CJI NV Ramana On NTR : రిటైరయ్యాక ఎన్టీఆర్‌పై పుస్తకం రాస్తా - తిరుపతిలో సీజేఐ ఎన్వీ రమణ ప్రకటన
రిటైరయ్యాక ఎన్టీఆర్ గురించి పుస్తకం రాస్తానని సీజేఐ ఎన్వీ రమణ ప్రకటించారు. ఎన్టీఆర్‌తో తనకు ఎంతో అనుబంధం ఉందన్నారు.
CJI NV Ramana On NTR : మహానటుడు ఎన్టీఆర్‌తో తనకెంతో అనుబంధం ఉండేదని, ఆయన జనం నాడి తెలిసిన వ్యక్తి అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ అన్నారు. తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో ( SVU ) ఎన్టీఆర్ శతజయంతి వేడుకల సందర్భంగా గురువారం జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ కు వ్యక్తిగత, కుటుంబ విషయాల్లో ఆయనకు న్యాయపరమైన సలహాలు ఇచ్చేవాడిని. ఎన్టీఆర్‌కు పద్మ, ఫాల్కే వంటి అవార్డులు దక్కకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.
క్రూయిజ్ షిప్ అంటే అలలపై ఇంద్రభవనం లాంటిది.. లోపల ఎలా ఉంటుందో తెలుసా?
ఎన్టీఆర్‌తో ఎంతో అనుబంధం
తిరుపతితో ఎన్టీఆర్‌కు ( NTR ) ఎంతో అనుబంధం ఉంది. ఆయన గురించి ఎంత మాట్లాడినా తక్కువే. ఆయన ఓ సమగ్ర సమతా మూర్తి. రైతు బిడ్డగా, రంగస్థల నటుడిగా, కథా నాయకుడిగా, రాజకీయ నాయకుడిగా ఆయన ఎదిగారు. ఎన్టీఆర్ జనం నాడి తెలిసిన వ్యక్తి. పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లో అధికారం దక్కించుకున్న సంచలన వ్యక్తి ఎన్టీఆర్. ఆయనతో నాకెంతో సన్నిహిత సంబంధం ఉండేది. నాపై ఎన్టీఆర్ మనిషి అనే ముద్ర వేశారు. దీనికి నేనెంతో గర్విస్తున్నానని వ్యాఖ్యానించారు.
గది కేటాయించలేదని టీటీడీ ఉద్యోగిపై వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే పీఆర్వో దాడి - తిరుమలలో కలకలం !
ఎన్టీఆర్‌ను దగ్గరగా చూశాను
కాలేజీలో చదివే రోజుల్లోనే నేను ఆయన అభిమానిని. 1983లో ఆయన కోసం పరోక్షంగా పనిచేశాను. సంక్షోభ సమయంలో ఆయన తరఫున వాదించడానికి ఎవ్వరూ లేరు. కానీ, ప్రజాభిమానంతో ఆయన తిరిగి పదవి దక్కించుకున్నారు. అధికారం కోల్పోయిన తర్వాత ఆయన వెంట ఎవ్వరూ రాలేదు. అది నేను దగ్గరగా చూశాను. అప్పట్లో ఢిల్లీకి ఆయన నన్ను తీసుకెళ్లేవారు. ఆయనకు మందులు అందించేవాడిని. రిటైర్ అయ్యాక ఎన్టీఆర్ గురించి పుస్తకం రాస్తాను అని ఎన్వీ రమణ ప్రకటించారు.
పయ్యావుల పేరు చెప్పి కొట్టుకుంటున్న మాజీ ఎమ్మెల్యే కుటుంబీకులు - ఉరవకొండ వైఎస్ఆర్‌సీపీలో రచ్చ !
రిటైరయ్యాక పుస్తకం రాస్తా
తెలుగుజాతి ఐక్యంగా ఉండాల్సింది. ఈ విషయంలో తమిళనాడు ఆదర్శం. ఎన్టీఆర్‌కు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కేలా అందరూ కృషి చేయాలి. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ఊరూవాడా జరగాలి అని ఎన్వీ రమణ పిలుపునిచ్చారు.