అన్వేషించండి

AP Loans : అప్పుల ఒత్తిడిలో ఏపీ ప్రభుత్వం ! చక్కదిద్దుకునేందుకు సలహాదారు నియామకం..!

ఏపీ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై కొన్నాళ్లుగా అనేక విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఓ ఆర్థిక నిపుణుడిని కేబినెట్ హోదాతో ప్రభుత్వం సలహాదారుగా నియమించుకుంది.


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న అప్పులపై కొద్ది రోజులుగా రాజకీయం నడుస్తోంది. అలవి కానన్ని అప్పులు చేస్తున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. సూట్‌కేస్ కంపెనీల్లాగా సూట్‌కేస్ కార్పొరేషన్లు పెట్టి లోన్లు తెస్తున్నారని మండిపడుతున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం నిబంధనలకు లోబడి.. పరిమితులకు లోబడి మాత్రమే అప్పులు చేస్తున్నామని చెబుతోంది. అదీ కూడా ప్రజల్ని కాపాడుకునేందుకు మాత్రమే చేస్తున్నామని ఎదురుదాడి చేస్తోంది. అయితే వస్తున్న ఆదాయానికి .. చేస్తున్న ఖర్చుకు పొంతన లేకపోవడంతో ఏపీ ఆర్థిక శాఖపై తీవ్రమైన ఒత్తిడి కనిపిస్తోంది. దీంతో  నిపుణుడైన ఓ సలహాదారును కేబినెట్ హోదాతో కొత్త నియమించుకున్నారు. 

ఏపీ ప్రభుత్వం చెప్పిన అప్పుల లెక్క రూ.1,27,105.81 కోట్లు..!

ప్రభుత్వం విపరీతంగా అప్పులు చేస్తోందని వస్తున్న విమర్శలకు ప్రభుత్వం అధికారికంగా కౌంటర్ ఇచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రూ.1,27,105 కోట్లు మాత్రమే అప్పులు చేశామని తెలుగుదేశం పార్టీ నేతలు విమర్శిస్తున్నట్లుగా అలవిమాలిన అప్పులు చేయలేదని స్పష్టం చేసింది. పూర్తి విచక్షణతోనే నిబంధనలకు అనుగుణంగానే రుణాలు సేకరిస్తున్నామని చెబుతోంది. అంతే కాదు.. కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇతర రాష్ట్రాలు.. దేశాలు కూడా అప్పులు చేస్తున్నాయని అందులో తప్పేమీ లేదని చెబుతున్నారు. తాము అప్పులు తెచ్చి ప్రజలకే నేరుగా నగదు బదిలీ చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. గత రెండేళ్ల కాలంో ప్రజల ఖాతాల్లో నేరుగా రూ. 1,05,102.22 కోట్లు జమ చేశామని లెక్కలు విడుదల చేసింది.

AP Loans :  అప్పుల ఒత్తిడిలో ఏపీ ప్రభుత్వం ! చక్కదిద్దుకునేందుకు సలహాదారు నియామకం..!

Also Read : కాంట్రాక్టర్‌పై వైసీపీ నేత రుబాబు

టీడీపీ లెక్క ప్రకారం వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం చేసిన అప్పులు రూ. 2, 01, 138 కోట్లు 

ఏపీ ప్రభుత్వ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రూ.1,27,105 కోట్లు మాత్రమే అప్పులు చేశామని చెబుతున్నారు. కానీ ప్రభుత్వం అధికారిక రికార్డుల ప్రకారమే రూ. రెండులక్షల కోట్లు దాటిపోయాయని లెక్కలు చెబుతోంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో  రూ. 39,686 కోట్లు, 2020-21లో 55161 కోట్లు, ఈ ఆర్థిక సంవత్సరంలో సగటున నెలకు రూ. పదివేల కోట్లు అప్పులు చేస్తున్నారని టీడీపీ లెక్కలు విడుదల చేసింది. ఇవన్నీ కాగ్ రిపోర్టుల ప్రకారమేనని చెబుతోంది. అదే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో చేసింది రూ. లక్షా 30వేల కోట్లేనని కానీ ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయని కానీ రూ. రెండు లక్షల కోట్లను అప్పు చేసిన ఏపీ ప్రభుత్వం ఆ డబ్బులన్నీ ఏం చేశారని ప్రశ్నిస్తోంది. అదే సమయంలో ప్రజలపై రూ. 75వేల కోట్ల పన్నుల భారాన్ని మోపారని కూడా టీడీపీ లెక్కలు చూపిస్తోంది.
AP Loans :  అప్పుల ఒత్తిడిలో ఏపీ ప్రభుత్వం ! చక్కదిద్దుకునేందుకు సలహాదారు నియామకం..!

Also Read : ఏపీలో వినాయక చవితి పండుగకు ఆంక్షలపై వివాదం

ఆర్థిక కష్టాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం..!

ఓ వైపు భారీగా రుణసమీకరణ చేస్తున్నప్పటికీ ప్రభుత్వానికి ఆర్థిక కష్టాలు వదిలి పెట్టడం లేదు.  మరో వైపు విద్యుత్ చార్జీలు, ఆస్తిపన్ను సహా వివిధ రకాల పన్నులను ప్రభుత్వం పెంచుతోంది. పెట్రోల్, డిజిల్‌పై పొరుగు రాష్ట్రాల కన్నా ఏపీలో రూ. ఎడెనిమిది ఎక్కువ. ఈ విషయంపై పొరుగు రాష్ట్రాల పెట్రోల్ బంకులు పోస్టర్లు పెట్టి మరీ ప్రచారం చేసుకుని వ్యాపారం పెంచుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల నడుమ ఏపీలో  ప్రభుత్వ పరంగా జరుగుతున్న అభివృద్ధి పనులు కూడా ఎక్కడా జరగడం లేదు. రోడ్ల నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు. మరమ్మతులు కూడా చేయడం లేదు. అయినప్పటికీ ఒకటో తేదీ వచ్చే సరికి ఉద్యోగులకు జీతాలివ్వడానికే తంటాలు పడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక భారం దించుకోవడానికన్నట్లుగా వృద్ధుల పించన్లను కూడా కోత కోస్తూండటంతో  ప్రజల్లో కూడా అయోమయం ఏర్పడుతోంది.
AP Loans :  అప్పుల ఒత్తిడిలో ఏపీ ప్రభుత్వం ! చక్కదిద్దుకునేందుకు సలహాదారు నియామకం..!

Also Read : హుజురాబాద్ ఉపఎన్నిక ఆలస్యంతో ఎవరికి లాభం..?

ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకోవడానికి మరో మరో సలహాదారు నియామకం..!
      
ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకోవడానికి ఏపీ ప్రభుత్వం మరో సలహాదారుడిని నియమించుకుంది. అంతర్జాతీయ స్థాయిలో ఆర్థిక వ్యవహారాల నిపుణుడిగా పేరున్న రజనీష్ కుమార్ అనే వ్యక్తిని కేబినెట్ హోదాతో కొత్త సలహాదారుగా నియమించకున్నారు. ఎలా నిధులు సమీకరించుకోవాలని.. వనరులన్నింటినీ ఎలా ఉపయోగిచుకోవాలన్నదానిపై రజనీష్ సలహాలు ఇస్తారు.  ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుభాష్ చంద్రగార్గ్ అనే ఆర్థిక సలహాదారుగా ఉన్నారు. ఆయన ఢిల్లీ లో ఉండే పని చేస్తున్నారు. ఆయన గతంలో కేంద్ర ఆర్థిక శాఖలో పని చేశారు. ఆర్థిక శాఖ నుంచి తప్పించారని చెప్పి సర్వీస్ నుంచి వైదొలిగారు. ఏపీ ప్రభుత్వ సలహాదారుగా ఆయనను తీసుకున్నారు.  అలాగే రుణాల సేకరణ కోసం ఎస్‌బీఐ క్యాపిటల్ సంస్థతో  ఒప్పందం చేసుకుంది. ఆ సంస్థ పెద్ద ఎత్తున రుణాలు ఇప్పిచింది.  

  Also Read : బిగ్‌బాస్‌ తొలి వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే..?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Politics: జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
Dilawarpur Ethanol Factory: దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
Star Link India: ఇండియా మొత్తం వైఫై పెట్టనున్న ఎలాన్ మస్క్ - ఇక మొబైల్ టవర్లన్నీ స్క్రాపే - ఇంతకీ ఏం చేయబోతున్నాడో తెలుసా?
ఇండియా మొత్తం వైఫై పెట్టనున్న ఎలాన్ మస్క్ - ఇక మొబైల్ టవర్లన్నీ స్క్రాపే - ఇంతకీ ఏం చేయబోతున్నాడో తెలుసా?
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Politics: జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
Dilawarpur Ethanol Factory: దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
Star Link India: ఇండియా మొత్తం వైఫై పెట్టనున్న ఎలాన్ మస్క్ - ఇక మొబైల్ టవర్లన్నీ స్క్రాపే - ఇంతకీ ఏం చేయబోతున్నాడో తెలుసా?
ఇండియా మొత్తం వైఫై పెట్టనున్న ఎలాన్ మస్క్ - ఇక మొబైల్ టవర్లన్నీ స్క్రాపే - ఇంతకీ ఏం చేయబోతున్నాడో తెలుసా?
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Vikatakavi Web Series Review - వికటకవి రివ్యూ: Zee5లో కొత్త వెబ్ సిరీస్ - తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో డిటెక్టివ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
వికటకవి రివ్యూ: Zee5లో కొత్త వెబ్ సిరీస్ - తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో డిటెక్టివ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
Latest Weather Report: తుపానుగా మారిన ఫెంగల్‌- ఏపీకి వర్ష సూచన - తెలంగాణలో చలి బాబోయ్‌ చలి
తుపానుగా మారిన ఫెంగల్‌- ఏపీకి వర్ష సూచన - తెలంగాణలో చలి బాబోయ్‌ చలి
Allu Arjun: ఆ పాటలో వింటేజ్ బన్నీను చూస్తారు... ఇకపై అభిమానులను వెయిట్ చేయించను - అల్లు అర్జున్ ప్రామిస్
ఆ పాటలో వింటేజ్ బన్నీను చూస్తారు... ఇకపై అభిమానులను వెయిట్ చేయించను - అల్లు అర్జున్ ప్రామిస్
Embed widget