(Source: ECI/ABP News/ABP Majha)
Jammalamadugu Bridge: కడప జిల్లాలో కూలిపోయే స్థితిలో మరో బ్రిడ్జి... కుంగిన జమ్మలమడుగు-ముద్దనూరు వంతెన... రాకపోకలు బంద్
కడప జిల్లాలో మరో బ్రిడ్జి కూలిపోయే స్థితికి చేరింది. పెన్నానదిపై జమ్మలమడుగు బ్రిడ్జి మధ్యలో కుంగిపోయింది. దీంతో పోలీసులు వంతెనపై రాకపోకలు నిలిపివేశారు.
కడప జిల్లా జమ్మలమడుగులో పెన్నా నదిపై బ్రిడ్జి కుంగిపోయింది. వరద ఉద్ధృతి జమ్మలమడుగు-ముద్దనూరు రోడ్ బ్రిడ్జి కూలిపోయే పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసులు రాకపోకలు నిలిపివేశారు. వరద నీరు పెన్నా నదిలో ఉద్దృతంగా ప్రవహించడంతో బ్రిడ్జి మధ్య భాగం కుంగిపోతుంది. దీంతో జమ్మలమడుగు-ముద్దనూరు పులివెందుల మధ్య రాకపోకలు నిలిపివేశారు. వైఎస్ రాజశేఖరెడ్డి హయాంలో ఈ బ్రిడ్జి నిర్మించారు. గత వారం రోజులుగా మైలవరం నుంచి భారీ వరద రావడంతో బ్రిడ్జి కుంగుపోయిందని అధికారులు తెలిపారు. జమ్మలమడుగు పెన్నానది బిడ్జిపై భారీ వాహనాలు తిరుగుతుండేవి. జమ్మలమడుగు పెన్నానది ఉన్న వంతెనపై సిమెంట్ లారీలు, భారీ వాహనాలు ఎక్కువగా తిరిగేవని స్థానికులు చెబుతున్నారు.
Also Read: వర్షాలు కారణంగా శ్రీవారి దర్శనం చేసుకోలేపోయిన వారికి టీటీడీ శుభవార్త
కూలిపోయిన కమలాపురం బ్రిడ్జి
కడప జిల్లాలో పాపాగ్ని నది వరద ఉద్ధృతికి కమలాపురం బ్రిడ్జి కుంగిపోయింది. కొంత మేర కూలిపోయింది. వరద ధాటికి చీలిపోయిన బ్రిడ్జి క్రమ క్రమంగా కుంగిపోయింది. బ్రిడ్జి మధ్య భాగంలో ఆరు స్లాబులు చీలిపోయి నీటిలోకి క్రమంగా కుంగిపోతున్నాయి. వంతెన కుంగిపోవడంతో శనివారం రాత్రి అప్రమత్తమైన పోలీసులు బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేశారు. కడప-కమలాపురం మధ్య రాకపోకలు బంద్ చేస్తున్నట్లు తెలిపారు. ఇరువైపులా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Also Read: ఓ అడుగు వెనక్కి వేసి.. మరో అవకాశం సృష్టించుకున్న జగన్ ! బిల్లుల ఉపసంహరణ వెనుక పక్కా రాజకీయ వ్యూహం !
కడప-అనంతపురం జిల్లాల మధ్య రాకపోకలు బంద్
కమలాపురం, వల్లూరు మార్గ మధ్యలోని వంతెన శనివారం సాయంత్రం కుంగిపోయింది. రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు వంతెన పలు చోట్ల నెరలిచ్చింది. వెలిగల్లు జలాశయం నుంచి నాలుగు గేట్లు ఎత్తేయడంతో భారీగా వరద నీరు వంతెన పై అంచు వరకు రెండు రోజులుగా ప్రవహించింది. దీంతో వంతెన బాగా నానిపోయి కూలిపోయే స్థితికి చేరింది. విషయం తెలుసుకున్న వల్లూరు, కమలాపురం, ఎస్.ఐ.విష్ణువర్ధన్, కొండారెడ్డి తమ సిబ్బందితో వంతెన వద్ద పరిస్థితిని పరిశీలించారు. శనివారం రాత్రి 10 గంటల సమయంలో ఆరు స్తంభాల వరకు వంతెన కూలిపోయింది. 1977లో నిర్మించిన వంతెన కావడంతో భారీ వర్షాల కారణంగా కూలిపోయినట్లు జాతీయ రహదారి ఈఈ ఓబుల్‌రెడ్డి తెలిపారు. దీంతో కడప-అనంతపురం జిల్లాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
Also Read: ఒకే ఒక్కడు.. వెయ్యిమందిని కాపాడాడు.. కోవూరు ఎస్సైకి జనం జేజేలు