన్ పండుగలకు రాని కరోనా వినాయక చవితికి వస్తుందా అని ప్రశ్నించారు. వినాయకుని విగ్రహాలు కొనుగోలు చేసిన వారిని.. చివరికి అమ్మే వారిని కూడా అరెస్ట్ చేస్తున్నామని ఇదేం పద్దతని ప్రశ్నించారు. ఆదివారం సాయంత్రం ఆరు గంటల సమయంలో ఏపీలోని ఓ మద్యం దుకాణం వద్ద తీసిన ఫోటోను రఘురామకృరాజు ప్రదర్శించారు. అది ఒక్క దుకాణం వద్దేనని ఏపీలో అన్ని మద్యం దుకాణాల వద్ద కూడా అలాంటి పరిస్ధితే ఉందని.. మరి  వారికి కరోనా రాదా అని ప్రశ్నించారు.

Also Read: ఏపీలో పనులుచేసేందుకు కాంట్రాక్టర్లు ఎంందుకు ముందుకు రావడం లేదు ?

ఆంధ్రప్రదేశ్‌లో మద్యం దుకాణాలు, బార్లు, జయంతులు, వర్థంతులు ఘనంగా చేస్తున్నారని రఘురామకృష్ణరాజు గుర్తు చేశారు. 150 మంది ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించి కార్యక్రమాలు చేపడుతున్నా కరోనా రాదా అని ప్రశ్నించారు. ఒక్క హిందువుల పండుగలకు మాత్రమే ఎందుకు ఆంక్షలు పెడుతున్నారని ప్రజలు తననను ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్‌కు వినాయకచవితి గురించి తెలియక పోతే సీనియర్ మంత్రులు , ఎమ్మెల్యేలు చెప్పాలన్నారు. ఈ విషయంలో ఎవరూ ఎందుకు నోరు తెరవడం లేదని ప్రశ్నించారు. ఒక వేళ వీరెవరికీ ధైర్యం లేకపోతే... స్వరూపానంద స్వామితో చెప్పించాలని సలహా ఇచ్చారు. 

Also Read : అప్పుల భారం దించుకునేందుకు మరో సలహాదారు నియామకం

జగన్‌ను ముఖ్యమంత్రిని చేయడానికి యాగాలు కూడా చేశానని చెప్పిన స్వరూపానంద ప్రస్తుతం కాశీలోనో మరో చోటో ఉన్నారని ఆయన వద్దకు ప్రతీ విషయానికి హుటాహుటిన వెళ్లి సలహాలు తీసుకునే దేవాదాయ మంత్రి, టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి ఎందుకు వినాయకచవితిపై ఆంక్షల విషయంలో సలహాలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా సుబ్బారెడ్డి, వెల్లంపల్లి వెళ్లి జగన్‌కు స్వరూపానందతో చెప్పించాలన్నారు. టీటీడీ  బోర్డుకు ఒక్క చైర్మన్ ఉంటే బోర్డు ఉన్నట్లు కాదని.. ఎవరూ లేకుండా  కల్యాణ మండపాల లీజు వంటి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. ఈ విషయంలోనూ స్వరూపానంద సలహాలు తీసుకోవాలని రఘురామ సూటించారు. 

Also Read : కాంట్రాక్టర్‌పై వైసీపీ నేత దౌర్జన్యం

జగన్మోహన్ రెడ్డి మాట తప్పని తమ పార్టీ నేతలు ప్రచారం చేస్తారని కానీ అందుకు భిన్నంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని కొన్ని వీడియోలు చూపించారు. తాము గెలిస్తే అమరావతిలోనే అది భారీ రాజధాని కట్టి చూపిస్తామని రైతులకు ఎంతో మేలు చేస్తామని ఓ అమరావతి గ్రామంలో జగన్ ఎన్నికల సభలో మాట్లాడిన మాటలను ప్రదర్శించారు. అలాగే పెట్రో ధరలపై కూడా జగన్ మాట్లాడిన మాటలను వీడియో చూపించారు.  బాదుడే బాదుండంటూ ప్రతిపక్షంలో ఉండగా జగన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తుతం పొరుగురాష్ట్రాల కన్నా ఎంత ఎక్కువ రేటు ఉందో వివరించారు. మడమ తిప్పడంటే ఎంటో తనకు తెలియదని కానీ మాటతప్పడు అన్నదానికి భిన్నంగా ఉందన్నారు. 

Also Read : ఆ పాస్టర్ కీచకుడు

తనపై భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ చేసిన విమర్శలపైనా స్పందించారు. ఓ సభలో మాట్లాడిన గ్రంథి శ్రీనివాస్ రఘురామపై విమర్శలు చేశారు. ఆయన నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదని రోడ్లు పాడైనా పట్టించుకోవడం లేదన్నారు. అదే సమావేశంలో గ్రంధిశ్రీనివాస్ రోడ్ల విషయంలోనే సెటైర్లు వేశారు. ప్రయాణికులు అలవాటైపోయిందని అంటున్నారని జోకులేశారు. ఈ వీడియోను ప్రదర్శించిన రఘురామ..  ఎంపీకి రాష్ట్ర రహదారులకు ఏంటి సంబంధమని ప్రశ్నించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి సలహాదారుల మాటలను వినకుండా వాస్తవాలను చూడాలని కోరారు. 

Also Read : లాటరీ గెలిచిన వారితోనే పెళ్లి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Game Changer Third Single: నానా హైరానా... 'గేమ్ చేంజర్' మూడో సాంగ్ రిలీజుకు ముందు బ్లాక్ బస్టర్ కొట్టిన తమన్
నానా హైరానా... 'గేమ్ చేంజర్' మూడో సాంగ్ రిలీజుకు ముందు బ్లాక్ బస్టర్ కొట్టిన తమన్
PM Modi News: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
BSNL Best Plan: 200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Embed widget