(Source: ECI/ABP News/ABP Majha)
Pastor Arrest: హైదరాబాద్ లో కీచక పాస్టర్ అరెస్ట్... మత బోధనల పేరుతో మాయమాటలు... మోసపోయిన ముగ్గురు యువతులు!
పేరుకు మత ప్రబోధకుడు... చర్చికి వచ్చే యువతులను ట్రాప్ చేసి పెళ్లి చేసుకుంటాడు. ముగ్గురు యువతులకు మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్న కీచక పాస్టర్ ఇప్పుడు కటకటాల పాలయ్యాడు.
దేవుడి పేరుతో మాయమాటలు చెప్పి యువతులను లోబర్చుకుంటున్నాడో మత ప్రబోధకుడు. బయటకు పాస్టర్ లా టీవీల్లో ప్రసంగాలు దంచేస్తూ.. నయవంచనకు పాల్పడుతున్నాడు. ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకొని ఘరానా మోసానికి పాల్పడిన కీచక పాస్టర్ జోసఫ్ అలియాస్ సాధును పోలీసులు అరెస్ట్ చేశారు. ఉప్పల్ లోని గాస్పల్ చర్చి పాస్టర్ గా ఉన్న జోసఫ్ అలియాస్ సాధు కొన్ని టీవీ ఛానళ్లలో మత ప్రబోధకుడిగా పనిచేస్తున్నాడు. చర్చికి వచ్చే యువతులకు మాయమాటలు చెప్పి లొంగదీసుకుంటున్నాడు. ఇలా ముగ్గుర్ని పెళ్లి కూడా చేసుకున్నాడు. బాధితుల ఫిర్యాదుతో అసలు విషయం బయటపడింది. మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఎమ్మార్పీఎస్ నేతల సాయంతో యువతులు ఫిర్యాదు చేశారు. లైంగిక దాడికి పాల్పడి, బెదిరిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Also Read: వాట్ ఏ ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. పెదరాయుడిని మించి గ్రామస్థుల తీర్పు..లాటరీ వేసి పెళ్లి చేశారన్న మాట
ట్రాప్ చేసి పెళ్లిళ్లు
మత ప్రబోధకుడిగా ప్రసంగాలు దేవుడి పేరుతో యువతులకి గాలెం వేస్తున్న పాస్టర్ జోసెఫ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పాస్టర్ జోసెఫ్ అసలు పేరు సాధు చిన్న వెంకటేశ్వర్లు. ఉప్పల్ లో గాస్పల్ చర్చి నిర్వహిస్తున్నాడు. మత ప్రబోధకుడుగా అమాయక అమ్మాయిలను ట్రాప్ చేయడం మొదలుపెట్టాడు. చెల్లి అంటూనే దగ్గరవుతూ లైంగిక వాంఛలు తీర్చుకుంటున్నాడు. ఈ క్రమంలో ముగ్గురు యువతులను వివాహం కూడా చేసుకున్నాడు. చీటింగ్ పాస్టర్‌పై మేడిపల్లి పీఎస్‌లో ఫిర్యాదు నమోదైంది. దీంతో జోసెఫ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అమ్మాయిల్ని ట్రాప్ చేసి పెళ్లి పేరుతో మోసం చేయడం జోసెఫ్‌కి అలవాటుగా మారింది. ఎదురు తిరిగితే బాధితురాలి కుటుంబంపై కేసులు పెట్టి వేధిస్తానని భేదిస్తాడు.
Also Read: పరీక్షలో పాస్ కావాలంటే 'కాల భైరవ పూజ' చేస్తాడట.. రూ.80 వేలు సమర్పయామి
స్పా సెంటర్ పేరుతో వ్యభిచార కేంద్రం
హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ వ్యభిచార గృహంపై ఆదివారం సాయంత్రం పోలీసులు దాడులుచేశారు. స్పా సెంటర్, బ్యూటీ సెలూన్ ముసుగులో వ్యభిచార కేంద్రం నిర్వహిస్తున్నట్టు గుర్తించిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేంద్రం ప్రధాన నిర్వాహకుడితో పాటు ఇద్దరు మేనేజర్లు, 10 మంది విటులు, 10 మంది యువతులను అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.73 వేలు డబ్బు, 28 ఫోన్లు, ఓ కారు, రూ.4 లక్షలు బ్యాలెన్స్ ఉన్న బ్యాంకు అకౌంట్లు స్వాధీనం చేసుకున్నారు.
Also Read: బిల్లుల భయమా ? బెదిరింపుల గండమా ? ఏపీలో కాంట్రాక్టర్లు టెండర్లు ఎందుకు వేయడం లేదు..?