PM Modi: ఆంద్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం - ప్రధాని మోదీ స్పెషల్ ట్వీట్
Andhra Pradesh News: ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన క్రమంలో ప్రధాని మోదీ ప్రత్యేక ట్వీట్ చేశారు. కూటమి రాష్ట్ర కీర్తిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుందని అన్నారు.
![PM Modi: ఆంద్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం - ప్రధాని మోదీ స్పెషల్ ట్వీట్ prime minister modi special tweet on chandrababu oath as a chief minister of andrapradesh PM Modi: ఆంద్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం - ప్రధాని మోదీ స్పెషల్ ట్వీట్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/12/760aadce43b4312384826b32cb86ff461718188147044876_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
PM Modi Special Tweet On CM Chandrababu: ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ (PM Modi) సహా కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, ఇతర రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ.. ప్రమాణ స్వీకారం అనంతరం చంద్రబాబును ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం చంద్రబాబు మోదీని సత్కరించారు.
ప్రధాని ప్రత్యేక ట్వీట్
ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణం చేసిన క్రమంలో ప్రధాని మోదీ (PM Modi) ప్రత్యేక ట్వీట్ చేశారు. టీడీపీ - జనసేన - బీజేపీ కూటమి ఆంద్రప్రదేశ్ కీర్తిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుందని అన్నారు. 'ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యాను. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన అందరికీ నా అభినందనలు. రాష్ట్ర యువత ఆకాంక్షలు నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది.' అని మోదీ ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యాను. ముఖ్యమంత్రి అయిన సందర్భంగా శ్రీ @ncbn గారికి, మరియు ప్రభుత్వంలో మంత్రులుగా ప్రమాణం చేసిన వారందరికీ కూడా అభినందనలు. ఎపిని నూతన కీర్తి శిఖరాలకు తీసుకెళ్లడానికి మరియు రాష్ట్ర యువత ఆకాంక్షలను నెరవేర్చడానికి @JaiTDP,… pic.twitter.com/oVgnhlqw0u
— Narendra Modi (@narendramodi) June 12, 2024
అట్టహాసంగా కార్యక్రమం
ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం వైభవంగా జరిగింది. గవర్నర్ అబ్దుల్ నజీర్ చంద్రబాబుతో ప్రమాణం చేయించారు. నాలుగోసారి ఏపీ సీఎంగా ప్రమాణం చేసి చంద్రబాబు రికార్డు సృష్టించారు. ప్రమాణ స్వీకారం అనంతరం ప్రధాని మోదీ వద్దకు వెళ్లిన చంద్రబాబు ఆయనకు పుష్పగుచ్చం అందించి శాలువా కప్పి సత్కరించారు. అనంతరం చంద్రబాబును ప్రధాని ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఈ సమయంలో చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం వీఐపీ గ్యాలరీ వైపు వెళ్లి కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, ఇతర ప్రముఖులకు పేరు పేరునా అభివాదం చేశారు.
మంత్రుల ప్రమాణ స్వీకారం
చంద్రబాబు ప్రమాణ స్వీకారం అనంతరం జనసేనాని పవన్ కల్యాణ్, నారా లోకేశ్, నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నారాయణ, పయ్యావుల కేశవ్, వంగలపూడి అనిత, నిమ్మల రామానాయుడు, గుమ్మిడి సంధ్యారాణి, అనగాని సత్యప్రసాద్, బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేశ్, బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్, ఎస్.సవిత, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, ఎన్ఎండీ ఫరూఖ్, ఆనం రామనారాయణరెడ్డి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, కొలుసు పార్థసారథి, సత్యకుమార్ యాదవ్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరికి శాఖల కేటాయింపుపై సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎవరికి ఏ శాఖ దక్కుతుందో అనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)