(Source: ECI/ABP News/ABP Majha)
Triangle Love Story: వాట్ ఏ ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. పెదరాయుడిని మించి గ్రామస్థుల తీర్పు..లాటరీ వేసి పెళ్లి చేశారన్న మాట
ఎన్ని ప్రేమ కథలు చూసి ఉంటారు. ఎన్ని లవ్ స్టోరీలు విని ఉంటారు. కానీ ఈ స్టోరీ మాత్రం మెుత్తం డిఫరెంట్. కావాలంటే మీరే చదవండి.
ఒక అబ్బాయి.. ఇద్దరు అమ్మాయిలను లవ్ చేస్తాడు. చివరకు.. ఒక అమ్మాయికి దూరంగా వెళ్లిపోయి.. మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఇలాంటి ప్రేమ కథలు ఎన్నో విన్నాం.. అనుకుంటున్నారా? ఆగండి.. ఆగండి.. అవన్నీ వేరు.. ఇది వేరు. అసలు ట్రయాంగిల్ లవ్ స్టోరీలో గ్రామస్థులు ఎంటర్ అయ్యారు. వారి ఇచ్చిన తీర్పుతోనే ఈ లవ్ గురు.. పెళ్లి పీఠలెక్కాల్సి వచ్చింది. అయితే వీరి పెళ్లి కోసం.. గ్రామస్థులు ఏం చేశారో తెలుసా.. లాటరీ వేశారు. అంతేకాదు విషయాన్ని బయటకు చెప్పింది కూడా వాళ్లే.
కర్ణాటకలోని హాసన జిల్లా సకలేశపురం ప్రాంతంలోని ఓ కుగ్రామంలో ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడిచింది. లాటరీ ద్వారా ఇద్దరు యువతుల్లో ఒకరిని ఎంపిక చేసి.. యువకుడితో వివాహం చేశారు. ఇక కొన్ని నెలలుగా నడిచిన ట్రయాంగిల్ లవ్ స్టోరీకి ఫుల్ స్టాప్ పడింది.
హాసన జిల్లా సకలేశపుర ప్రాంతానికి చెందిన యువకుడు ఇంటర్ నెట్ లో వేర్వేరు ప్రాంతాల్లోని ఇద్దరిని ఒకరికి తెలియకుండా మరొకరితో లవ్ నడిపించాడు. ఈ లవ్ గురూ.. ప్రేమతో ఇద్దరు అమ్మాయిలూ చాలా గాఢంగా ప్రేమించారు. అతడు లేకుండా బతకలేమని.. చెప్పేశారు. ఇద్దరిలో ఎవరిని చేసుకోలేక.. ఆ యువకుడు తికమక పడ్డాడు. ఈ విషయం గ్రామస్థుల ముందుకు వెళ్లింది. ఇందులో ఓ యువతి తన ప్రేమికుడు కావాలంటూ.. విషం తాగింది. ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
ఇక ఆమె కోలుకుని గ్రామానికి తిరిగి వచ్చింది. గ్రామస్థులంతా.. ఓ నిర్ణయానికి వచ్చారు. లాటరీ.. పద్ధతిలో ఎవరు చేసుకోవాలో నిర్ణయించాలనుకున్నారు. దీనికి ట్రయాంగిల్ లవ్ స్టోరీ లవర్స్ ఓకే చెప్పారు. అయితే ఈ లాటరీలో పేరు రాని యువతి ఏం మాట్లాడకుండా వెళ్లిపోవాలని నిర్ణయించారు. లాటరీ తీయగా.. అందులో విషం తాగిన యువతి.. పేరు వచ్చింది. అయితే ఓడి పోయిన యువతి.. ఏం చెప్పిందో తెలుసా.. మీ వివాహ జీవితం సంతోషంగా ఉండాలని కోరుకుంది. అంతేగాకుండా చివరకు ఓ ఝలక్ ఇచ్చింది. తనను మోసం చేసిన యువకుడిని వదిలే ప్రసక్తేలేదని హెచ్చరించింది.
Also Read: Hyderabad Fake Baba: పరీక్షలో పాస్ కావాలంటే 'కాల భైరవ పూజ' చేస్తాడట.. రూ.80 వేలు సమర్పయామి