అన్వేషించండి

Nellore Floods: ఒకే ఒక్కడు.. వెయ్యిమందిని కాపాడాడు.. కోవూరు ఎస్సైకి జనం జేజేలు

కోవూరు ఎస్సై వెంకటేశ్వరరావు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో కలిసి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. శనివారం విధులకు వచ్చిన ఆయన, ఇంటికి వెళ్లకుండా ఆదివారం సాయంత్రం వరకు సహాయక చర్యలను పర్యవేక్షిస్తూనే ఉన్నారు.

నెల్లూరు జిల్లాలో వరద తాకిడికి వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. ఇళ్లలోకి నీరు చేరి ఇబ్బంది పడ్డారు. బయటకు వచ్చి గమ్యస్థానాలు చేరుకోలేక కొంతమంది, ఇళ్లలోకి నీరు చేరి పునరావాస కేంద్రాల దగ్గరకు వెళ్లలేక మరికొందరు అవస్థలు పడ్డారు. ఇలాంటి వారందరికీ ఆపద్బాంధవుడిలా మారారు కోవూరు ఎస్సై వెంకటేశ్వరరావు. 

నెల్లూరు జిల్లా కోవూరు మండలం పరిధిలోని కోవూరు, సాలుచింతల సహా ఇతర ప్రాంతాల్లో ఈ దఫా వరద బీభత్సం సృష్టించింది. పెన్నాకు వరదలు వచ్చినప్పుడు కోవూరు మండలంపై ఆ ప్రభావం తక్కువగా ఉండేది. నెల్లూరు నగరం పరిధిలోని పొర్లుకట్ట, వెంకటేశ్వర పురం ఇతర ప్రాంతాలు నీటమునిగేవి కానీ, కోవూరులో ఆ ప్రమాదం తక్కువ. కానీ ఈ సారి పెన్నా వరద కోవూరుకి తీవ్ర నష్టం కలిగించింది. కోవూరు మండలం పరిధిలోని అనేక గ్రామాలు నీటమునిగాయి. ప్రజలు బిక్కు బిక్కుమంటూ ఇళ్లలో చిక్కుకుపోయారు. Nellore Floods: ఒకే ఒక్కడు.. వెయ్యిమందిని కాపాడాడు.. కోవూరు ఎస్సైకి జనం జేజేలు

ఈ దశలో కోవూరు ఎస్సై వెంకటేశ్వరరావు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో కలసి సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొన్నారు. శనివారం విధులకు వచ్చిన ఆయన, ఇంటికి వెళ్లకుండా ఆదివారం సాయంత్రం వరకు సహాయక చర్యలను పర్యవేక్షిస్తూనే ఉన్నారు. దాదాపుగా వెయ్యిమందిని ఆయన సురక్షిత ప్రాంతాలకు తరలించారని సమాచారం. వరదల్లో చిక్కుకుపోయిన ఐటీఐ కాలేజీ విద్యార్థులను కూడా రక్షించింది ఈయనే. 25మంది విద్యార్థులు వరదలో చిక్కుకుపోగా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఎస్సై వెంకటేశ్వరరావు. 

Also Read: ఓ అడుగు వెనక్కి వేసి.. మరో అవకాశం సృష్టించుకున్న జగన్ ! బిల్లుల ఉపసంహరణ వెనుక పక్కా రాజకీయ వ్యూహం !

ప్రచారానికి దూరం.. 
వరద బాధితులను పడవల్లో తీసుకొచ్చే విషయంలో నెల్లూరు జిల్లాలో కొంతమంది పోలీసులు ప్రచారానికి ఎంత విలువిచ్చారో కొన్ని వీడియోలు బయటపడ్డాయి. సాక్షాత్తూ సీఐ కేడర్ లోని ఓ అధికారి.. కెమెరాకు అడ్డంగా ఉన్నావంటూ కానిస్టేబుల్ పై చేయి చేసుకున్నారు. కెమెరాకు అడ్డం వచ్చిన ప్రతి ఒక్కరికీ చీవాట్లు పెట్టారు. అయితే కోవూరు ఎస్సై కనీసం తన వెంట మీడియాని కూడా తీసుకెళ్లలేదు. తన ఫోన్ ఇచ్చి ఎవరినీ ఫొటోలు తీయమని కూడా చెప్పలేదు. ఫొటోలు కాదు ముఖ్యం, చేసే పని ముఖ్యం అనేది ఆయన ఆలోచన. అందుకే ఆయన ఎక్కడెక్కడ, ఎంతమందికి సాయం చేశాడనేది మీడియా ద్వారా బయటకు రాలేదు, కనీసం ఆ వీడియోలు కూడా లేవు. 

Also Read: వర్షాలు కారణంగా శ్రీవారి దర్శనం చేసుకోలేపోయిన వారికి టీటీడీ శుభవార్త

స్థానికంగా జేజేలు.. 
స్థానికులు ఎస్సై వెంకటేశ్వరరావు చొరవపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యక్షంగా తమను వరదల్లో ఒడ్డుకు చేర్చారని, వందలాది మందిని ఆయన స్వయంగా పడవల్లో తీసుకొచ్చారని, వృద్ధులు, వికలాంగులు, పిల్లలకు తొలుత ప్రాధాన్యమిచ్చి సురక్షిత ప్రాంతాలకు తరలించారని చెబుతున్నారు కోవూరు ప్రజలు. 

Also Read: తక్కువ ధరకే బైక్ కావాలా నాయనా.. హా కావాలి.. అన్నారో అంతే.. మీ ఆశే ఆమెకి బిజినెస్ 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
US Presidential Election: స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
Manda krishna on Pawan: మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
Game Changer: 'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ టెర్రర్ ఏజెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్!బాంబు వెలిగించి దానిపై కూర్చున్న యువకుడు - షాకింగ్ సీసీటీవీ వీడియో!పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందనAndhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
US Presidential Election: స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
Manda krishna on Pawan: మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
Game Changer: 'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
Parliament Sessions: 25 నుంచి పార్లమెంట్ సమావేశాలు -  రాజ్యాంగ సవరణల కోసమే ఉభయసభల సంయుక్త సమావేశం ?
25 నుంచి పార్లమెంట్ సమావేశాలు - రాజ్యాంగ సవరణల కోసమే ఉభయసభల సంయుక్త సమావేశం ?
US Presidential Election 2024: అమెరికాలో ఓటింగ్ ప్రారంభం, తొలి ఫలితం రావడంతో పెరిగిన ఉత్కంఠ
అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ఓటింగ్ ప్రారంభం, తొలి ఫలితం రావడంతో పెరిగిన ఉత్కంఠ
Chetan Maddineni: తెలుగు హీరోలకు థియేటర్ల కష్టాలు... మొన్న కిరణ్ అబ్బవరం, నేడు చేతన్ మద్దినేని
తెలుగు హీరోలకు థియేటర్ల కష్టాలు... మొన్న కిరణ్ అబ్బవరం, నేడు చేతన్ మద్దినేని
Embed widget