అన్వేషించండి

Nellore Vaccination: వ్యాక్సినేషన్‌లో నెల్లూరు జిల్లా రికార్డ్.. ఫస్ట్ డోస్ 100 శాతం పూర్తి

నెల్లూరు జిల్లా వ్యాక్సినేషన్‌లో రికార్డు సృష్టించింది. అర్హులైన వారందరికీ తొలి డోసు పూర్తి చేసిన జిల్లాగా రికార్డు నెలకొల్పింది. ఏపీలో 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న తొలి జిల్లా నెల్లూరు.

నెల్లూరు జిల్లా వ్యాక్సినేషన్లో రికార్డు సృష్టించింది. అర్హులైన వారందరికీ తొలి డోసు పూర్తి చేసిన జిల్లాగా రికార్డు నెలకొల్పింది. ఏపీలో 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న తొలి జిల్లా కూడా నెల్లూరు కావడం విశేషం. శనివారంతో నెల్లూరు ఈ ఘనత సాధించినట్టు అధికారిక ప్రకటన విడుదలైంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు నెల్లూరు రికార్డ్ సాధించిందని తన ట్విట్టర్ ఖాతాలో వెళ్లడించారు. ఈ ఘనత సాధించడంలో తోడ్పాటునందించిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదులు తెలిపారు. 

దేశవ్యాప్తంగా జనవరి 16న వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలు కాగా.. నెల్లూరు జిల్లాలో కూడా తొలుత హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్లకు టీకా పంపిణీ మొదలు పెట్టారు. నెల్లూరు జిల్లాలో మొత్తం 23,69,803 మందికి టీకాలు వేయాలనేది టార్గెట్.. దాన్ని అధికారులు అధిగమించారు.  ఇప్పటి వరకూ 23,69,803 మందికి తొలి డోసు పూర్తైనట్టు తెలిపారు. ఇతర ప్రాంతాలనుంచి వచ్చినవారికి కూడా టీకాలు వేయడంతో.. 100 శాతం మించి టీకాల పంపిణీ పూర్తయింది. నెల్లూరు జిల్లాలో ఆరు సార్లు స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ లు నిర్వహించారు అధికారులు. 


Nellore Vaccination: వ్యాక్సినేషన్‌లో నెల్లూరు జిల్లా రికార్డ్.. ఫస్ట్ డోస్ 100 శాతం పూర్తి

నెల్లూరు జిల్లాలోని 14 సచివాలయాల పరిధిలో వయోజనులకు నూటికి నూరుశాతం వ్యాక్సినేషన్ గతంలోనే పూర్తయింది. దీంతో ఆయా సచివాలయాల అధికారులను కలెక్టర్ చక్రధర్ బాబు సన్మానించారు. ఆరోగ్య సిబ్బంది చొరవతోపాటు, రెవెన్యూ సిబ్బంది ప్రచారం, సమన్వయం వల్లే ఈ ఘనత సాధించినట్టు చెబుతున్నారు ఉన్నతాధికారులు. సచివాలయ వ్యవస్థను పూర్తిగా ఉపయోగించుకోవడం వల్ల అనుకున్న లక్ష్యాన్ని ముందుగానే సాధించామని చెబుతున్నారు అదికారులు. అంతే కాకుండా వలస వెళ్తున్న వారిని  కూడా గుర్తించి శని, ఆదివారాల్లో అలాంటి వారందరికోసం ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టినట్టు తెలిపారు. 

నెల్లూరు జిల్లాలో దాదాపు అన్ని జిల్లాల్లో 90శాతం వ్యాక్సినేషన్ పూర్తయింది. నెల్లూరు జిల్లాలో 100 శాతం టీకాల పంపిణీ పూర్తి కాగా.. శ్రీకాకుళం జిల్లాలో 89శాతం మాత్రమే వ్యాక్సినేషన్ పూర్తయింది. నెల్లూరు జిల్లాలో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తయినందుకు సీఎం జగన్ కూడా అధికారులను అభినందించారు. సెకండ్ డోస్ కూడా ఇదే స్పీడ్ లో కొనసాగించాలని సూచించారు. 

ఒమిక్రాన్ అలర్ట్.. 
మరోవైపు దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు అధికారులు. ఇప్పటికే కొవిడ్ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించారు. విదేశాలనుంచి వచ్చేవారిపై నిఘా పెంచారు. 

Also Read: ఏపీ హైకోర్టు పరిధిదాటి వ్యవహరిస్తోంది... తమిళనాడు రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రు వ్యాఖ్యలు !

Also Read: ఆర్‌ఎంపీ ప్రాక్టీసనర్‌... పాలిక్లీనిక్‌ ఓనర్... కథ అక్కడే అడ్డం తిరిగి అడ్డంగా బుక్కయ్యాడు

Also Read: తాడేపల్లిలో చెడ్డీ గ్యాంగ్ కలకలం..! ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఇంట్లో చోరీ ?

Also Read: మూడో భార్యతో ఉంటూ.. రెండో భార్యను చంపాలని భర్త క్షుద్రపూజలు.. చేతబడికి పాస్ పోర్ట్ సైజ్ ఫొటో

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

School Holidays: అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
Tirupati DGP IGP Conference: తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
Srikakulam Crime News: విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
School Holidays: అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
Tirupati DGP IGP Conference: తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
Srikakulam Crime News: విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
Vijay Deverakonda Rashmika : విజయ్, రష్మికల వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారం - సైబర్ పోలీసులకు విరోష్ టీం కంప్లైంట్
విజయ్, రష్మికల వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారం - సైబర్ పోలీసులకు విరోష్ టీం కంప్లైంట్
Congress Politics: గోదావరి జలాలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం, ఆంధ్రాకు నీళ్లు పోవడం లేదు: కాంగ్రెస్ ఎంపీ చామల
గోదావరి జలాలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం, ఆంధ్రాకు నీళ్లు పోవడం లేదు: ఎంపీ చామల
This Week OTT Movies : ఈ వారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 16 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి డోంట్ మిస్
ఈ వారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 16 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి డోంట్ మిస్
Mahindra XUV 3XO పెట్రోల్‌తో పోలిస్తే CNG ఎంత ఆదా చేస్తుంది? రియల్ వరల్డ్ మైలేజీ టెస్ట్ పూర్తి వివరాలు
Mahindra XUV 3XO CNG నిజమైన మైలేజీ ఎంత? రియల్ వరల్డ్ టెస్ట్‌లో బయటపడిన అసలు లెక్కలు!
Embed widget